Movie News

ప్రపంచాన్ని వణికిస్తున్న సినిమాలో ఏముంది

కేవలం పది కోట్ల బడ్జెట్ తో తీసిన హారర్ మూవీ వెయ్యి కోట్లు వసూలు చేసే దిశగా పరుగులు పెడుతుందని ఎవరైనా ఊహించగలరా. కానీ హాలీవుడ్ సినిమా అబ్సెషన్ ఇది సాధ్యమని నిరూపిస్తోంది. మే 15 విడుదలైన ఈ చిత్రం ఇప్పటిదాకా వరల్డ్ వైడ్ సుమారుగా 30 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసినట్టు ఇంగ్లీష్ మీడియా కథనాలు వెలువడుతున్నాయి. విపరీతమైన అంచనాలతో వచ్చిన మైఖేల్ ని దాటుకుని మరీ ఇది దూసుకుపోతున్న వైనం ట్రేడ్ ని విస్మయపరిచేలా చేస్తోంది.

అంతగా ఇందులో ఏముందో చూద్దాం. బేర్ అనే కుర్రాడు నిక్కీ అనే అమ్మాయిని ఇష్టపడి ఎలాగైనా సొంతం చేసుకోవాలనుకుంటాడు. కానీ ప్రేమని బయటికి చెప్పడు. ఓసారి ఒక విచిత్రమైన బొమ్మ ముందు నిలబడి నిక్కీ ఎవరిని ప్రేమించనంత గొప్పగా తనను ఇష్టపడాలని కోరుకుంటాడు. అచ్చం నిక్కీలాగే ఉండే మరో యువతి ఇతని లైఫ్ లోకి వస్తుంది. ఆమె ఒక సైకో. విచిత్రమైన ప్రవర్తనతో ఘోరమైన హత్యలు చేయడం మొదలుపెడుతుంది. ఎన్నో దారుణాలు జరుగుతాయి.

మిగిలింది తెరమీద చూస్తేనే కిక్కు. హద్దులు మీరి అతిగా ప్రేమిస్తే అది నాశనానికి దారి తీస్తుందని చెప్పడమే దర్శకుడు కర్రీ బార్కర్ ఉద్దేశం. చాలా వయొలెంట్ గా ఉన్న ఈ సైకో హారర్ మూవీ చూడాలంటే చాలా గుండె ధైర్యం కావాలి. కొన్ని మర్డర్లు కడుపులో తిప్పేలా జుగుప్స కలిగిస్తాయి. ట్విస్ట్ ఏంటంటే ఇందులో హీరో కూడా సైకోనే. గగుర్పొడిచే సంఘటనలతో పాటు బాగోని ఎపిసోడ్స్ కూడా అబ్సెషన్ లో ఉన్నాయి. హారర్ లవర్స్ ని మాత్రం బాగా మెప్పిస్తుంది.

ఈ స్థాయి రెస్పాన్స్ ఊహించని నిర్మాణ సంస్థ కనకవర్షంలో తడిసి ముద్దవుతోంది. ఇండియాలో అబ్సెషన్ మే 29 విడుదల కానుంది. ప్రస్తుతానికి హైదరాబాద్ లో ఒకటి రెండు మల్టీప్లెక్స్ షోలు మాత్రమే ఇచ్చారు కానీ త్వరలో ఇవి పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉంది. తెలుగు డబ్బింగ్ చేస్తే వసూళ్లు పెరిగే ఛాన్స్ ఉంది. అయినా పది కోట్లతో తీసిన ఒక సినిమా ఇంత మొత్తం వసూలు చేయడం చరిత్రలో చాలా అరుదుగా జరుగుతుంది. అబ్సెషన్ గురించి ఫిలిం మేకర్స్ మధ్య చర్చ జరుగుతోంది. సున్నిత మనస్కులు దీనికి దూరంగా ఉండటం ఉత్తమం.

This post was last modified on May 23, 2026 5:51 pm

Share

Recent Posts

ఆలస్యం ‘ఆదర్శం’ కాకుంటే చాలు

ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త ప్రచారం వెంకటేష్ అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది. అక్టోబర్ 2 నుంచి ఆల్రెడీ…

1 hour ago

బీఆర్ఎస్‌కు క‌ష్ట కాల‌మా… న‌ష్ట కాల‌మా?!

దానం నాగేంద‌ర్‌పై వేటు ప‌డ‌డం.. ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావ‌డం.. ఇటీవ‌ల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…

6 hours ago

నాని న‌న్ను భ‌రించాల్సిందే… వేరే దారి లేదు – ఓదెల‌

శ్రీకాంత్ ఓదెల‌.. ఈ పేరు చెప్ప‌గానే అంద‌రికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…

8 hours ago

నానిని వీళ్లు పట్టుకున్నారు… వాళ్లు వదిలేశారు

నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…

8 hours ago

ప్యారడైజ్ మీటింగులో పదనిసలు

నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…

10 hours ago

ట్రబుల్ బృందానికి టైమ్ కలిసి వస్తోంది

వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…

11 hours ago