Movie News

అనిరుధ్ అంత ఒత్తిడిని తట్టుకోగలడా

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ప్యాన్ ఇండియా మూవీ అనౌన్స్ మెంట్ వచ్చాక అభిమానులతో పాటు సగటు మూవీ లవర్స్ లో మెదులుతున్న ప్రశ్న ఒకటుంది. అదే సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ పనితనం గురించి. ఇప్పటికే ఎన్నో కమర్షియల్, మ్యూజికల్, రొమాంటిక్ చిత్రాలకు బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చిన ఈ యువ సంచలనం ఒక డివోషనల్ టచ్ ఉన్న మైథాలజీని ఇంతవరకు చేయలేదు. ఇదే మొదటిసారి. అది ఎంత ప్లస్ అవుతుందో అంతే ఒత్తిడి రూపంలో మైనస్ అవుతుంది.

ఎందుకంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసుకున్న సబ్జెక్టు అలాంటిది. శివ పార్వతులు, కుమారస్వామి, హైందవ సిద్ధాంతాలు, పురాణాలు ఇవన్నీ మేళవించి ఒక సోషియో ఫాంటసీ ప్రపంచంలోకి తీసుకెళ్ళబోతున్నారు. ఇందులో భాగంగా రెగ్యులర్ సాంగ్స్ పాటు భక్తికి సంబంధించిన స్తోత్రాలు, గీతాలు కంపోజ్ చేయాల్సి ఉంటుంది. అఖండలో తమన్ దీన్ని విజయవంతంగా నిర్వహించగలిగాడు. ఒకప్పుడు ఇళయరాజా శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం లాంటి సినిమాలతో క్లాసిక్స్ ఇచ్చారు.

అన్నమయ్య ద్వారా కీరవాణి తమ ముద్రని నిరూపించుకున్నారు. రాబోయే వారణాసిలో శివుడు, రాముడు మీద అద్భుతమైన సాంగ్స్ ఉన్నాయట. సో అనిరుద్ రవిచందర్ వీళ్ళ స్థాయిలో సత్తా చాటుకోవాల్సి ఉంటుంది. జైలర్, కూలి, దేవర లాంటివి ఒక ఎత్తు అయితే ఇప్పుడీ తారక్ త్రివిక్రమ్ మూవీ ఒక ఎత్తు. అందులోనూ త్రివిక్రమ్ కు గతంలో అజ్ఞాతవాసి రూపంలో ఒక డిజాస్టర్ కు పని చేసిన అనుభవం అనిరుద్ కు ఉంది. దాన్ని ఇప్పుడు పోగొట్టుకోవాలి.

టైం చాలా ఉంది కాబట్టి ఇప్పుడీ టాపిక్ ఎందుకని అనుకోవడానికి లేదు. ఆదర్శ కుటుంబం రిలీజ్ కాగానే జూనియర్ ఎన్టీఆర్ సినిమా పనులు వేగవంతం చేస్తారు. డ్రాగన్ నవంబర్ లేదా డిసెంబర్ కల్లా పూర్తి చేసే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. సో జనవరి నుంచే మాటల మాంత్రికుడి మాయాజాలం సెట్స్ మీదకు వెళ్లినా ఆశ్చర్యం లేదు. కాకపోతే షూట్ కు ఎంత సమయం పడుతుంది, పోస్ట్ ప్రొడక్షన్ ఎంత టైమ్ తీసుకుంటుందనేది ఇప్పుడే చెప్పలేం.

This post was last modified on June 30, 2026 11:21 pm

Share

Recent Posts

లోక‌ల్ వార్‌.. వైసీపీ వాటిని వ‌దులుకోవాల్సిందే భ‌య్యా.. !

స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసుకునేందుకు కూటమి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70% స్థానిక…

2 hours ago

బాబాయ్ గొడ్డలి జపమైపోయింది

రాష్ట్రంలో గొడ్డలి పార్టీ అనగానే ప్రతి ఒక్కరికీ వైసీపీ పార్టీ గుర్తుకు వస్తుంది. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి…

4 hours ago

సుకుమార్ ఏం మార్పు కోరుకుంటున్నట్లు?

పెద్ద దర్శకులు కొందరు తమ టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటారు. తమ‌తో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్…

5 hours ago

రేట్లు కావాలి కానీ రజినీ రాడు

సూపర్ స్టార్ రజినీకాంత్‌కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడి పెద్ద హీరోలకు ఏమాత్రం…

5 hours ago

ముగ్గుర్ని చంపేస్తే నాన్న చూసుకుంటాడా?

ఈ మధ్యకాలంలో హిట్ అండ్ రన్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఇక, కొందరు డబ్బున్న బడాబాబుల పిల్లలు, కొందరు రాజకీయ నాయకుల…

5 hours ago

రామాయణం కన్నా ఆదిపురుష్ నయం ఏమో?

‘రామాయణం’ రెండు భాగాలకు కలిపి రూ.4 వేల కోట్ల బడ్జెట్ పెట్టినట్లు దాని నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రకటించినపుడు అందరికీ…

6 hours ago