Movie News

చిరు సినిమాను చంపేసుకుంటున్నారు

ఈ రోజుల్లో పెద్ద హీరోల సినిమాలు ఆలస్యం కావడం, రిలీజ్ డేట్ వాయిదా పడడం చాలా కామన్ విషయం. ఇంతకుముందులా సినిమాను వాయిదా వేయాల్సి వస్తే చిత్ర బృందాలు ఎక్కువ కంగారు పడడం లేదు. ఆడియన్స్ కూడా ఎక్కువ అసంతృప్తి వ్యక్తం చేయట్లేదు. ఇది మామూలు విషయమే అన్నట్లు అందరూ వ్యవహరిస్తున్నారు. కానీ ప్రేక్షకులు అలవాటు పడ్డారు కదా అని.. మరీ గ్రాంటెడ్‌గా తీసుకుంటే, ఏళ్లకు ఏళ్లు సినిమా ఆలస్యం అయితే.. మళ్లీ మళ్లీ రిలీజ్ డేట్ మార్చుకుంటూ పోతే పూర్తిగా ఆసక్తి సన్నగిల్లిపోవడం ఖాయం.

పవన్ కళ్యాణ్ సినిమాలు హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ మీద ఎలా రిలీజ్ ముంగిట బజ్ కోల్పోయాయో తెలిసిందే. వీటికి ఆశించిన ఓపెనింగ్స్ కూడా రాని పరిస్థితి. ముందే అందరూ ఇవి ఫ్లాప్ అనే నిర్ణయానికి వచ్చేశారు. ఈ సినిమాలు చూడ్డానికి పవన్ అభిమానులు ఎప్పట్లాగే ఉత్సాహం చూపించినా, సామాన్య ప్రేక్షకుల్లో అయితే కనీస ఆసక్తి కూడా కనిపించలేదు. అందుకే ఆ చిత్రాలు డిజాస్టర్లుగా మిగిలాయి.

ఈ అనుభవం కళ్ల ముందే కనిపిస్తున్నా.. ‘విశ్వంభర’ సినిమా విషయంలో మేకర్స్ జాగ్రత్త పడడం లేదు. క్వాలిటీ విషయంలో రాజీపడకపోవడం మంచిదే. తొలి టీజర్లో వీఎఫెక్స్ మీద తీవ్ర విమర్శలు వచ్చాయని, వాటి మీద మళ్లీ భారీగా ఖర్చు పెట్టి వర్క్ చేయించడాన్ని అర్థం చేసుకోవచ్చు. ఔట్ పుట్ కోసం ఆలస్యం జరుగుతోందంటే అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులూ అర్థం చేసుకుంటారు. కానీ ఆ ఆలస్యం శ్రుతి మించితే అసహనం తప్పదు. గత ఏడాది ‘మన శంకర వరప్రసాద్ గారు’కు దారి ఇస్తూ తమ చిత్రాన్ని వేసవికి రిలీజ్ చేస్తామన్నారు. కానీ వేసవి వచ్చింది, వెళ్లిపోతోంది.

కానీ ‘విశ్వంభర’ గురించి ఏ ఊసూ లేదు. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో చిరు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ దక్కింది. దీని తర్వాత వీలైనంత త్వరగా ‘విశ్వంభర’ను రిలీజ్ చేస్తే ప్రయోజనం ఉండేది. ఆటోమేటిగ్గా బజ్ క్రియేట్ అయ్యేది. కానీ మేకర్స్ ఆ పని చేయలేదు. వీఎఫెక్స్ కోసం సంవత్సరాల తరబడి పని చేస్తూనే ఉన్నారు. ఎంతకీ ఆ వర్క్ కొలిక్కి వస్తున్నట్లు లేదు. కానీ క్వాలిటీ సంగతేమో కానీ.. సినిమా నుంచి ఏ అప్‌డేట్ లేకపోవడం, ఎంతకీ రిలీజ్ సంగతి తేల్చకపోవడంతో ప్రేక్షకులు ‘విశ్వంభర’ మీద పూర్తిగా ఆసక్తి కోల్పోతున్న పరిస్థితి.

ఇటీవలే చిరంజీవి కొత్త సినిమాను మొదలుపెట్టారు. దాని గురించి అభిమానులు ఎగ్జైట్ అయ్యారు తప్పితే.. విశ్వంభర మీద వారికి ఆశలే లేనట్లున్నాయి. క్రమంగా ఫ్యాన్స్ ఆ సినిమా అప్‌డేట్ అడగడం, దాని గురించి చర్చించడం కూడా మానేశారు. ఇది ప్రమాద సంకేతం లాంటిదే. జులై 10 అంటూ ఆ మధ్య డేట్ ప్రచారంలోకి రాగా.. అది సాధ్యం కాదని తెలుస్తోంది. కనీసం ఇండిపెండెన్స్ డే వీకెండ్ అయినా ఎంచుకుంటారేమో అనుకుంటే.. ఆ సంకేతాలు కూడా కనిపించడం లేదు. ఈ సైలెన్స్‌తో మేకర్స్ ‘విశ్వంభర’ క్రేజ్ మొత్తాన్ని చంపేసుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

This post was last modified on May 29, 2026 10:08 pm

Share

Recent Posts

గాంధీ జయంతి ఇంత రష్ ఉందేంటి

అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…

38 minutes ago

80′ s ట్రెండ్… చంద్రబాబు రూటే సెపరేటు

సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్‌’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…

58 minutes ago

AI కోసం లక్షల కోట్లు… లాభాలు రాకపోతే ఏం జరుగుతుంది?

చాట్‌జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…

2 hours ago

జగన్ లోనూ ఓ కాక్రోచ్

నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…

2 hours ago

వృషకర్మ… తెలివైన పని చేసిందమ్మ

ఫౌజీ విడుదల వాయిదా గురించి అసలైన మైత్రి మూవీ మేకర్స్ ఇంకా చెప్పలేదు కానీ మిగిలిన సినిమాలు అలెర్ట్ అయిపోయి…

3 hours ago

యూపీఐ లో కొత్త షార్ట్‌కట్… స్కాన్ లేకుండానే పేమెంట్

షాప్‌లో యూపీఐ పేమెంట్ చేయాలంటే ప్రస్తుతం ఫోన్‌లో యాప్ ఓపెన్ చేసి, కెమెరాతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నాం. ఇక…

4 hours ago