Movie News

పుష్ప-3… నమ్మొచ్చా?

పుష్ప సినిమా మొదలైనపుడు దాన్ని ఒక్క పార్ట్‌గానే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ సినిమా మధ్యలో ఉండగా దాన్ని రెండు భాగాలు చేశారు. ఇక పుష్ప-2 మేకింగ్ దశలో ఉండగా మూడో భాగం గురించి చర్చ మొదలైంది. ఈ సినిమా చివర్లో ‘పుష్ప: ది రాంపేజ్’ పేరుతో మూడో పార్ట్‌కు లీడ్ ఇవ్వడంతో అల్లు అర్జున్ అభిమానులు వెర్రెత్తిపోయారు.

ఐతే ‘పుష్ప-2’ రిలీజై ఏడాదిన్నర కావస్తుండగా.. మూడో భాగం దిశగా చిన్న అడుగు కూడా పడలేదు. బన్నీ ‘రాకా’ సినిమా చేస్తూ.. దీని తర్వాత లోకేష్ కనకరాజ్ సినిమాను కూడా అనౌన్స్ చేశాడు. సుకుమారేమో ఇప్పటిదాకా తన తర్వాతి సినిమానే మొదలుపెట్టలేదు.

రామ్ చరణ్‌తో ఆయన చేయాల్సిన కొత్త సినిమా పూర్తి కావడానికి ఇక్కడి నుంచి మినిమం రెండేళ్లు పట్టే సంకేతాలు కనిపిస్తున్నాయి. బన్నీ చేతిలో ఉన్న రెండు సినిమాలు.. సుకుమార్ కొత్త చిత్రం పూర్తయ్యాక అయినా ఈ ఇద్దరూ ‘పుష్ప-3’ కోసం జట్టు కడతారని పక్కాగా చెప్పలేని పరిస్థితి.

‘పుష్ప’, ‘పుష్ప-2’ చిత్రాలకు పని చేసిన టీం సభ్యులు చెబుతున్న సమాచారం ప్రకారం ‘పుష్ప-3’కి అసలు కథే సిద్ధంగా లేదట. కానీ ఆ రెండు చిత్రాల్లో కీలక పాత్ర పోషించిన జగపతిబాబేమో ‘పెద్ది’ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘పుష్ప-3’ ఉంటుందని, అందులో తన పాత్ర కీలకమని చెప్పుకొచ్చారు.

పార్ట్-2లో తన పాత్రను బాగా తగ్గించేయడం గురించి సుకుమార్ తనకు సర్దిచెప్పే క్రమంలో, పార్ట్-3లో తన పాత్రకు మంచి ప్రయారిటీ ఉంటుందని హామీ ఇచ్చినట్లు జగపతి చెప్పాడు. పుష్ప-3 విషయంలో ఆయన ఎంతో ఉత్సాహం ప్రదర్శించారు. కానీ ఈ సినిమా నిజంగా ఉంటుందా అన్నది మాత్రం సందేహంగానే ఉంది.

పుష్ప2 మేకింగ్ చాలా ఆలస్యం అయి.. ఒక దశలో బన్నీ, సుకుమార్ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చే పరిస్థితి తలెత్తింది. ముఖ్యంగా బన్నీ అయితే బాగా విసుగెత్తిపోయి ఇంకో పార్ట్ వద్దే వద్దు అన్న అభిప్రాయానికి వచ్చినట్లు వార్తలు వచ్చాయి.

పుష్ప 3 కోసం స్క్రిప్ట్ రెడీ చెయ్యడం కూడా తీవ్ర ఒత్తిడితో కూడిన పని కాబట్టి సుకుమార్ కూడా ఆ టాస్క్ ఎంచుకుంటాడా అన్నది సందేహం. జగపతి ఆశ బాగానే ఉంది కానీ భవిష్యత్తులో సమీకరణాలన్నీ కలిసొచ్చి, సరైన కథ రెడీ అయితే తప్ప ఈ ప్రాజెక్టు ముందుకు కదిలే అవకాశాలు తక్కువే. మరి ఏం జరుగుతుందో చూడాలి.

This post was last modified on May 30, 2026 11:14 am

Share

Recent Posts

చిరంజీవి ఎవ‌రినీ తొక్క‌డ‌య్యా…

తెలుగులో తెర మీద హీరోల‌కు ఎలివేష‌న్లు ఇవ్వ‌డంలో చాలామంది ద‌ర్శ‌కులు త‌మ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదిక‌ల మీద ఎలివేష‌న్లు…

14 minutes ago

త‌మిళ ప్రేక్ష‌కులకో దండం

ఒకప్పుడు త‌మిళ ప్రేక్ష‌కుల అభిరుచి గురించి ఇత‌ర భాష‌ల వాళ్లు గొప్ప‌గా చెప్పుకునేవాళ్లు. కొత్త త‌ర‌హా సినిమాల‌ను, ప్ర‌యోగాత్మ‌క చిత్రాల‌ను…

26 minutes ago

లోక‌ల్ ఫైట్‌: జ‌గ‌న్‌ ముందే చేతులెత్తేశారా?

ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు ముహూర్తం రెడీ అవుతోంది. ప్ర‌భుత్వం వైపు నుంచి ఈ ఎన్నిక‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చేసింది.…

43 minutes ago

వైసీపీ ఓటు బ్యాంకు స్థిర‌మేనా..?

వైసీపీ ఓటు బ్యాంకు స్థిర‌మేనా? ఆ పార్టీ చెబుతున్న‌ట్టు 40 శాతం ఓటు బ్యాంకు వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు అలానే…

53 minutes ago

థియేటర్లకు జై కొడుతున్న తెలుగు ప్రేక్షకులు

జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…

54 minutes ago

కాక్రోచులను వెనక్కి తరిమిన వారెవరు?

విద్యార్థి ఉద్య‌మాల‌కు తెర‌దీసిన కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ) నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు తొలిసారి ప‌రాభవం ఎదురైంది. ఇటీవ‌ల నీట్ ప్ర‌శ్న ప‌త్రం…

1 hour ago