Movie News

టాక్సిక్ మౌనం అంచనాలకు హానికరం

పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం సామెత లాగా పైన హెడ్డింగుని ప్యాన్ ఇండియా సినిమాలకు వర్తింపజేయాలి. గత ఏడాది నుంచి ఇప్పటిదాకా మూడు సార్లు రిలీజ్ డేట్లు మార్చుకున్న టాక్సిక్ జూన్ 4 వదిలేశాక ఇప్పటిదాకా కొత్త డేట్ నిర్ణయించుకోలేదు. బెంగళూరు కథనాల్లో ఏవేవో గాసిప్స్ వినిపిస్తున్నాయి. నిర్మాత ఆశిస్తున్న ఓటిటి హక్కుల మొత్తంలో కేవలం ముప్పై నుంచి నలభై శాతమే కంపెనీలు ఆఫర్ చేశాయని, దీని వల్లే డీల్స్ ఆగిపోయాయని వాటి సారాంశం.

ఇది నిజమో కాదో కానీ ముందైతే ప్రొడక్షన్ హౌస్ నుంచి క్రమం తప్పకుండా అప్డేట్స్ వస్తూ ఉండాలి. జూన్ 4 రిలీజనే ఉద్దేశంలో ఏప్రిల్ లోనే హీరో యష్ కొన్ని మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. తర్వాత విడుదల వాయిదా పడింది. దీంతో పబ్లిసిటీ ఆపేసి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తో పాటు బిజీ అయిపోయాడు. తరచు బయట కనిపిస్తున్నా టాక్సిక్ రిలీజ్ డేట్ ప్రస్తావన రాకుండా యష్ జాగ్రత్త పడుతున్న వైనం స్పష్టం.

కెవిఎన్ సంస్థకు కన్నడలో ఇటీవలే విడుదల చేసిన కెడి ది డెవిల్ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. జన నాయకుడు రిలీజ్ జూన్ 19 ఉంటుందని ఇప్పటికే చెన్నై మీడియా కోడై కూస్తోంది. ఒకవేళ అదే నిజమైన పక్షంలో టాక్సిక్ గురించి కూడా ఏదో ఒక అప్డేట్ వీలైనంత త్వరగా ఇవ్వడం బెటర్. నయనతార, హుమా ఖురేషి., కియారా అద్వానీ, రుక్మిణి వసంత్ లాంటి క్రేజీ క్యాస్టింగ్ ఉన్నప్పటికీ కూడా జనంలో ఈ ప్రాజెక్టు మీద ఎక్కువ బజ్ లేకపోవడం గమనార్హం.

టాక్సిక్ అసలు సమస్య మరొకటి ఉంది. కెజిఎఫ్ తర్వాత యష్ మరీ ఎక్కువ జాగ్రత్త తీసుకుని టాక్సిక్ ని లాక్ చేసుకోవడానికి విపరీతమైన సమయం తీసుకున్నాడు. ఇంతా చేసి ఈ సినిమా టీజర్లు ఆశించిన స్థాయిలో బజ్ పెంచలేకపోయాయి. ఇప్పుడొక ఎక్స్ ట్రాడినరి ట్రైలర్ అవసరం. నవంబర్ లో యష్ రావణుడిగా నటించిన రామాయణ రిలీజవుతున్న నేపథ్యంలో దానికన్నా కనీసం మూడు నెలల ముందు టాక్సిక్ రావడం అవసరం. లేదంటే వచ్చే ఏడాదికి షిఫ్ట్ అయ్యే రిస్క్ పొంచి ఉంది.

This post was last modified on May 26, 2026 6:32 pm

Share

Recent Posts

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

47 minutes ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

1 hour ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

2 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

3 hours ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

3 hours ago

తండ్రిపై ప్రేమ‌.. శ‌వాన్ని నాలుగేళ్లుగా.. !

తల్లిదండ్రుల‌పై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వ‌ర‌కు ఉండాల్సిందే. కానీ, జ్యాత‌స్య‌హి ధ్రువో మృత్యు.. అన్న‌ట్టుగా కాలం…

3 hours ago