సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల తేదీ ఇప్పటిదాకా ఖరారు కాలేదు. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం అయితే ఆగస్ట్ 14 రావాలి. కానీ ఇంకా షూటింగ్ కొంచెం బ్యాలన్స్ ఉండటంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు ఎక్కువ సమయం అవసరం కావడంతో మళ్ళీ వాయిదా వేశారు. ఇది పక్కాగా తెలుసుకున్న తర్వాతే సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ఆ తేదీని అధికారికంగా లాక్ చేసుకుంది.
జైలర్ 2 ప్రధాన సమస్య క్యామియోలు. శివ రాజ్ కుమార్ తో ఇబ్బంది రాలేదు కానీ ఈసారి కొత్త అతిధులను తీసుకురావాలన్న ఉద్దేశంతో ముందు బాలకృష్ణని ట్రై చేశారు. రజనితో ఎంత అనుబంధం ఉన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో అది చేయలేనని సున్నితంగా నో చెప్పారు. తర్వాత షారుఖ్ ఖాన్ ఆల్మోస్ట్ ఫిక్స్ అన్నారు. గతంలో రా వన్ లో రజిని చిన్న క్యామియో చేశారు కాబట్టి ఆ ఋణం తీర్చుకుంటారని అనుకున్నారు. కానీ కింగ్ షూట్ వల్ల డేట్స్ దొరకలేదు.
ఇప్పుడు హృతిక్ రోషన్ కోసం ట్రై చేస్తున్నట్టు చెన్నై టాక్. సరిగ్గా నలభై సంవత్సరాల క్రితం 1986లో రజనీకాంత్ హీరోగా భగవాన్ దాదా వచ్చింది. అందులో చైల్డ్ ఆర్టిస్ట్ గా హృతిక్ నటించాడు. అతని తండ్రి రాకేష్ రోషన్ నిర్మాత ప్లస్ మరో ముఖ్య పాత్ర పోషించాడు. తర్వాత మళ్ళీ ఈ కలయిక సాధ్యం కాలేదు. ఇప్పుడు నిజంగా అడిగితే హృతిక్ చేస్తాడా చేయడానే దాని గురించి సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గెస్టు రోల్స్ అంటే హృతిక్ సుముఖత చూపడు.
ఈ లెక్కన వినాయక చవితికి మాత్రమే జైలర్ 2 వచ్చే ఛాన్స్ ఉంది. ముత్తువేల్ పాండియన్ జైలర్ కాక ముందు ఏం చేశాడనే ఎపిసోడ్స్ లో పైన చెప్పిన ప్రత్యేక పాత్రలు వస్తాయట. ఇది పూర్తి చేయగానే నెల్సన్ దిలీప్ కుమార్ కు ఇంకో పెద్ద బాధ్యత ఉంది. కమల్ హాసన్ – రజనీకాంత్ మల్టీస్టారర్ ని తెరకెక్కించాలి. ఈ ప్రాజెక్టు పరంగా తను చాలా ఒత్తిడి ఎదురుకోబోతున్నాడు. ఇద్దరు దర్శకులు మారాక తన చేతికి వచ్చింది. జైలర్ 2 పెద్ద విజయం సాధిస్తే దానికి మరింత ఊపొస్తుంది.
This post was last modified on May 29, 2026 12:06 pm
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…