Movie News

జాక్వెలిన్ బ్లాక్ మ్యాజిక్.. ఆ అందమేంటీ మేడమ్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026లో చోపార్డ్ మిరాకిల్ గాలాకి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వేసుకొచ్చిన ఈ బ్లాక్ డ్రెస్ అందరి దృష్టిని లాగుతోంది. రెడ్ కార్పెట్ కాదు, హోటల్ లో ఆమె నడుస్తున్న ఫొటోలు, అద్దం సెల్ఫీ, ఈవెంట్ బ్యాక్‌డ్రాప్ దగ్గర పోజులు నెట్‌లో వైరల్ అవుతున్నాయి. మినీ డ్రెస్‌లో కూడా ఇంత హంగామా చేయొచ్చని ఈ లుక్‌తో మళ్లీ చూపించింది.

ఆమె డ్రెస్ పూర్తిగా టెక్స్చర్డ్ నలుపు వస్త్రం. చిన్న చిన్న మెరుపులతో కాంతి వస్తోంది. దానికి తోడు డైమండ్ గొలుసు, పెద్ద గుండ్రని చెవి రింగులు, చేతికి వెడల్పాటి కడియం. జుట్టుని ఒక పక్కగా వదిలేసి, తళుకు మేకప్‌తో పూర్తి చేసింది. నగలు ఎక్కువ లేవు కానీ ఉన్నవే లుక్‌ని నింపాయి. నలుపు చెప్పులతో ఆ నడక ఫొటోకి కొత్త అందం తెచ్చింది.

జాక్వెలిన్ సినిమాలు చేస్తుందా లేదా అనే మాట ఎప్పుడూ ఉంటుంది. 2023లో సర్కస్, సెల్ఫీ సినిమాలో పాట, 2024లో ఫతే, అమెరికన్ సినిమా కిల్ ఎమ్ ఆల్ 2, 2025లో రైడ్ 2, హౌస్‌ఫుల్ 5 చేసింది. 2026లో వెల్‌కమ్ టు ది జంగిల్ విడుదలకు సిద్ధంగా ఉంది. అంటే తెర మీద ఖాళీ లేదు. అయినా సినిమాల లెక్క పక్కన పెడితే, ఆమెలో ఉన్న హుందాతనం మాత్రం ఎక్కడికీ పోలేదు. ఈ కేన్స్ ఫొటోలే దానికి నిదర్శనం.

ఈ లుక్‌లో హైలెట్ అయ్యే విషయం ఏంటంటే పెద్దగా కష్టపడినట్టు కనిపించకపోవడం. పోజులు పెట్టినట్టు లేదు. అద్దం సెల్ఫీ అయినా, మెట్ల దగ్గర నిల్చున్నా చాలా సహజంగా ఉంది. గ్లామర్ అంటే అంతకుమించి అనేలా అలంకరణ కాదు, వేసుకున్న దాన్ని ఎంత గ్లామరస్ గా హైలెట్ చేస్తున్నారనేది ముఖ్యం. జాక్వెలిన్‌కి ఆ విషయం బాగా తెలుసు.

15 ఏళ్ల కెరీర్ తర్వాత కూడా ఫ్యాషన్‌తో కొత్తగా ట్రై చేయగలగడం, ప్రతి ఈవెంట్‌కి కొత్తగా కనిపించడం సులువు కాదు. ఇక గెలుపు ఓటములతో సంబంధం లేకుండా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన క్రేజ్ ని అలా నిలబెట్టుకుంటూ వస్తోంది. కేన్స్ లాంటి అంతర్జాతీయ వేదిక మీద ఇండియా నుంచి వెళ్లి ఇలా ఆకట్టుకోవడం చిన్న విషయం కాదు. ఈ లుక్ చూస్తే ఆమెకు గ్లామర్ కొత్త కాదు, అది తనలో భాగమైపోయింది అనిపిస్తుంది.

This post was last modified on May 19, 2026 12:42 pm

Share

Recent Posts

సందీప్ వంగాని టార్గెట్ చేయడం రైటేనా

నిన్న అనంతపురం జిల్లా రాప్తాడులో పదో తరగతి విద్యార్థిని మీద ఒక యువకుడు రంపపు మెషీన్ తో దాడి చేసిన…

5 minutes ago

ప్రయోగం చేయడమే ప్రభావితం చేసిందా

టాలీవుడ్ లో ఇప్పటిదాకా ఎవరూ టచ్ చేయని జానర్ ఏదైనా ఉందంటే వాటిలో మొదటిది స్లాషర్. అంటే మనుషులను కాయగూర…

8 minutes ago

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ మరింత వేగం

వైసీపీ అధినేత‌, ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసుల విచార‌ణ‌ను రోజువారీగా చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించిన నేప‌థ్యంలో ఆయా కేసుల…

2 hours ago

ప్రకాష్‌రాజ్‌కు అడ్వాన్సులిచ్చి తీసేసుకున్నారట

ప్రకాష్ రాజ్ స్వతహాగా నటుడైనప్పటికీ.. కొన్నేళ్లుగా సినిమాల కంటే రాజకీయాల మీదే ఆయన దృష్టి ఎక్కువగా ఉంటోంది. 12 ఏళ్లుగా…

4 hours ago

రామాయ‌ణం.. ఒక్క స‌న్నివేశానికి ఆరున్న‌రేళ్లు

ఇప్పుడు ఇండియ‌న్ సినిమా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న‌ది రామాయ‌ణం సినిమా కోస‌మే. 4 వేల కోట్ల బ‌డ్జెట్ అని…

4 hours ago

మేన‌కోడ‌లి పెళ్లి జ‌గ‌న్ పొలిటిక‌ల్ ఇమేజ్‌ను శాసిస్తుందా ?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ఇమేజ్‌పై ఆయన మేనకోడలి పెళ్లి…

10 hours ago