తమ సినిమాల మీద, దాని కోసం పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్ల మీద ఆయా చిత్ర బృందాలకు అపారమైన నమ్మకం ఉండొచ్చు. సినిమా ఔట్ పుట్ చూసి వాళ్లు ఎగ్జైట్ కావచ్చు. స్టేజ్ మీద తమ ధీమాను ప్రకటించడంలో తప్పేమీ లేదు. కానీ ఈ క్రమంలో తమ సినిమాకు, అందులో పని చేసిన వాళ్లకు ఎలివేషన్లు ఇవ్వడంలో హద్దులు దాటిపోతేనే కష్టం.
ఇంకో రెండు వారాల్లో విడుదల కాబోతున్న రావు బహదూర్ సినిమా విషయంలో టీం మెంబర్స్ ఇస్తున్న స్టేట్మెంట్లు ఇలాగే శ్రుతి మించుతున్నాయనే ఫీలింగ్ జనాలకు కలుగుతున్నాయి.
బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాల తర్వాత వేరే ఇండస్ట్రీల వాళ్లు మాట్లాడుకునే రేంజ్ సినిమా ఇదని.. బ్రేక్‌ఫాస్ట్‌లో కేరాఫ్ కంచరపాలెం సినిమాను ఇది తినేస్తుందని ఇటీవల ఒక ఈవెంట్లో సత్యదేవ్ చేసిన వ్యాఖ్యలు ఎంత అతిగా అనిపించాయో తెలిసిందే. ఆ వేడుకలో మిగతా టీం మెంబర్స్ కూడా ఈ సినిమాకు మామూలు ఎలివేషన్లు ఇవ్వలేదు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఈవెంట్లో దర్శకుడు వెంకటేష్ మహా ఇచ్చిన ఇంకో స్టేట్మెంట్ అందరినీ షాక్‌కు గురి చేసింది. కమల్ హాసన్ స్థానాన్ని భర్తీ చేసే నటుడంటూ సత్యదేవ్‌కు అతడిచ్చిన ఎలివేషన్ టూమచ్ అనే ఫీలింగ్ కలుగుతోంది. కొన్నేళ్ల ముందు కమల్ పెర్ఫామెన్స్‌లో తనను రీప్లేస్ చేసే నటుడు వచ్చిన రోజు తాను రిటైరవుతానని పేర్కొన్నట్లు ఎక్కడో విన్నానని పేర్కొంటూ.. ఈ జనరేషన్లో కమల్ హాసన్ స్థాయి పెర్ఫామెన్స్ ఇచ్చే నటుడు ఒకడు వచ్చేశాడంటూ సత్యదేవ్ పేరు చెప్పాడు మహా.
కమల్ హాసన్ అంటే తమకు చాలా ఇష్టమని, ఆయన రిటైరవ్వాల్సిన అవసరం లేదని, ఇండస్ట్రీలో కొనసాగాలని.. కానీ ఆయనలాంటి పెర్ఫామెన్స్ ఇచ్చే నటుడు సత్యదేవ్ అని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేశాడు మహా. సత్యదేవ్ మంచి నటుడనడంలో సందేహం లేదు. కానీ కమల్ హాసన్‌తో పోల్చడం అంటే మరీ టూమచ్. మహా మహా నటులనే కమల్‌తో పోల్చాలంటే సందేహించాల్సిన పరిస్థితి. అలాంటిది సత్యదేవ్ ఆయనకు రీప్లేస్మెంట్ అనడం అతిశయోక్తి అనడంలో సందేహం లేదు.
This post was last modified on June 20, 2026 8:28 pm
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…
భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…
యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…
నైజాంలో డీసెంట్ గా నెట్టుకొస్తున్న ప్యారడైజ్ రెండో వారంలోకి అడుగు పెట్టడానికి ముందే ఆంధ్ర, సీడెడ్ సైడ్ బాగా నెమ్మదించిపోవడం…
ఏ నిముషంలో దానం నాగేందర్ పార్టీ మారి ఎమ్మెల్యే పదవి కోల్పోయాడో కానీ తెలంగాణా రాజకీయాలు మరింత సందడిగా మారిపోయాయి.…