సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల ఫిజిక్, లుక్స్ మీద రకరకాల కామెంట్స్ రావడం చాలా కామన్. కొంచెం బరువు పెరిగినా లేదా తగ్గినా నెటిజన్లు వెంటనే సోషల్ మీడియాలో ఊహించని విధంగా రియాక్ట్ అవుతుంటారు. ఇక స్టార్ హీరోయిన్ సమంత విషయంలో కూడా గత కొంతకాలంగా ఇలాంటి కామెంట్స్ గట్టిగానే వినిపిస్తున్నాయి. ఆమె బాగా సన్నబడటం చూసి చాలామంది అది డైటింగ్ అనుకున్నారు. అయితే ఈ లుక్ వెనుక ఉన్న అసలు కారణాన్ని ఇటీవల బయటపెట్టారు.
ఆమె నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మా ఇంటి బంగారం’ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సమంత తన వెయిట్ లాస్ పై క్లారిటీ ఇచ్చారు. చాలామంది బరువు తగ్గడం అనేది కేవలం ఒక పర్సనల్ ఛాయిస్ అనుకుంటారని, కానీ వెనుక ఉన్న హెల్త్ స్ట్రగుల్స్ ఎవరికీ తెలియవని పేర్కొంది. తనకు ఇష్టం లేక కాదని, తినాలని ఉన్నా తినలేని పరిస్థితి రావడం వల్లే ఇంతలా సన్నబడాల్సి వచ్చిందని ఎమోషనల్ గా తెలిపారు.
మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ సమస్యతో పోరాడుతున్న సమంత, గత రెండేళ్లుగా తీవ్రమైన ఆహార నియమాలను పాటించాల్సి వచ్చింది. ఈ వ్యాధి వల్ల కొన్ని రకాల ఫుడ్స్ తీసుకోవడం వల్ల హెల్త్ కండిషన్ మరింత క్లిష్టంగా మారే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇష్టమైన వంటకాలకు దూరంగా ఉంటూ, రెండేళ్ల పాటు ఎలాంటి టేస్ట్ లేని ఒకే రకమైన బ్లాండ్ ఫుడ్ ను మాత్రమే బలవంతంగా తినాల్సి వచ్చిందని సమంత చెప్పుకొచ్చింది. తినే ఆహారం విషయంలో ప్రజల్లో ఇంకా సరైన అవగాహన లేదని కూడా అభిప్రాయపడింది.
సినిమాలకు పూర్తిగా గ్యాప్ ఇచ్చి రికవరీ మీద ఫోకస్ పెట్టిన ఆ రెండేళ్ల టైమ్ లో ఫుడ్ కంట్రోల్ చేయడం అనేది తనకు కెరీర్ లోనే అత్యంత కష్టమైన విషయంగా మారిందని సమంత తెలిపింది. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వల్ల ఆహారం పట్ల తనకున్న ఆలోచనా విధానమే పూర్తిగా మారిపోయిందని వెల్లడించారు. ప్రస్తుతం ఆ కఠినమైన ఫేజ్ నుంచి బయటపడి, ఇప్పుడు కాస్త కంఫర్టబుల్ గా తినగలుగుతున్నానని అన్నారు. ఇక నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ సినిమా జూన్ 19న రిలీజ్ కానుంది.
This post was last modified on June 19, 2026 12:54 pm
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…
తల్లిదండ్రులపై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వరకు ఉండాల్సిందే. కానీ, జ్యాతస్యహి ధ్రువో మృత్యు.. అన్నట్టుగా కాలం…
భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…
వన్డేల్లో 405 పరుగులు చేసిన తర్వాత కూడా ఓడిపోతామని వెస్టిండీస్ ఊహించి ఉండదు. గువాహటిలో ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిపోయారు.…
టార్గెట్ కేటీఆర్.. లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న…