Movie News

జాన్వీ కొంచెం మిస్ ఫైర్ అయ్యిందా

పెద్ది ట్రైలర్ లో జాన్వీ కపూర్ ని కేవలం గ్లామర్ షోకే పరిమితం చేయడం ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రతి సీన్ లో పైట గాల్లోకి ఎగరేస్తూ నడుము హైలైట్ అయ్యేలా పదే పదే ఫ్రేమ్ సెట్ చేసిన దర్శకుడు బుచ్చిబాబు ఆమె పాత్రలో బోల్డ్ నెస్ ఉంటుందనే హింట్ ఇచ్చాడు. ఈవెంట్ లో రామ్ చరణ్ ఏమో ఆమె పెర్ఫార్మన్స్ గురించి ఆకాశానికి ఎత్తేశాడు. డాన్స్, నటన ఓ రేంజ్ లో ఉందని చెప్పుకొచ్చాడు. కానీ అలాంటి విజువల్స్ వీడియోలో లేవు.

ఇన్ సైడ్ టాక్ ప్రకారం జాన్వీ కపూర్ కు తగిన ప్రాధాన్యం ఉన్నప్పటికీ ట్రైలర్ లో అలా చూపించడానికి కారణం కేవలం మాస్ ని ఆకర్షించడానికేనట. తన క్యారెక్టర్ ని మరీ ఎక్కువగా ప్రెజెంట్ చేస్తే లేనిపోని అనాలసిసులు బయటికి వస్తాయి కాబట్టి రామ్ చరణ్ మీద మాత్రమే ఫోకస్ వచ్చేలా బుచ్చిబాబు కట్ చేయించాడని చెబుతున్నారు. ఈ జంటకు డాన్సింగ్ డ్యూయెట్ ఉండకపోవచ్చనే టాక్ కూడా ఉంది. దాని వెనుక రీజన్ వేరే ఉందట.

ఏది ఏమైనా జాన్వీని కేవలం ఇలా గ్లామర్ ప్రదర్శించడం కోసమే అన్నట్టు ప్రొజెక్ట్ చేయడం కొంచెం మిస్ ఫైర్ అయ్యిందని చెప్పాలి. అయినా దేవరలో కూడా జాన్వీకి ఎక్కువ స్కోప్ దక్కలేదు. సెకండాఫ్ లో మాత్రమే కనిపిస్తుంది. కానీ పెద్దిలో అలా కాదు. ఫస్ట్ హాఫ్ నుంచే ఉంటుంది కానీ రెండో సగంలో కథ డిమాండ్ మేరకు పదే పదే కనిపించకపోవచ్చని టాక్. రామ్ చరణ్, శృతి హాసన్, జాన్వీ కాంబోలో తీసిన ఐటెం సాంగ్ ఇంటర్వెల్ అయిన వెంటనే వస్తుందని టాక్.

భోపాల్ లో 23న ఐటెం సాంగ్ లాంచ్ జరగనుంది. ఇదే వేదిక మీద ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ కన్సర్ట్ ఉంటుంది. పెద్దిని ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ మార్కెటింగ్ చేసేందుకు టీమ్ పక్కా ప్రణాళికతో ఉంది. దాదాపు అన్నింటిలో జాన్వీ ఉండేలా చూసుకుంటున్నారట. పెద్ది హిట్ అయితే జాన్వీకి కలిగే మరో భారీ ప్రయోజనం స్టార్ హీరోల సరసం ఆఫర్లు. అల్లు అర్జున్ రాకాలో ఉందనే వార్త ఆల్రెడీ లీక్ అయ్యింది. అఫీషియల్ గా ఇంకా కన్ఫర్మ్ కాలేదు.

This post was last modified on May 18, 2026 10:37 pm

Share

Recent Posts

చిరు ఉద్దేశం ఏమిటో అర్థమైతే కదా

ఇప్పుడంటే ప్యారడైజ్ యుఫోరియాలో జనం పడిపోయారు కానీ మొన్నటిదాకా ఇండస్ట్రీ హాట్ టాపిక్స్ లో ఒకటిగా నిలిచింది కాకా వర్సెస్…

9 hours ago

కేసీఆర్ అంచ‌నాకు చిక్క‌ని రేవంత్‌!

ఎలాంటి నాయ‌కుడినైనా.. ఎలాంటి పార్టీనైనా త‌న కంటిచూపుతో అంచ‌నా వేయ‌గ‌ల రాజ‌కీయ దురంధ‌రుడిగా మాజీ సీఎం, తెలంగాణ నాయ‌కుడు, బీఆర్ఎస్…

10 hours ago

మొన్న ఉచితాలు.. నేడు విగ్ర‌హాలు.. అమెరికా పాలిటిక్స్ హీట్‌!

అగ్ర‌రాజ్యం అమెరికాలో మ‌ధ్యంత‌ర అధ్య‌క్ష ఎన్నిక‌లు కాక రేపుతున్నాయి. ప్ర‌త్య‌ర్థుల‌పై పైచేయి సాధించేందుకు పార్టీలు.. అనేక ప్ర‌యాస‌లు ప‌డుతున్నాయి. అదే…

10 hours ago

మంచి ఛాన్స్ వదిలేసిన బ్లాక్ బస్టర్

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం నమోదు చేసిన హనుమాన్ అంశ్ ఇప్పటిదాకా మూడు వందల యాభై…

11 hours ago

మగాళ్ళకు పీరియడ్స్ వస్తే..?

ఆడవాళ్లకు మాత్రమే పరిమితమైన కొన్ని బాధల గురించి ఇటీవల పెద్ద చర్చ జరుగుతోంది. పురిటి నొప్పులతో పాటు నెలవారీ పీరియడ్స్…

12 hours ago

డింపుల్ హయతి లో ఈ టాలెంట్ కూడా ఉందా?

డింపుల్ హయతి.. ఈ పేరు వినగానే ఎవరో ముంబయి భామ అనుకుంటారు. ఆమె చేసిన పాత్రలు.. తన అప్పీయరెన్స్ అదీ…

15 hours ago