Movie News

కళ్యాణ్ రామ్ మీద నవ్వించే బరువు

వెంకటేష్, అనిల్ రావిపూడి అయిదోసారి చేతులు కలిపిన మల్టీస్టారర్ ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. వెంకీకి తోడుగా కళ్యాణ్ రామ్ చేరడం నందమూడి అభిమానుల్లో ఆసక్తి పెంచింది. అయితే అంతకన్నా బరువు మరొకటి ఉంది. వాళ్లతో పాటు దగ్గుబాటి ఫ్యాన్స్ అంచనాలు అందుకోవాల్సిన బాధ్యత కళ్యాణ్ రామ్ మీద ఉంది. అదెలాగో చూద్దాం. వెంకటేష్ టైమింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన పక్కన కామెడీ పండించడం అంత ఈజీగా కాదు.

కళ్యాణ్ రామ్ చూస్తేనేమో మాస్ హీరో. తన మీద ఫుల్ కామెడీ ఎవరూ ప్లే చేయలేదు. రావిపూడి మొదటి సినిమా పటాస్ లో అక్కడక్కడా జోకులు ఉంటాయి కానీ తన పాత్ర వరకు అధిక శాతం కమర్షియల్ కలర్ లో సీరియస్ గా సాగుతుంది. సో వెంకీని మ్యాచ్ చేస్తూ మేజిక్ చేయాలి. మాటల్లో చెప్పినంత సులభంగా అయితే ఉండదు. ఎఫ్2, ఎఫ్ 3లో వరుణ్ తేజ్ తో ఎలా అయితే అనిల్ రావిపూడి మేనేజ్ చేయించారో ఈ సినిమాలో అదే చేయొచ్చు.

ఇందులో కళ్యాణ్ రామ్, కృతి శెట్టి మీద విడిగా పాటలు కూడా పెట్టారు. ప్రస్తుతం ఒకటి షూట్ లో ఉంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో బావ బావమరిది కాన్సెప్ట్ తో హిలేరియస్ ఫన్ రాసుకున్నట్టు అంతర్గతంగా వినిపిస్తున్న సమాచారం. సో వెంకటేష్ తో సమానంగా హాస్యాన్ని పండించడం కళ్యాణ్ రామ్ కో సవాల్ అనే చెప్పాలి. మొన్న అనౌన్స్ మెంట్ వీడియోలో ఎవరి డామినేషన్ ఉందో అందరూ చూశారు. సో ఈ సవాల్ ని స్వీకరించి గెలవాల్సి ఉంటుంది.

ఇక వ్యక్తిగత కెరీర్ చూసుకుంటే చాలా ఆశలు పెట్టుకున్న అర్జున్ సన్నాఫ్ వైజయంతి తీవ్రంగా నిరాశ పరచడం కళ్యాణ్ రామ్ కు పెద్ద షాక్ అయ్యింది. బింబిసార 2 ప్రకటించి సంవత్సరం దాటినా దాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లేంత బడ్జెట్ ప్రస్తుతం లేదట. అందుకే వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ఇప్పుడీ సినిమా కనక హిట్ అయితే కళ్యాణ్ రామ్ కు తిరిగి కొత్త ఉత్సాహం వస్తుంది. ఫ్లాపుల్లో ఉన్నప్పుడు రావిపూడే పటాస్ రూపంలో సూపర్ హిట్ ఇచ్చారు. ఇప్పుడూ రిపీట్ చేస్తారేమో చూడాలి.

This post was last modified on June 23, 2026 10:39 pm

Share

Recent Posts

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

1 hour ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

1 hour ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

3 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

5 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

5 hours ago

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

6 hours ago