Movie News

ఇంతకీ ‘పెద్ది’ కథ ఏంటి?

ఈ ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఒకటైన ‘పెద్ది’ ఇంకో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో నిన్న థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ ట్రైలర్ పట్ల ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొందరు ట్రైలర్ ఓకే అంటుంటే.. కొందరు ఇందులో కొత్తదనం ఏముంది అని పెదవి విరుస్తున్నారు. సాధారణంగా థియేట్రికల్ ట్రైలర్ అంటే.. కథేంటన్నది చెప్పేస్తుంటారు దర్శకులు. ట్రైలర్ ఉద్దేశమే అది. అలా అని మొత్తం ఓపెన్ చేసేస్తే ఇక సినిమాలో చూడ్డానికి ఏముంటుంది అనిపిస్తుంది.

అందుకే దర్శకులు కథను విప్పీ విప్పనట్లుగా చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. నిన్నటి ట్రైలర్లో బుచ్చిబాబు కూడా ఆ స్టైల్‌నే అనుసరించాడు. ఐతే కొంచెం ఆలోచించి చూస్తే ‘పెద్ది’ కథేంటన్నది అర్థమైపోతుంది. అభివృద్ధికి దూరంగా ఉండే ఒక ఊరు.. ఆ ఊరి జనాల మీద అందరికీ చిన్నచూపు.. ఆ ఊరి నుంచి వచ్చిన కుర్రాడు.. వివిధ ఆటల్లో తన నైపుణ్యాన్నే పెట్టుబడిగా మార్చి.. పెద్ద వాళ్లను ఢీకొట్టి తన వాళ్లకు, తన ఊరికి ఒక గుర్తింపు తీసుకురావడమే ‘పెద్ది’ కథగా కనిపిస్తోంది.

ట్రైలర్లో చూపించిన తొలి షాట్.. కొన్ని డైలాగులను బట్టి.. పెద్ది ఊరు ఒక కొండ కింద ఉంటుంది. అక్కడికి ప్రయాణం చేసి వెళ్లడం కూడా కష్టం. ఆ ఊరిలో రైలు బండి ఆగదు. ఆ ఊరి వాళ్లంటే అందరికీ చిన్న చూపే. అక్కడ ఉన్న వాళ్లందరూ కూలి పని చేసుకుని బతికేవాళ్లు. తమ బతుకుల్లో మార్పు రావాలని ఏళ్ల తరబడి ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండదు. చివరికి తనకు తగిలిన గట్టి ఎదురు దెబ్బ తర్వాత పెద్ది మార్పు కోసం పూనుకుంటాడు.

ఒక ఛాలెంజ్ చేసి.. తన ఆటతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగి, తన ద్వారా ఊరికి గుర్తింపు తీసుకువచ్చే నేపథ్యంలో ఈ కథ నడిచేలా కనిపిస్తోంది. ఈ క్రమంలో అతడికి జరిగిన నష్టం ఏంటన్నది కీలకమైన పాయింట్. దాని చుట్టూనే ఒక ట్విస్ట్ ఉంటుంది. అది సినిమాలో హైలైట్‌గా ఉంటుందని సమాచారం. సినిమాలో రెండు మూడు ఎమోషనల్ ఎపిసోడ్లు ఉంటాయి. అవి ప్రేక్షకులను కదిలించేస్తాయని తెలుస్తోంది. ‘పెద్ది’ జూన్ 4న రిలీజ్ కానుండగా.. ముందు రోజు రాత్రి పెయిడ్ ప్రిమియర్స్ పడబోతున్నాయి.

This post was last modified on May 19, 2026 9:54 pm

Share

Recent Posts

ప్యారడైజ్ డే-1 ఎంత?

నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో రూపొంది, అత్యధిక అంచనాలతో విడుదల కాబోతోంది ‘ది ప్యారడైజ్’ సినిమా. ఈ…

17 minutes ago

నిమ్స్ డాక్టర్ ఆస్తులు 80 కోట్లా?

ఒక డాక్టర్ ఇంటి మీద ఏసీబీ దాడులు చేయడమే ఒక సెన్సేషన్ అయితే ఆయన ఇంట్లో కోట్ల రూపాయల కట్టలు…

7 hours ago

మనసు మార్చుకున్న ఆదర్శం… మంచిదే కానీ

గత కొన్ని రోజులుగా బయట ప్రచారం జరుగుతున్నట్టు ఆదర్శ కుటుంబం ఏకె 47 ఒక వారం వాయిదా పడింది. ముందు…

8 hours ago

పుష్ప విలన్ ‘ట్రబుల్’ కొత్తగా ఉందే

ఒక మీడియం బడ్జెట్ సినిమాకు రాజమౌళి ప్రెజెంట్స్ అని పడిందంటే అందులో విషయం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎందుకంటే…

10 hours ago

జపాన్ ఓడినా టీమిండియా గెలవలేదు…

జపాన్‌పై రెండు పరుగుల తేడాతో గెలిచారు. కానీ ఈ మ్యాచ్ తర్వాత టీమిండియా బ్యాటింగ్‌పై మళ్ళీ సందేహాలు మొదలయ్యాయి. భారత…

10 hours ago

గిన్నిస్ బుక్కంటే క్రేజ్ తగ్గిందనుకోవాలా

ఒకప్పుడు గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డులో పేరు సంపాదించుకోవడమంటే అదో పెద్ద ఘనతగా భావించే వాళ్ళు. పెద్ద పెద్ద…

11 hours ago