Movie News

జంధ్యాల వాడకం… రావిపూడి మార్కు ప్రచారం

దర్శకులందు అనిల్ రావిపూడి వేరయాని ఊరికే అనలేదు. షూటింగ్ మొదలుపెట్టడానికి ముందే తనదైన ప్రమోషన్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారడం ఆయనకే చెల్లింది. తాజాగా వెంకటేష్ – కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీకి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ ని వెరైటీగా అనౌన్స్ చేశారు అనిల్. జివి ప్రకాష్ కుమార్, అనంత శ్రీరామ్ ను మెడదాకా ఇసుకలో కప్పెట్టేసి వాళ్ళను ఏ రకంగా సతాయించేది అందులో శాంపిల్ చూపించారు.

ఇది అనిల్ రావిపూడి స్వంతంగా ప్లాన్ చేసుకుంది కాదు. తెలివిగా జంధ్యాల గారి వివాహ భోజనంబు సినిమాలో సుత్తి వీరభద్రరావు – బ్రహ్మానందం కాంబినేషన్ లో ఉండే బీచ్ కామెడీని తీసుకుని ఇక్కడ వాడేసుకున్నారు. క్రెడిట్స్ సమస్య లేకుండా ప్రోమో ప్రారంభంలో ఒరిజినల్ సన్నివేశాన్ని యథాతధంగా చూపించి దాని తర్వాత అసలు మ్యాటర్ లోకి వెళ్లిపోయారు. ఆల్రెడీ ఒక ట్యూన్, సాహిత్యం అయిపోయిందనే హింట్ ఇందులో చెప్పకనే చెప్పారు.

వచ్చే వారం నుంచి చిత్రీకరణ ప్రారంభించబోతున్న ఈ మల్టీస్టారర్ ఎట్టి పరిస్థితుల్లో 2027 సంక్రాంతికి విడుదల చేసే తీరాలనే టార్గెట్ తో ప్లాన్ చేసుకున్నారు. దానికి తగ్గట్టే వెంకటేష్ సహకారం పూర్తిగా ఉంటుంది కాబట్టి అనిల్ ఆ ధీమాతోనే రిలీజ్ పట్ల నమ్మకంగా ఉన్నాడు. ఇద్దరు హీరోలు బావ బావమరుదులుగా నటించబోతున్నట్టు సమాచారం. కీర్తి సురేష్, కృతి శెట్టి వీళ్ళ సరసన భార్యలుగా కనిపించబోతున్నారు. ఈ నలుగురి మధ్య ఫన్ కీలకం కానుంది.

ప్రస్తుతం ఆదర్శ కుటుంబం చివరి దశ పనుల్లో ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ దాదాపుగా వెంకటేష్ పోర్షన్లు పూర్తి చేశారట. ఇంకొంత బ్యాలన్స్ భాగం ఆగస్ట్ కల్లా పూర్తి చేసి సెప్టెంబర్ మూడో వారంలోగా ఫస్ట్ కాపీ సిద్ధం చేయాలని ఫిక్స్ చేసుకున్నారు. దసరా పండగ సందర్భంగా అక్టోబర్ పదహారు లేదా పదిహేడు రిలీజ్ అనుకున్నారట. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇదే నిజమైన పక్షంలో కేవలం మూడు నెలల గ్యాప్ లో వెంకటేష్ రెండు సినిమాలు వచ్చేస్తాయి.

This post was last modified on June 12, 2026 6:25 pm

Share

Recent Posts

వియత్నాం ఎయిర్‌పోర్టులో మన పరువు తీశారుగా!

విదేశాలకు వెళ్లడం అంటే కేవలం కొత్త ప్రాంతాలను సందర్శించడం, ఫొటోలు దిగడం, అక్కడి అందాలను ఆస్వాదించడం మాత్రమే కాదు. మన…

56 minutes ago

అంతా మనోళ్లే.. అయినా ఓటమి ఎలా? బాబు సీరియస్

ముఖ్యమంత్రి చంద్రబాబుకు పని రాక్షసుడిగా పేరున్న విషయం తెలిసిందే. ఏదైనా అనుకుంటే ఆ పని పూర్తి చేసేవరకు వొదిలిపెట్టారని ఆయనను…

2 hours ago

సమ్మర్ ఎందుకింత ట్రిగ్గర్ అయ్యింది

ఈ మధ్య కలెక్షన్ల కన్నా ఎక్కువగా సోషల్ మీడియా కామెంట్లు అందుకున్న సినిమాల్లో సమ్మర్ హాలిడేస్ ఒకటి. చిన్న పిల్లలను…

2 hours ago

శర్వానంద్‌ ఎందుకు ఆగాల్సి వచ్చింది

నవంబర్ 12 విడుదల కావాల్సిన భోగి వాయిదా పడటం వెనుక సెన్సార్ ఆలస్యమని, రివైజింగ్ కమిటీకి వెళ్లడం వల్లే సకాలంలో…

2 hours ago

సూర్య స్ట్రాటజీ భలే పని చేసింది

ఈ ఏడాది ‘కరుప్పు’ (వీరభద్రుడు), విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రాలతో మూడు నెలల వ్యవధిలో రెండు బ్లాక్ బస్టర్లు కొట్టాడు…

3 hours ago

సర్పంచ్ అంటే ఇలా ఆలోచించాలి

నేటి సమాజంలో కుటుంబ వ్యవస్థలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. చదువులు, ఉద్యోగాలు, మెరుగైన జీవన ప్రమాణాల కోసం యువత పట్టణాలు,…

6 hours ago