Movie News

వైల్డ్ డాగ్ ప్రిమియర్స్ కన్ఫమ్!

థియేటర్లు తెరుచుకున్నాక ఓటీటీల జోరు కొంచెం తగ్గినప్పటికీ.. అక్కడ కొత్త సినిమాల రిలీజ్ అయితే ఇప్పుడిప్పుడే ఆగేట్లు లేదు. ముందే ఒప్పందాలు జరిగి ఉండటం వల్లో, లేదా ఇంకా 100 పర్సంట్ ఆక్యుపెన్సీతో థియేటర్లు నడవని నేపథ్యంలో కొత్త సినిమాలు ఓటీటీల బాట పడుతున్నాయి. మలయాళంలో మోహన్ లాల్ లాంటి పెద్ద స్టార్ నటించిన కొత్త సినిమా ‘దృశ్యం-2’ను అమేజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేయబోతున్నట్లు ఇటీవలే ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగులో సీనియర్ హీరో అక్కినేని నాగార్జున సైతం థియేటర్లు పున:ప్రారంభం అయ్యాక కూడా తన కొత్త చిత్రం ‘వైల్డ్ డాగ్‌’ను ఓటీటీలోకి తేనున్నాడు. ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ చాలా రోజుల ముందే కొనేసినట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఆ విషయం నిజమే అట. ఈ చిత్రానికి నెట్ ఫ్లిక్స్‌లో ప్రిమియర్స్ కూడా కన్ఫమ్ అయ్యాయని తాజా సమాచారం.

సంక్రాంతికి ఒకటికి నాలుగు సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో కొంచెం గ్యాప్ ఇచ్చి గణతంత్ర దినోత్సవ కానుకగా ‘వైల్డ్ డాగ్’ను ప్రేక్షకుల ముందుకు తేనున్నారట. జనవరి 25 అర్ధరాత్రి నుంచి ఈ సినిమా స్ట్రీమ్ అవుతుందట. ట్రెండును అందిపుచ్చుకుని అందుకు తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకోవడంలో నాగార్జున ముందుంటారు. ఇప్పుడు ఓటీటీల హవా నడుస్తున్న నేపథ్యంలో ఆయన ధైర్యం చేసి తన చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్‌కు ఇప్పించేసినట్లు తెలుస్తోంది. టాలీవుల్ టాప్ స్టార్లలో ఓటీటీ బాట పట్టిన తొలి హీరో నాగార్జునే కావడం విశేషం. ‘మహర్షి’ రచయిత సాల్మన్ ‘వైల్డ్ డాగ్’తో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ అధినేత నిరంజన్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాత. ఇందులో నాగార్జున ఎన్ఐఏ ఏజెంట్‌గా కనిపించనున్నాడు. టెర్రరిస్టు ఆపరేషన్‌ల నేపథ్యంలో సాగే థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ‘రేయ్’ భామ సయీమీ ఖేర్ ఇందులో కీలక పాత్ర పోషించింది.

This post was last modified on January 2, 2021 8:39 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

జనసేనలోకి కాంగ్రెస్ నేత – షర్మిల ఎఫెక్టేనా?

రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతూనే ఉంటాయి. ప్ర‌త్య‌ర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామ‌మే ఉమ్మ‌డి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…

2 hours ago

బన్నీ-అట్లీ… అప్పుడే ఎందుకీ కన్ఫ్యూజన్

ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…

2 hours ago

అవతార్ 3 టాక్ ఏంటి తేడాగా ఉంది

భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…

3 hours ago

జననాయకుడుకి ట్విస్ట్ ఇస్తున్న పరాశక్తి ?

మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…

5 hours ago

ప్రియురాలి మాయలో మాస్ ‘మహాశయుడు’

గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…

5 hours ago

అభిమానులూ… లీకుల ఉచ్చులో పడకండి

కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…

5 hours ago