Movie News

చికిరిని చూసే కోణం మారిపోయింది

గత ఏడాది పెద్ది నుంచి చికిరి చికిరి వీడియో సాంగ్ విడుదల చేశాక సోషల్ మీడియా ఊగిపోయింది. మిలియన్లలో వ్యూస్, లక్షల్లో రీల్స్, ఎక్కడ చూసినా దీని గురించి మాట్లాడుకునే రేంజ్ లో ఆన్ లైన్ హడావిడి మాములుగా జరగలేదు. ఒక పెద్ద హీరో సాంగ్ కి ఇంత భీభత్సమైన రెస్పాన్స్ గత కొన్నేళ్లలో ఎప్పుడూ చూడలేదన్నది వాస్తవం. ఈ ఒక్క పాటతోనే ఉత్తరాదిలోనూ పెద్దికి డిమాండ్ ఏర్పడి బిజినెస్ పరంగా మంచి రేటు పలికింది. ఇదంతా అయిపోయిన చరిత్ర.

ఇప్పుడు థియేటర్లలో రెండో వారం కొనసాగుతున్న పెద్ది నుంచి చికిరి చికిరి ఫుల్ వీడియో రిలీజ్ చేశారు. అంటే ఒరిజినల్ విజువల్స్ ని యధాతథంగా పొందుపరిచారన్న మాట. విచిత్రం ఏమిటంటే ఇప్పుడు చికిరి చికిరిని ట్రోలింగ్ కంటెంట్ గా వాడేందుకు కొన్ని యాంటీ ఫ్యాన్స్ గ్రూప్స్ సిద్ధమైపోయి పని మొదలుపెట్టేశాయి. జాన్వీ కపూర్ వెనుక రామ్ చరణ్ వెంటపడే షాట్స్ ని తెలివిగా కట్ చేసి దానికి రాక్షసుడు మ్యూజిక్ లాంటివి జోడించి వ్యూస్ తెచ్చుకుంటున్నాయి.

ఇదొక్కటే కాదు కానీ రకరకాలుగా చికిరిని టార్గెట్ చేస్తున్న వైనం స్పష్టంగా కనిపిస్తోంది. ఇలా ఎందుకు జరిగిందంటే కారణం సింపుల్. పెద్దిలో జాన్వీ కపూర్ ని చూపించిన విధానం మీద ఎంత పెద్ద డిబేట్ జరిగిందో తెలిసిందే. దర్శకుడు బుచ్చిబాబు సారీ చెప్పే దాకా వ్యవహారం వెళ్ళింది. ఆమె సీన్లను ట్రిమ్ చేస్తామని కూడా వివరణ ఇచ్చారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు చికిరి చికిరిలో పెద్ది కేవలం కామంతోనే అచ్చియమ్మని ఇష్టపడ్డాడనే రీతిలో ట్రోల్స్ చేస్తున్నారు.

నిజానికి మరీ అసభ్యంగా జుగుప్స కలిగేలా బుచ్చిబాబు షూట్ చేయలేదన్నది వాస్తవం. ఇటీవల సక్సెస్ మీట్ లో అనంత శ్రీరామ్ నిలదీసింది ఈ పాయింట్ మీద. వేరే సినిమాల్లో కల్ట్ బోల్డ్ అని పొగిడి పెద్ది దగ్గరికి వచ్చేటప్పటికీ నీతులు చెప్పడం పట్ల మెగా ఫ్యాన్స్ నిరసన వ్యక్తం చేశారు. ఎవరి ఉద్దేశాలు ఏమైనా చికిరి చికిరికి అప్పట్లో లభించిన ఘన స్వాగతం ఇప్పుడు రూపం మార్చుకుంది. మస్సా మస్సా లాంటి పాజిటివ్ విషయాల కన్నా ఇలాంటి నెగటివ్ అంశాలే ఎందుకు హైలైట్ అవుతాయో వేరే చెప్పాలా.

This post was last modified on June 16, 2026 10:37 am

Share

Recent Posts

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

2 hours ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

2 hours ago

వీసా చేతిలో ఉన్నా రద్దే… అమెరికా కొత్త చెకింగ్ ఇదే!

అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…

2 hours ago

బొద్దింక‌ల నిర‌స‌న‌… ఈసారి ఇంకా గట్టిగా!!

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ).. తాజాగా మ‌రో ఉద్య‌మానికి తెర‌దీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్‌.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…

2 hours ago

ఆ పరిస్థితిలో హనుమాన్ చాలీసాను పఠించిన కెప్టెన్

హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్ర‌మించేవారు కొంద‌రైతే.. తాము చేసిన ప‌నుల కార‌ణంగా చూపిన ధైర్య సాహ‌సాల కార‌ణంగా రాత్రికి…

4 hours ago

చిన్న సినిమా సృష్టిస్తున్న సంచలనం పెద్దదే

కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…

5 hours ago