గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా ఈ సినిమా మీద ఎంతగా రగిలిపోయారో చూశాం. అక్కడి థియేటర్లలో బ్యాన్ చేసినా సరే కోట్లాది ప్రేక్షకులు పైరసీ రూపంలో చూసి ఏకంగా ఆన్ లైన్ రికార్డులు కట్టబెట్టారు. ఎందరో వ్లాగర్స్ లియారి ప్రాంతం మీద వీడియోలు చేసి మిలియన్ల వ్యూస్ సంపాదించుకున్నారు. దీనికి కౌంటర్ ఇవ్వాలనే ఉద్దేశం అక్కడి మేకర్స్ లో ఎప్పటి నుంచో ఉంది.
దురంధర్ కి మా సమాధానం అన్నట్టుగా పాకిస్థాన్ లో ‘మేరా లియారి’ అనే సినిమా గత వారం మే 8 విడుదలయ్యింది. మాఫియా, రౌడీయిజం రాజ్యమేలే ఆ ప్రాంతంలో మానవత్వం ఉందని, మహిళలను గొప్పగా గౌరవిస్తారని చూపించే ఉద్దేశంతో ఈ కళాఖండానికి లేడీ ఫుట్ బాల్ బ్యాక్ డ్రాప్ తీసుకున్నారు. ఇంతా చేసి మేరా లియారికి మొదటి రోజు బుక్ అయిన టికెట్లు అక్షరాలా 22 మాత్రమే. ఒక్క స్క్రీన్లో కాదండోయ్. మొత్తం కలిపి అంతేనట. కరెంట్ బుకింగ్ లో ఇంకో యాభై వందా పోయుంటాయి.
దెబ్బకు పాకిస్థాన్ ఎగ్జిబిటర్లు రెండో వారంలోకి అడుగు పెట్టక ముందే మేరా లియారిని థియేటర్ల నుంచి తీసేశారు. ఫైసలాబాద్ లో డిజాస్టర్ లు కూడా కనీసం పది రోజులు ఆడే తాజ్ మహల్ థియేటర్ లో వీకెండ్ కే లేపేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయినా పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు దురంధర్ కు సమాధానం చెప్పాలనే తాపత్రయం పాక్ నిర్మాతలకు కలగడం అతి పెద్ద కామెడీ. క్రికెట్ లోనే కాదు బాక్సాఫీస్ దగ్గర కూడా వాళ్లకు పరాభవమే.
ఇక దురంధర్ ది రివెంజ్ మే 14 నుంచి ఓటిటిలో వచ్చేసింది. హెచ్డి వెర్షన్ కావడంతో జనాలు ఎగబడి చూస్తారని వేరే చెప్పనక్కర్లేదు. ఈసారి కూడా పాక్ నుంచి అత్యధిక వ్యూస్ వస్తాయని నెటిజెన్లు అంచనా వేస్తున్నారు. విచిత్రంగా దురంధర్ ని అక్కడి పాలకులు తిట్టుకున్నా ప్రజలు మాత్రం ఎంజాయ్ చేశారు. దీని ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే లాహోర్ లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వాళ్ళు ఇండియన్ స్పై ఏజెంట్లని భావించే దాకా. అందుకే అనేది దురంధరా మజాకా.
Gulte Telugu Telugu Political and Movie News Updates