ఇప్పుడు టాలీవుడ్లో ఏదైనా సినిమా వేడుక జరిగిందంటే చాలు.. అందులో పరిశ్రమ కష్టాల గురించి తప్పకుండా ప్రస్తావన ఉంటుంది. తెలుగు సినిమా పరిస్థితి ఏమీ బాగా లేదని.. సినిమాలు చూసేందుకు థియేటర్లకు జనం రావట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తారు సినీ జనాలు. కానీ జనం థియేటర్లకు రావడానికి ఉత్సాహం చూపించే సినిమాకేమో రేట్లు పెంచేస్తారు.
దేశంలో అత్యధిక టికెట్ల రేట్లు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ, ఏపీ ముందు వరుసలో ఉన్నా సరే.. కాస్త క్రేజున్న పెద్ద సినిమా ఏది రిలీజైనా అదనపు రేట్లు వడ్డించడం రివాజు అయిపోయింది. ఐతే ఏపీలో ఇందుకు ఈజీగా అనుమతులు వచ్చేస్తున్నాయి కానీ.. తెలంగాణలో మాత్రం పరిస్థితి సంక్లిష్టంగా మారింది.
‘పుష్ప-2’కు సంబంధించిన సంధ్య థియేటర్ విషాదం తర్వాత టికెట్ల రేట్ల పెంపు విషయంలో ప్రభుత్వం వ్యతిరేక వైఖరి తీసుకుంది. దీనికి తోడు ఏదైనా సినిమాకు రేట్లు పెంచితే కోర్టుల్లో కేసులు పడిపోతున్నాయి. ఈ ఏడాది సంక్రాంతి సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’ టైంలో పడ్డ కోర్టు కేసుతో పీటముడి బిగుసుకుంది. కొత్త సినిమాలకు రేట్లు పెంచాలంటే 90 రోజుల ముందే దరఖాస్తు చేసుకుని, జీవో తెచ్చుకోవాలంటూ కోర్టు పెట్టిన మెలికతో టాలీవుడ్‌కు పెద్ద షాక్ తప్పలేదు.
అప్పట్నుంచి ఏ సినిమాకూ రేట్ల పెంపు లేదు. వేసవి ఆరంభంలో పవన్ కళ్యాణ్ సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’కు రేట్ల పెంపు కోసం గట్టిగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో నార్మల్ రేట్లతోనే ఆ సినిమాను రిలీజ్ చేశారు. ఇప్పుడు ‘పెద్ది’ సినిమా కోసం ఇంకొంచెం గట్టిగా ప్రయత్నించారు. ప్రభుత్వం రేట్ల పెంపుకు సుముఖంగా ఉన్నప్పటికీ, గత ఆదేశాలపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించడంతో పెద్ది నిర్మాతలు తమ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు.
వరుసగా రెండు పెద్ద సినిమాలకు నిర్మాతలు ఎంత ప్రయత్నించినా రేట్ల పెంపు సాధ్యం కాని పరిస్థితుల్లో.. ఇక ఇలాంటి ప్రయత్నాలు ఆపేయడం బెటర్ అనే అభిప్రాయాలు ఇండస్ట్రీలో వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తటస్థ వైఖరిని అవలంబిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం రేట్ల పెంపుకు నిరాకరించట్లేదు. అదే సయమంలో అందుకోసం తమ వంతుగా పుష్ చేసే ప్రయత్నమూ చేయట్లేదు.
ఏ సినిమాకు ఆ సినిమాకు జీవో ఇచ్చేలా కాకుండా.. ఈ విషయంలో న్యాయపరమైన చిక్కులు రాకుండా, పాలసీ మారిస్తే తప్ప రేట్ల పెంపు సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఆయా సినిమాల నిర్మాతలు వ్యక్తిగతంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం కాకుండా.. ఇండస్ట్రీ అంతా కలిసి వెళ్లి ప్రభుత్వానికి విన్నవించుకుంటేనే ఇది సాధ్యపడొచ్చు. అది జరిగేలా కనిపించడం లేదు. కాబట్టి తెలంగాణలో టికెట్ల రేట్ల పెంపు మీద ఇండస్ట్రీ ఆశలు వదులుకోవడం బెటరేమో.
This post was last modified on May 30, 2026 10:55 am
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…