బాక్సాఫీస్ వద్ద కరుప్పు / వీరభద్రుడు జోరు బాగానే ఉంది. ముఖ్యంగా తమిళనాడులో రికార్డులు రాసే దిశగా పరుగులు పెడుతోంది. సూర్యని ఊరిస్తున్న విజయం ఎట్టకేలకు దక్కింది. మొదటి వీకెండ్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో కొంత నెమ్మదించినప్పటికీ ప్రధాన కేంద్రాల్లో ఆక్యుపెన్సీలు బాగానే ఉంటున్నాయి. బాక్సాఫీస్ కు మాస్ కరువు ఏ స్థాయిలో ఉందో వీరభద్రుడుతో తెలిసి వచ్చింది. ఇదంతా బాగానే ఉంది కానీ వీరభద్రుడు చేసిన ఒక తప్పుని త్వరగానే తెలుసుకున్నాడు.
అదేంటంటే ఒక సీన్ లో బ్యాక్ గ్రౌండ్ లో విజయ్ కాంత్ సినిమా పాట ఒకటొస్తుంది. ఇది ఇళయరాజా కంపోజింగ్. దీని మీద దర్శకుడు ఆర్జె బాలాజీ ఇన్ డైరెక్ట్ గా ఒక కౌంటర్ రాశారు. హక్కుల కోసం పోరాడే దాని గురించి ఒక వ్యంగ్య మాట ఉంటుంది. అది రాజా అభిమానులను హర్ట్ చేసింది. ఇళయరాజా కాపీ రైట్స్ విషయంలో కోర్టుకి వెళ్లిన దాదాపు ప్రతిసారి గెలిచారు. అలాంటిది అదేదో చేయకూడని పని అన్న తరహాలో కామెడీ చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇది గుర్తించిన నిర్మాణ సంస్థ వెంటనే ఆ సీన్ మార్పుకు సిద్ధపడి క్షమాపణ కోరుతూ ఒక లేఖ విడుదల చేసింది. నిజానికి సన్నివేశం రాసే స్టేజిలోనే ఇలాంటివి ఆలోచించుకోవాలి. ఇళయరాజా లాంటి గొప్ప కంపోజర్ కోలీవుడ్ కు దక్కిన వరం. ప్రపంచవ్యాప్తంగా ఆయన పాటలకు కుర్ర జనరేషన్ లోనూ అభిమానులు ఉన్నారు. అలాంటిది ఆ విద్వత్తు, వయసుకు గౌరవం ఇవ్వకుండా ఏదో పంచ్ వేశామని ఫీలైతే ఇలాంటి పరిణామాలే ఉంటాయి.
ఏదైతేనేం ఫైనల్ గా సారి అయితే చెప్పారు. మూవీ రిజల్ట్ పట్ల సూర్య పిచ్చ హ్యాపీగా ఉన్నాడు. పదమూడు సంవత్సరాల తర్వాత తన సినిమా కమర్షియల్ గా ఇంత పెద్ద సక్సెస్ సాధించడం చూసి తనకు మాటలు రావడం లేదు. క్లైమాక్స్ లో అయన వేసిన దేవుడి పూనకం ఎపిసోడ్ కు తమిళంలో భీభత్సమైన రెస్పాన్స్ వస్తోంది. జనాలు సీట్లలోనే ఊగిపోతున్నారు . కరుప్పు స్వామి మీద తమిళులకు ఆరాధనాభావం చాలా ఎక్కువ, అందుకే ఈ మూవీ ఇంతగా క్లిక్ అవుతోంది.
This post was last modified on May 19, 2026 5:25 pm
మొన్న శుక్రవారం విడుదలైన ఈ నగరానికి ఏమైంది రిపీట్ అంచనాలకు మించి హైదరాబాద్, ఓవర్సీస్ లో అదరగొడుతోంది. వసూళ్లు ఊహించిన…
టాక్ మిశ్రమంగా ఉన్నా ఓమ్ వసూళ్లు బాగున్నాయి. వీకెండ్ తర్వాత ఎంత శాతం డ్రాప్ ఉంటుందనేది రెండు రోజులు ఆగితే…
టాలీవుడ్ తెరమీద రక్తధారలు కొనసాగుతున్నాయి. హీరోలు మారుతున్నా వయొలెన్స్ బ్యాక్ డ్రాప్ సినిమాలు కాసులు కురిపించే దిశగా ప్రేక్షకులు ముందుకు…
ఏపీ పంచాయతీ ఎన్నికల వేళ ఓ స్వామీజీ కూడా ఎన్నికల రంగంలోకి దిగారు. ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని…
తన కుమార్తె అంజలి పెళ్లిని బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌లో చేస్తామని ప్రకటించిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల పంతం ఒకవైపు..…
ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికల కోలాహలం జరుగుతున్న క్రమంలో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికల్లో ఎలాంటి…