టాలీవుడ్లో అత్యధిక మంది హీరోలున్నది ‘మెగా’ ఫ్యామిలీ అన్న సంగతి తెలిసిందే. చిరంజీవికి వేసిన పునాది మీద చాలామంది తమ కెరీర్లను నిర్మించుకున్నారు. చిరు అండ్ కోకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్.. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చే కొత్త హీరోలకు వరంగా మారుతుంటుంది. మంచి సినిమాను ఎంచుకుని అరంగేట్రం చేస్తే.. సొంత టాలెంట్ చూపిస్తే మెగా అభిమానులు యువ హీరోలను నెత్తిన పెట్టుకుంటారని ఇంతకుముందే రుజువైంది.
గత కొన్నేళ్లలో హీరోలైన మెగా కుర్రాళ్లలో వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ బాగానే నిలదొక్కుకున్నారు. ఐతే అల్లు శిరీష్ మాత్రం తడబడుతున్నాడు. ఇక మెగా ఫ్యామిలీలోకి బయటి నుంచి వచ్చి హీరోగా పరిచయం అయిన కళ్యాణ్ దేవ్ పరిస్థితి మరీ కష్టంగా ఉంది. చిరు అల్లుడిగా ఘనంగానే అరంగేట్రం చేసినా ‘విజేత’ సినిమా అతడికి తీవ్ర నిరాశనే మిగిల్చింది. సినిమా ఆడలేదు. అలాగే కళ్యాణ్ నటనకూ అంత పేరు రాలేదు.
‘సూపర్ మచ్చి’ పేరుతో రెండో సినిమా చేయగా.. దాని గురించి అతీ గతీ లేదు. లాక్ డౌన్ తర్వాత మళ్లీ షూటింగ్ చేశారు. సినిమాను పూర్తి చేశారు. అంతకుమించి ఏ అప్ డేట్ లేదు. సినిమా అసలేమాత్రం వార్తల్లో లేదు. ప్రేక్షకుల్లో కూడా దీనిపై ఆసక్తి కనిపించడం లేదు. ఈ సినిమా మేకింగ్‌లో ఉండగానే కళ్యాణ్ దేవ్ హీరోగా ‘కిన్నెరసాని’ పేరుతో ఓ కొత్త సినిమా మొదలైన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ మిత్రుడైన రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చాడు.
అశ్వత్థామ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన రమణ తేజ ఈ చిత్రానికి డైరెక్టర్. ప్రారంభోత్సవం కొంచెం ఘనంగానే చేసి సినిమాను అనౌన్స్ చేశారు. రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు ఈ చిత్రం ఆగిపోయినట్లుగా వార్తలొస్తున్నాయి. మరి సినిమా బాగా రావట్లదేని ఆపేశారా.. ఇంకేదైనా కారణాలున్నాయా అన్నది తెలియదు కానీ.. ఈ చిత్రం ఆగిపోయినట్లు మాత్రం ఇండస్ట్రీలో గట్టి ప్రచారమే జరుగుతోంది. మంచి బ్యాకప్ ఉండి, ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కళ్యాణ్ దేవ్.. తన కెరీర్ ఇలా అవుతుందని ఊహించి ఉండడేమో.
This post was last modified on December 31, 2020 6:49 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…