Movie News

మ‌రీ ఎక్కువ చెప్పినా క‌ష్ట‌మేమో పెద్దీ..

కొత్త సినిమాల‌కు ప్ర‌మోష‌న్ త‌గ్గినా క‌ష్ట‌మే. ప్రచారం మ‌రీ ఎక్కువైనా ప్ర‌మాద‌మే. వీలైనంత ఎక్కువ‌గా ప్ర‌మోష‌న్లు చేసి జ‌నం దృష్టి ఆ సినిమా మీద ఉండేలా చేయ‌డం అవ‌స‌ర‌మే కానీ.. ఆ చిత్రం గురించి మ‌రీ ఎక్కువ చెప్పుకుంటూ పోతే ప్రేక్ష‌కులు మ‌రీ ఎక్కువ అంచ‌నాలు పెంచేసుకుంటారు. కంటెంట్ ప‌రంగా ఆ అంచ‌నాల‌ను అందుకోవ‌డం క‌ష్ట‌మైతే పెద‌వి విరుపులు త‌ప్ప‌వు.

టాలీవుడ్ నెక్స్ట్ బిగ్ రిలీజ్ పెద్ది ఇలాంటి ముప్పును ఎదుర్కొంటుందా అన్న సందేహాలు క‌లుగుతున్నాయి.పెద్ది సినిమా మీద ముందు నుంచి భారీ అంచ‌నాలే ఉన్నాయి. రిలీజ్ ముంగిట హైప్ ఇంకా పెంచేలా టీం గ‌ట్టిగా ప్ర‌మోష‌న్లు చేస్తోంది. ఓవైపు ప్రెస్ మీట్లు, ఇంకోవైపు ఇంట‌ర్వ్యూల‌తో టీం హోరెత్తించేస్తోంది. కానీ అందులో ఒక్కొక్క‌రు మాట్లాడుతున్న మాట‌లు కోట‌ల్ని దాటిపోతున్నాయి.

రామ్ చ‌ర‌ణ్ ఇప్ప‌టికే మ‌గ‌ధీర‌, రంగ‌స్థ‌లం లాంటి అద్భుత చిత్రాల్లో న‌టించాడు. కానీ ద‌ర్శ‌కుడు బుచ్చిబాబేమో పెద్దినే త‌న కెరీర్లో అత్యంత గొప్ప క‌థ అని, దీని త‌ర్వాత ఇంత గొప్ప‌క‌థ‌లో అత‌ను న‌టించ‌డం క‌ష్ట‌మ‌ని స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ఈ చిత్రంలో ముఖ్య పాత్ర‌లు పోషించిన శివ‌రాజ్ కుమార్, జ‌గ‌ప‌తిబాబు సైతం పెద్ది క‌థ గురించి, మొత్తంగా సినిమా గురించి వేరే లేవెల్లో మాట్లాడారు. రామ్ చ‌ర‌ణ్‌కు నేష‌న‌ల్ అవార్డు ప‌క్కా అని శివ‌న్న అంటే.. జ‌గ‌ప‌తిబాబేమో త‌న కెరీర్లో ఎప్ప‌టికీ గుర్తుండే అర‌డ‌జ‌ను బెస్ట్ మూవీస్‌లో పెద్ది ఒక‌ట‌ని వ్యాఖ్యానించాడు. ఈ క‌థను ద‌ర్శ‌కుడితో పాటు హీరోను ఆయ‌న ఆకాశానికెత్తేశారు.

ఇందులో విల‌న్ పాత్ర చేసిన దివ్యేందు.. పెద్ది సినిమాను ఒక‌సారి చూసి ఆపేయ‌ర‌ని, వ‌రుసపెట్టి ప్ర‌తి రోజూ చూస్తూనే ఉంటార‌ని తాజాగా కామెంట్ చేశాడు. మామూలుగా త‌క్కువ‌గా మాట్లాడే బొమ‌న్ ఇరానీ సైతం పెద్ది సినిమాను ఆకాశానికెత్తేశాడు. ఇక సినిమాటోగ్రాఫ‌ర్ ర‌త్న‌వేలు, ఆర్ట్ డైరెక్ట‌ర్ అవినాష్ కొల్లా త‌దిత‌రులు సైతం ఈ సినిమా గురించి చాలా గొప్ప‌గా చెప్పారు.

ప్ర‌తి ఒక్క‌రూ ఇదొక మాస్ట‌ర్ పీస్ అన్న‌ట్లే మాట్లాడుతున్నారు. కానీ ట్రైల‌ర్ చూస్తే ఆ రేంజిలో లేదు. మ‌రి సినిమా వీళ్ల మాట‌ల‌కు త‌గ్గ స్థాయిలో అద్భుతంగా, అసాధార‌ణంగా ఉంటుంద‌న్న‌ది చూడాలి. అలా లేని ప‌క్షంలో సోష‌ల్ మీడియాలో కామెంట్లు ఎలా ఉంటాయో, టీం స‌భ్యులు చెప్పిన మాట‌ల మీద‌ యాంటీ ఫ్యాన్స్ ఏ రేంజిలో ట్రోలింగ్ చేస్తారో చెప్పేదేముంది?

This post was last modified on May 29, 2026 10:07 pm

Share

Recent Posts

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

5 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

6 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

7 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

8 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

8 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

8 hours ago