Movie News

కన్నప్ప పునఃదర్శనం ఇంత త్వరగానా

మంచు విష్ణు కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప. విశేషం కేవలం ఖర్చులోనే కాదు క్యాస్టింగ్ లోనూ ఉంది. ప్రభాస్ క్యామియోతో పాటు మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్ లాంటి తారల కలయిక మరింత వన్నె తీసుకొచ్చింది. కమర్షియల్ గా పెద్ద సక్సెస్ అయ్యిందా లేదానేది పక్కనపెడితే పెర్ఫార్మన్స్ పరంగా విష్ణుకి చాలా మంచి మార్కులు పడ్డాయి. ఓపెనింగ్స్ భారీగా వచ్చిన వైనం అభిమానులకు గుర్తే.

మొదటి యానివర్సరీ పూర్తి చేసుకున్న సందర్భంగా కన్నప్పని థియేటర్లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. జూన్ 27 మరోసారి కన్నప్పని పునఃదర్శనం చేసుకోవచ్చు. అయితే ఇంత తక్కువ గ్యాప్ లో మళ్ళీ విడుదల చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే కానీ బాక్సాఫీస్ వద్ద పెద్ద సందడి లేకపోవడం, రామ్ చరణ్ పెద్ది ఫైనల్ రన్ కు దగ్గరగా ఉండటం, మరీ ముఖ్యంగా లెనిన్ వాయిదా పడి జూలైకి వెళ్లిపోవడం లాంటి కారణాలు కన్నప్ప రీ ఎంట్రీకి ప్రేరేపించాయని చెప్పొచ్చు.

అలాని కాంపిటీషన్ లేదని కాదు. కన్నప్పకి రీ రిలీజుల నుంచే పెద్ద పోటీ ఎదురు చూస్తోంది. జూన్ 26 నుంచి జూన్ 27 మధ్య కేవలం మూడు రోజుల గ్యాప్ లో పాత సినిమాలు దండయాత్ర చేయబోతున్నాయి. హనుమాన్ ని 3డి వెర్షన్ లో తీసుకొస్తుండగా, మహేష్ బాబు ఒక్కడు, పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్, రాజ్ తరుణ్ సినిమా చూపిస్త మామా అన్నీ గంపగుత్తగా రాబోతున్నాయి. ఒక లెనిన్ పక్కకు తప్పుకోవడం వల్ల ఇంత మంది బరిలో దిగుతున్నరన్న మాట.

కన్నప్పలో ఉన్న డివోషనల్ ఎలిమెంట్స్, ప్రభాస్ పాత్ర, పాటలు, స్టార్ అట్రాక్షన్లు ఏ మేరకు జనాన్ని మళ్ళీ రప్పిస్తాయో చూడాలి. ఉద్దేశం ఏదైనా ఇలాంటివి సోలోగా వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ వారం విడుదలవుతున్న మా ఇంటి బంగారం, ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు, వంద దేవుళ్ళు, దీవానా, బాలన్ టాక్స్ ఎలా ఉంటాయనే దాని మీద జూన్ చివరి వారం సినిమాల రెవిన్యూ కొంత ఆధారపడి ఉంది. కొత్త పాత సంబంధం లేకుండా అన్నీ థియేటర్స్ లో చూసే మూవీ లవర్స్ కు మాత్రం పండగే.

This post was last modified on June 17, 2026 8:33 pm

Share

Recent Posts

పరీక్షలు బాగా రాపించి సినిమాకి తీసుకురండి

చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…

38 minutes ago

హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్?

ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…

1 hour ago

ఏపీలో బీసీ రిజర్వేషన్లపై సంచలన తీర్పు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…

3 hours ago

అక్టోబర్ మార్కెట్… ఎవరెవరికి జాక్‌‌పాట్

కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…

3 hours ago

రాజమౌళి టచ్ చేసిన స్క్రిప్ట్… హిట్ కొడతారా?

గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…

3 hours ago

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

4 hours ago