Movie News

శ్రీరాములు రినోవేషన్… ఎగ్జిబిటర్ల సమాధానమా

హైదరాబాద్ మూసాపేట్ శ్రీరాములు థియేటర్ చాలా పాతది. అందులో మూవీ లవర్స్ కి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ మధ్య 4కె స్క్రీన్, అట్మాస్ సౌండ్ చేయించారు కానీ ఇంకా ఇతర సౌకర్యాలు పాతవే ఉన్నాయి. ఇటీవలే జరిగిన ప్రెస్ మీట్ లో ఈ సింగల్ స్క్రీన్ ని ఉద్దేశించి నిర్మాతలు మాట్లాడుతూ రినోవేషన్ చేయలేదని, అలాంటివాటికి పర్సెంటేజ్ ఇవ్వాల్సిందేనని ఎలా అడుగుతారని పేరు ప్రస్తావించకుండా ఇన్ డైరెక్ట్ గా దాని గురించి చెప్పిన సంగతి తెలిసిందే.

దానికి సమాధానంగా కాబోలు శ్రీరాములుని మళ్ళీ రీ మోడలింగ్ చేసే పనులు మొదలయ్యాయి. సీటింగ్ మార్చేయడంతో పాటు కొన్ని కీలకమైన మార్పులు యుద్ధ ప్రాతిపదికన చేయిస్తున్నారు. ఒకవేళ జూన్ 4 పెద్ది వేయాల్సి వస్తే ఆలోగా సర్వం సిద్ధం చేసేలా ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఇంత హఠాత్తుగా ఎందుకు నిర్ణయం తీసుకున్నారంటే దీన్నో మోడల్ గా చూపించి ఇకపై సింగల్ స్క్రీన్ ఎలా ఉంటాయో ఒక శాంపిల్ గా నిలబెడతారట.

ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్ లో సునీల్ నారంగ్ మాట్లాడుతూ శ్రీరాములు మూసేయడం ఎప్పుడూ చూడలేదని, కానీ సినిమాల్లేక ఇలా జరగడం షాక్ కలిగించిందని అన్నారు. సో అసలు కారణం ఇదన్న మాట. ప్రస్తుతం బుక్ మై షో లిస్టింగ్ లో ఈ థియేటర్ తీసేశారు. వర్క్స్ అన్నీ అయ్యాక మళ్ళీ జోడిస్తారు. టాలీవుడ్ ప్రొడ్యూసర్లు ఏవైతే కంప్లయింట్స్ ఇస్తున్నారో వాటికి సమాధానంగా సింగల్ స్క్రీన్లను సమూలంగా ప్రక్షాళన చేసే ఆలోచన ఒకరకంగా మంచిదే.

ఇప్పటికీ ఏపీ తెలంగాణలో కొన్ని సింగల్ స్క్రీన్లు అధ్వాన్న స్థితిలో ఉన్నాయి. వాటిని బాగుపరచడం లేదు. అందుకే ప్రేక్షకులు కూడా యాభై రూపాయలు ఎక్కువైనా పర్వాలేదని మల్టీప్లెక్సులకు వెళ్లిపోతున్నారు. బెస్ట్ ఎక్స్ పీరియన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే నిజంగానే సింగల్ స్క్రీన్లు ప్రమాదంలో పడతాయి. అందుకే వీలైనంత త్వరగా ఆధునీకరించే పనిలో ఎగ్జిబిటర్లు పడ్డారని తెలిసింది. బహుశా శ్రీరాములు వాటిలో మొదటి అడుగు అనుకోవాలేమో.

This post was last modified on May 15, 2026 2:42 pm

Share

Recent Posts

ఇది కియారా అద్వానీకే సాధ్యం

ఒకప్పుడు హీరోయిన్ల కెరీర్ మంచి ఊపులో సాగుతుంటే వాళ్లు పెళ్లి జోలికి వెళ్లేవాళ్లు కాదు. అవకాశాలు తగ్గిపోయి, ఫేడవుడ్ అవుతున్న…

15 minutes ago

మహా కథ మళ్ళీ కంచెర్లపాలెంకే

మహేష్ బాబు సమర్పణలో సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా రూపొందించిన ‘రావు బహదూర్’ సినిమా మీద టీం అంతా చాలా…

22 minutes ago

నష్టాలు వచ్చాయని ఒప్పుకున్న నాని

తమ సినిమాలు థియేటర్లలో ఉండగా అందులో లోపాల గురించి.. దాని మీద వచ్చే విమర్శల గురించి, కలెక్షన్లు తక్కువ రావడం…

39 minutes ago

చివరి మ్యాచ్‌లోనూ అదే మెస్సీ… వారసుడికే గోల్ ఇచ్చి వెళ్లాడు!

21 ఏళ్ల కెరీర్‌లో అర్జెంటీనా కోసం ఎన్నో మ్యాచ్‌లను ఒంటిచేత్తో మార్చిన లియోనెల్ మెస్సీ.. చివరి మ్యాచ్‌లోనూ తన మార్క్…

44 minutes ago

అక్కడ కలెక్షన్ల వర్షం… ఇక్కడ వసూళ్ల నీరసం

కొన్ని సినిమాలు నేటివిటీ మీద ఆడతాయి. ఒక చోట బ్లాక్ బస్టర్ అయినంత మాత్రాన పక్కన కూడా అదే రిజల్ట్…

2 hours ago

వరప్రసాద్ స్నేహితులకు ఒకే సమస్య

మన శంకరవరప్రసాద్ గారులో ఫ్రెండ్స్ గా నటించిన చిరంజీవి, వెంకటేష్ కు ఒకే సమస్య వచ్చింది. అదేంటంటే తక్కువ గ్యాప్…

2 hours ago