Movie News

అలియా భట్ సినిమాకి ఇంత నెగిటివిటీనా

బాలీవుడ్ మూవీ అల్ఫా ఇవాళ విడుదలైన సంగతి తెలిసిందే. అలియా భట్ టైటిల్ రోల్ పోషించగా శార్వరి వాఘ్ మరో కీలకమైన పాత్రలో కనిపించింది. దురంధర్ తర్వాత ఇలాంటి స్పై సినిమాలను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే అనుమానం ఉత్తరాది వర్గాల్లో బలంగా ఉంది. ఆ భయమే నిజమయ్యింది. అల్ఫా మీద మీడియాలో విపరీతమైన నెగటివిటీ కనిపిస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియా ఫేమస్ హ్యాండిల్స్ ఒకటి నుంచి రెండు లోపలే రివ్యూ రేటింగ్స్ ఇచ్చాయి.

ఎందుకిలా జరిగిందో చూద్దాం. ఆల్ఫా కథ ఎన్నోసార్లు అరిగిపోయిన స్పై డ్రామా టెంప్లేట్ లోనే సాగుతుంది. సీత (అలియా భట్) అనే చిన్నపిల్లని కల్నల్ లఖావత్ అలియాస్ బాబా (బాబీ డియోల్) పసితనం నుంచే క్రూరమైన ఫైటర్ గా శిక్షణ ఇస్తాడు. ఆమె పెరిగి పెద్దయ్యాక దేశద్రోహిగా మారిన కల్నల్ మీద సీత ఎదురు తిరిగే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో మరో ఏజెంట్ (శార్వరి)తో చేతులు కలుపుతుంది. ఈ ఇద్దరూ కలిసి బాబాని ఎలా అడ్డుకున్నారనేదే స్టోరీ.

యష్ రాజ్ ఫిలిమ్స్ అధినేత కం కథా రచయిత ఆదిత్య చోప్రా తన రెగ్యులర్ పంథాలోనే అల్ఫా రాసుకున్నారు. దర్శకుడు శివ్ రవైల్ దాన్నే గుడ్డిగా ఫాలో అయిపోయారు. ఫిజిక్స్ ని ఛాలెంజ్ చేసే ఫైట్లు, ఎమోషన్లు లేకుండా యాక్షన్ ఎపిసోడ్లు, పాకిస్థాన్ ప్రస్తావన బలవంతంగా ఇరికించి రాసే విలన్ బ్యాక్ డ్రాప్ ఇవన్నీ ఇందులోనూ ఉన్నాయి. టైగర్ 3, వార్ 2 దారుణంగా ఫెయిలయ్యాక కూడా మళ్ళీ అదే రూట్ లో ఈ ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ తీయడం విచిత్రం.

అల్పాతో యష్ రాజ్ స్పై యూనివర్స్ కి బ్రేక్ పడుతుందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. కంటెంట్ ఎంత వీక్ గా ఉందంటే పేలిపోవాల్సిన హృతిక్ రోషన్ క్యామియో సైతం ఫోర్స్డ్ గా డల్లుగా అనిపించింది. రెండున్నర గంటల పాటు వావ్ అనిపించే అవకాశమే ఇవ్వకుండా అల్ఫా మన ఓపికకు పెద్ద పరీక్ష పెడుతుంది. రెండేళ్లు గ్యాప్ తీసుకున్న అలియా భట్ కు సరైన కంబ్యాక్ ఇచ్చే అవకాశం అల్ఫా ఇవ్వలేదు. దీని దెబ్బకు టైగర్ వర్సెస్ పఠాన్, టైగర్ 4, వార్ 3 అసలు ఉంటాయో లేదో.

This post was last modified on July 3, 2026 3:10 pm

Share

Recent Posts

డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ చేసేవాడ్ని

నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…

2 hours ago

ప్యార‌డైజ్ ద‌ర్శ‌కుడు రాజమౌళి ద‌గ్గ‌ర చేరతాడ‌ట‌

ఇండియాస్ నంబ‌ర్ వన్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ విభాగంలో ప‌ని చేయాల‌ని కాబోయే డైరెక్ట‌ర్ కావాల‌నుకున్న ప్ర‌తి వ్య‌క్తికీ…

2 hours ago

ట్రైలర్ లేకపోవడం ఎంత వరకు సేఫ్

అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…

5 hours ago

ఇంద్ర చూపిన దారిలో మిగిలినవీ రావాలి

తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…

6 hours ago

అసలు భయాన్ని థియేటర్‌లో చూపిస్తారేమో

ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…

7 hours ago

తెలుగులో లేట్ రిలీజ్ పర్లేదంటారా

బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…

9 hours ago