టాలీవుడ్ జనాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారీ ప్రాజెక్ట్ వారణాసి రిలీజ్ డేట్ 2027 ఏప్రిల్ 7 అని ఇదివరకే లాక్ అయింది. ఉగాది పండగ సందర్భంగా ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ పక్కా ప్లాన్ తో ఉన్నారు. అయితే ఈ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ విన్నాక అందరి మైండ్ లో మొదలైన ఒకే ఒక్క డౌట్ ఏంటంటే, అంత తక్కువ టైమ్ లో రాజమౌళి టీమ్ భారీ వీఎఫ్ఎక్స్ పనులను పూర్తి చేయగలదా అనేది.
రాజమౌళి సినిమాల షూటింగ్ పూర్తయ్యాక పోస్ట్ ప్రొడక్షన్, ముఖ్యంగా గ్రాఫిక్స్ పనుల కోసం ఏళ్ల తరబడి సమయం తీసుకుంటుంటారు. కానీ ఈ సినిమాకు అక్టోబర్ 2026 కల్లా షూటింగ్ మొత్తం ప్యాకప్ చెప్పేలా కౌంట్‌డౌన్ రన్ అవుతోంది. అక్కడి నుండి ఏప్రిల్ 2027 రిలీజ్ కి చూసుకుంటే కేవలం ఐదారు నెలల టైమ్ మాత్రమే ఉంటుంది. ఈ కొద్ది కాలంలోనే ఈ గ్లోబల్ అడ్వెంచర్ సినిమా గ్రాఫిక్స్ ని పర్ఫెక్ట్ గా ఫినిష్ చేయడం నిజంగా ఒక పెద్ద సవాలే. దానికి తోడు వరల్డ్ వైడ్ ప్రమోషన్.
అయితే ఈసారి రాజమౌళి ఒక రివర్స్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. సినిమాలోని మేజర్ హై యాక్షన్ సీక్వెన్స్ ల షూటింగ్ ని ఆల్రెడీ పూర్తిగా ముగించేశారు. అంటే భారీ గ్రాఫిక్స్ అవసరమయ్యే మెయిన్ సీన్లు అన్నీ ఎప్పుడో కంప్లీట్ అయిపోయి, సమాంతరంగా వాటి వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ప్రస్తుతం కేవలం చిన్న చిన్న కనెక్టింగ్ సీన్స్ కోసం మాత్రమే 80 రోజుల టాకీ పార్ట్ షూటింగ్ మిగిలి ఉందని తెలుస్తోంది.
ఈ ప్లానింగ్ వల్ల షూటింగ్ మొత్తం ప్యాకప్ అయ్యే లోపే సగం కంటే ఎక్కువ గ్రాఫిక్స్ పనులు ఒక కొలిక్కి వచ్చేస్తాయి. సినిమాలో టైమ్ ట్రావెల్, పురాణాల బ్యాక్ డ్రాప్ ఉండటంతో పాటు ఒక భారీ వానర యుద్ధాన్ని కూడా వీఎఫ్ఎక్స్ ద్వారా చూపించబోతున్నారు. ఇలాంటి వరల్డ్ క్లాస్ విజువల్స్ ని తక్కువ టైమ్ లో అవుట్ పుట్ తీసుకురావడానికి గ్లోబల్ లెవెల్ లోని టాప్ స్టూడియోస్ ని రంగంలోకి దించారు.
ప్రతీ చిన్న డిటైలింగ్ ని చెక్ చేసుకునే రాజమౌళి, ఈ ఐదారు నెలల పోస్ట్ ప్రొడక్షన్ పీరియడ్ ని డే అండ్ నైట్ షిఫ్ట్ లతో బ్యాలెన్స్ చేయబోతున్నారు. అక్టోబర్ లో టాకీ పార్ట్ క్లోజ్ అవ్వగానే కేవలం ఎడిటింగ్, ప్యాచ్ వర్క్, కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పనులపైనే టీమ్ పూర్తిగా ఫోకస్ పెడుతుంది. ఈ స్పీడ్ వర్క్ గనుక అనుకున్నట్లు జరిగితే ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత వేగంగా గ్రాఫిక్స్ పూర్తి చేసుకున్న భారీ ప్రాజెక్ట్ గా వారణాసి రికార్డు సృష్టిస్తుంది.
This post was last modified on July 1, 2026 3:50 pm
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…
వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…
భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1…
వేణుంబాక విజయసాయిరెడ్డి… వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అధినేత జగన్ కు నమ్మినబంటు. పార్టీలో జగన్ తర్వాత నంబర్…