తమిళ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వ్యక్తిగత జీవితం గురించి తరచుగా వార్తలు వస్తుంటాయి. సంగీత దర్శకుడిగా ప్రయాణం ఆరంభించిన కొత్తలోనే ఒక నటి, సింగర్‌తో తన ప్రేమాయణం చర్చనీయాంశంగా మారింది. తర్వాత కీర్తి సురేష్‌తో తన పెళ్లి అంటూ ఒక దశలో చర్చ జరిగింది. ఇది ఫేక్ న్యూస్ అని తర్వాత వెల్లడైంది. ఐతే ఏడాదిగా అతడి పెళ్లి గురించి కొత్త వార్తలు వస్తున్నాయి.
సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ తనయురాలు కావ్య మారన్‌తో అనిరుధ్ ప్రేమలో ఉన్నట్లు.. వీరి పెళ్లి జరగబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాదే వీరి వివాహం గురించి వార్తలు వచ్చాయి. కానీ అవి నిజం కాలేదు. కానీ ఇప్పుడు మళ్లీ ఆ ప్రచారం ఊపందుకుంది. అనిరుధ్, కావ్యల వివాహానికి ముహూర్తం ఖరారైందని.. ఈ ఏడాది చివర్లో వీరి పెళ్లి జరగబోతోందని మీడియాలో, సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి.
సూపర్ స్టార్ రజినీకాంత్ భార్య లత సోదరుడైన రవిచందర్ తనయుడే అనిరుధ్. ఇటు రవిచందర్, అటు రజినీకాంత్ కుటుంబాలతో మారన్ ఫ్యామిలీ పెళ్లి విషయంలో ఒక అవగాహనకు వచ్చిందని.. కుటుంబ సభ్యులు, ముఖ్యమైన బంధువులు, సన్నిహితుల సమక్షంలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుని.. ఆ తర్వాత చెన్నైలో గ్రాండ్‌గా రిసెప్షన్ పెట్టాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయని మీడియా రిపోర్ట్ చేస్తోంది.
సన్ గ్రూప్‌కు పలు వ్యాపారాలుండగా కావ్య.. ఐపీఎల్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ వ్యవహారాలను తనే చేసుకుంటోంది. 18 ఏళ్ల వయసులోనే ‘3’ మూవీతో సంగీత దర్శకుడిగా సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చిన అనిరుధ్.. ప్రస్తుతం ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. అతను ప్రస్తుతం డబుల్ డిజిట్ ఫిగర్‌ను పారితోషకంగా తీసుకుంటున్నాడు. ఈ ఏడాది ప్యారడైజ్, జైలర్-2 లాంటి సెన్సేషనల్ మూవీస్ అతడి నుంచి రాబోతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates