మెగాస్టార్ అభిమానులకు ‘ఆహా’ టీం సారీ.. సోషల్ మీడియాలో నిన్నట్నుంచి చర్చనీయాంశం అవుతున్న వార్త. మెగాస్టార్ అభిమానులకు అల్లు అరవింద్ నేతృత్వంలోని ‘ఆహా’ ఓటీటీ వారు సారీ చెప్పడం ఏంటి అని చాలామంది ఆశ్చర్యపోయారందరూ. నిజానికి ఈ స్టేట్మెంట్ వచ్చాకే చాలామందికి అసలు విషయం తెలిసింది.
‘ఆహా’లోని సామ్ జామ్ ప్రోగ్రాంకు ఇటీవలే అల్లు అర్జున్ అతిథిగా రావడం తెలిసిందే. ఈ ఎపిసోడ్ ప్రిమియర్స్‌కు ముందు ప్రమోషన్లు ఓ రేంజిలో చేస్తున్నారు. దీని కంటే ముందు వచ్చిన చిరు ఎపిసోడ్‌ను మించి దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. చిరు ఎపిసోడ్ ముందు వేసి.. బన్నీ ఎపిసోడ్‌ను కొత్త సంవత్సర కానుకగా రిలీజ్ చేయడమే మెగా అభిమానులకు ముందసలు రుచించలేదు. చిరు కంటే బన్నీ ఎక్కువా అనే ప్రశ్న అప్పుడే వారిలో తలెత్తింది. దీనికి తోడు.. బన్నీ ఎపిసోడ్‌కు సంబంధించిన ఓ ప్రోమోలో అతడి పేరు ముందు ‘మెగాస్టార్’ తగిలించడం చిరు అభిమానులకు అస్సలు నచ్చలేదు.
సంబంధిత స్క్రీన్ షాట్లు పెట్టి బన్నీని తిట్టడం మొదులపెట్టారు చిరు ఫ్యాన్స్. ఐతే విషయం మరీ చర్చనీయాంశం ఏమీ కాలేదు. కానీ దీని గురించి సారీ చెబుతూ ‘ఆహా’ స్టేట్మెంట్ రిలీజ్ చేయడంతో జనాలు అసలు విషయం ఏంటని తెలుసుకున్నారు. ఇప్పుడు మెగా అభిమానులందరికీ విషయం బోధపడింది. ఇప్పుడు మరింతగా బన్నీని టార్గెట్ చేస్తున్నారు. ‘ఆహా’ టీం సారీని అసలు పట్టించుకోవట్లేదు. పాత విషయాలు కూడా బయటికి తీసి బన్నీని ట్రోల్ చేస్తున్నారు.
‘అల వైకుంఠపురములో’ ప్రి రిలీజ్ ఈవెంట్లో బన్నీ మాట్లాడుతూ.. ఇంతకుముందులా ‘మెగా అభిమానులు’ అనే మాట వాడకుండా.. ‘అల్లు అర్జున్ ఆర్మీ’ అని పేర్కొనడం.. తాను ఇంత వాడిని కావడానికి వాళ్లే కారణం అంటూ వ్యాఖ్యానించడాన్ని గుర్తు చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్, ఆయన అభిమానుల విషయంలో బన్నీ వ్యవహరించిన తీరును కూడా మళ్లీ ఇంకోసారి చర్చిస్తున్నారు. ఈ మధ్య సొంత ఇమేజ్ కోసం బన్నీ పరితపిస్తున్న విషయాన్న ఎత్తి చూపి బన్నీకి తలబిరుసు ఎక్కువైందని.. అల్లు అర్జున్ పేరు వెనుక ‘మెగాస్టార్’ పెట్టడం కూడా అతడి టీం పనే అని విమర్శిస్తున్నారు.
This post was last modified on January 1, 2021 6:33 pm
అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే, డొనాల్డ్ ట్రంప్ సంచలనాత్మక నిర్ణయాలను అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. తాజాగా, లింగ…
ముంబయిలో ప్రముఖ సినీ నటుడు అమితాబ్ బచ్చన్ తన డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను భారీ లాభంతో విక్రయించారు. ఓషివారాలోని క్రిస్టల్ గ్రూప్…
జమ్మూకశ్మీర్ లోని ఉత్తర ప్రాంతంలో సోమవారం జరిగిన ఉగ్రదాడి భారత్ ఆర్మీకి తీరని నష్టాన్ని కలిగించింది. భద్రతా బలగాలు ఉగ్రవాదుల…
టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్.. ఓకప్పుడు తెలంగాణ మంత్రిగా ఉన్న బీఆర్ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో…
ఒక హీరోయిన్ నటించిన రెండు సినిమాలు ఒకే టైంలో విడుదల కావడంలో ఆశ్చర్యం లేదు కానీ చాలా విషయాల్లో వాటి…
అమెరికా నూతన అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన డొనాల్డ్ ట్రంప్.. తన హయాంలో దేశానికి స్వర్ణ యుగం తీసుకువస్తానని ప్రకటిం చారు.…