సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రాశీ సింగ్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటోలు భలే ఆకట్టుకుంటున్నాయి. బ్రైట్ పింక్ కలర్ శారీలో, దానికి మ్యాచ్ అయ్యే స్లీవ్ లెస్ బ్లౌజ్ లో ఆమె చాలా అందంగా కనిపిస్తోంది. పచ్చని చెట్ల బ్యాక్ గ్రౌండ్ లో చేతిలో తెల్ల గులాబీలు పట్టుకుని ఆమె ఇచ్చిన స్మైల్ ఫ్యాన్స్ కు బాగా నచ్చేసింది. అతిగా మేకప్ లేకుండా చాలా సింపుల్ అండ్ నాచురల్ లుక్ తో తన గ్లామర్ ను చాలా నీట్ గా ప్రజెంట్ చేసింది.
ఒకవైపు ఇలాంటి క్యూట్ ఫోటోషూట్స్ తో ఆకట్టుకుంటూనే, మరోవైపు సినిమాల్లో కూడా డిఫరెంట్ రోల్స్ తో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది రాశీ సింగ్. అసలు సినిమాల్లోకి రాకముందు తను ప్రొఫెషనల్ ఎయిర్ హోస్టెస్ గా పనిచేసింది, అలాగే మిస్ ఛత్తీస్ గఢ్ అందాల పోటీల్లో సెకండ్ ప్లేస్ కూడా సాధించింది. 2021లో వచ్చిన ‘శశి’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ, ఆ తర్వాత వరుసపెట్టి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు, థ్రిల్లర్స్ ఎంచుకుంటూ ముందుకెళ్తోంది.
ఆమధ్య వచ్చిన ‘ప్రసన్న వదనం’ సినిమాలో ఏసీపీ వైదేహిగా ఎలాంటి గ్లామర్ లేని పవర్ ఫుల్ రోల్ లో తన యాక్టింగ్ ఏంటో ప్రూవ్ చేసుకుంది. అలాగే లేటెస్ట్ గా థియేటర్లలోకి వచ్చిన ‘ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు’ సినిమాలో సీనియర్ హీరో వడ్డే నవీన్ కు జోడీగా లక్ష్మి అనే ఒక రియలిస్టిక్ హౌస్ వైఫ్ క్యారెక్టర్ లో ఎలాంటి మేకప్ లేకుండా చాలా నాచురల్ గా మెప్పించింది.
కేవలం థియేట్రికల్ సినిమాలే కాకుండా ఓటీటీలో కూడా ‘పాపం పసివాడు’, ‘3 రోజెస్’ లాంటి వెబ్ సిరీస్ లతో డిజిటల్ ప్లాట్ ఫామ్స్ మీద కూడా బిజీగానే ఉంది. ఇలా అటు గ్లామర్ షో, ఇటు పర్ఫార్మెన్స్ బేస్డ్ రోల్స్.. ఈ రెండిటినీ పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తూ టాలీవుడ్ లో తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటోంది.
This post was last modified on June 20, 2026 3:20 pm
Page: 1 2
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…
భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…
యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…