Movie News

కల్కి 2 కన్నా ముందు క్యారెక్టర్ సినిమాలు

విడుదల ఎప్పుడు ఉంటుందో కానీ కల్కి 2 మీద అంచనాలు మాములుగా లేవు. కల్కి 2898 ఏడి గొప్ప విజయమే సాధించింది కానీ అందులో పాత్రల పరంగా ఉన్న కన్ఫ్యూజన్ చాలా మంచి ప్రేక్షకుల్లో అలా ఉండిపోయింది. ఎవరికి ఎవరు ఏమవుతారు, ఎందుకు హఠాత్తుగా వచ్చి వెళ్లిపోయారు లాంటి క్వశ్చన్లకు సమాధానాలు దొరకాల్సి ఉంది. దర్శకుడు నాగ్ అశ్విన్ వాటికి ముందుగానే సమాధానాలు చెప్పేందుకు రెడీ అవుతున్నారట. అది కూడా వెరైటీ స్ట్రాటజీతో.

దాని ప్రకారం కల్కి 2లోని ముఖ్యమైన క్యారెక్టర్ల వెనుక బ్యాక్ స్టోరీస్ ని ఒక గంట నిడివి ఉన్న చిన్న సినిమాలుగా తీసి ముందు ఓటిటిలో రిలీజ్ చేస్తారట. అంటే కల్కి ప్రపంచాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ తదితరులు పోషించిన పాత్రలకు సంబంధించిన నేపధ్యాన్ని వీటిలో చూపిస్తారు. అలాని డాక్యుమెంటరీలా కాదంట. ఒక్కో భాగానికి ఇరవై కోట్ల దాకా ఖర్చు కావొచ్చని సమాచారం.

దీని వల్ల ప్రయోజనాలు, ఇబ్బందులు సమానంగా ఉంటాయి. ఎందుకంటే ఒక సినిమాని పరిచయం చేయడం కోసం ఓటిటి సినిమాలు తీయడం జనం ఏ మేరకు రిసీవ్ చేసుకుంటారనేది వేచి చూడాలి. వీటి వల్ల అసలు కల్కి 2 ఆలస్యమైతే అభిమానులతో తలనొప్పి. పైగా ఎన్ని ఎపిసోడ్లు చేసినా వాటిలో ప్రభాస్ లేకపోతే అదో చిక్కు. ఉంటాడో లేదో తెలియదు. ఇలాంటి బోలెడు క్యాలికులేషన్లు ముడిపడి ఉంటాయి. నాగ్ అశ్విన్ ఇవన్నీ లెక్కలు వేసుకునే ఉంటారు.

కల్కి 2కున్న అతి పెద్ద సానుకూలాంశం రిలీజ్ ఒత్తిడి లేకపోవడం. ముందు ఫౌజీ రావాలి. ఆ తర్వాత స్పిరిట్ ఉంది. 2027 వీటికి అయిపోతుంది. 2028లో కల్కి 2 విడుదల ప్లాన్ చేసుకోవచ్చు. సో కావాల్సినంత సమయం ఉంది కనక దాన్ని సరైన రీతిలో వాడుకోవాలి. ప్రభాస్ మళ్ళీ సలార్ 2లోకి అడుగు పెట్టేముందే నాగ్ అశ్విన్ గుమ్మడికాయ కొట్టించేయాలి. మొదటి భాగం కన్నా దాదాపు రెట్టింపు బడ్జెట్ కల్కి 2కి అవుతోందని ఇన్ సైడ్ టాక్. ఎంతనేది దత్తుగారి ఫ్యామిలీ బయటికి చెప్పడం లేదు.

This post was last modified on June 17, 2026 4:26 pm

Share

Recent Posts

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

1 minute ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

2 hours ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

2 hours ago

మోహన్ బాబును మోసం చేసిన ఓదెల

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…

3 hours ago

‘హోటళ్ళు నా భార్యా బిడ్డల కోసం’

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…

5 hours ago

హిట్టు కొట్టిన పది నెలలకు దర్శనం

టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…

5 hours ago