‘బిగ్ బాస్’ షోలో సీజన్ ముగింపు దశకు వచ్చేసరికి హోమ్ సిక్‌తో బాధ పడుతున్న పార్టిసిపెంట్ల కోసం.. వారి కుటుంబ సభ్యుల్ని హౌస్‌లోకి తీసుకురావడం.. వారితో హౌస్ బయటి నుంచి మాట్లాడించడం లేదంటే.. హౌస్ లోపలికే పంపి కాసేపు తమ వ్యక్తితో మాట్లాడించే ఏర్పాటు చేయడం మామూలే.
ఆ సమయంలో ఆ పార్టిసిపెంట్‌ను దగ్గరికి తీసుకుని ప్రేమగా వ్యవహరించడం.. గేమ్ బాగా ఆడుతున్నావని ప్రశంసించడం.. ఇంకా బాగా ఆడాలని ప్రోత్సహించడం చేస్తుంటారు కుటుంబ సభ్యులు. కానీ తమిళ ‘బిగ్ బాస్’లో మాత్రం ఇందుకు భిన్నంగా ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఓ లేడీ పార్టిసిపెంట్‌ను ఆమె తల్లి తీవ్రంగా మందలించి.. దూషించి వెళ్లడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ ఉదంతం సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ఆ పార్టిసిపెంట్ పేరు.. శివాని. ఈమె తమిళంలో చిన్నా చితకా సినిమాల్లో కొన్ని పాత్రలు చేసింది. టీవీ రంగంలోనూ ఆమెకు గుర్తింపుంది. ఈ పేరుతోనే ‘బిగ్ బాస్’లోకి వచ్చిన శివాని.. 85 రోజుల పాటు హౌస్‌లో సర్వైవ్ అయింది. ఐతే ఆమె పట్ల వీక్షకులకు కొన్ని విషయాల్లో ప్రతికూల అభిప్రాయాలున్నాయి. టైటిల్ ఫేవరెట్‌గా ఉన్న ఆరితో ఆమెకు పడట్లేదు.
అలాగే హౌస్‌లో ఉన్న బాలాజీ అనే అబ్బాయితో ఆమె మరీ ఎక్కువ సన్నిహితంగా మెలగడం చాలామందికి నచ్చట్లేదు. తాజాగా కంటెస్టెంట్లకు వారి కుటుంబ సభ్యులను కలిసే అవకాశం కల్పించగా.. శివాని కోసం ఆమె తల్లి అఖిల వచ్చింది. తల్లిని చూడగానే శివానికి దు:ఖం పొంగుకొచ్చింది. కొన్ని నిమిషాలు ఆమెను ఓదార్చిన అఖిల.. తర్వాత ఆమెను తిట్టడం మొదలుపెట్టింది.
‘‘నువ్వు హౌస్‌లోకి ఎందుకొచ్చావ్.. ఇక్కడేం చేస్తున్నావ్.. మనకు తెలిసిన వాళ్లందరూ షోలో నిన్ను చూస్తారు కదా.. ఎంతసేపూ ఆ బాలాజీ వెనుక ఎందుకు తిరుగుతావ్? వాడితో నీకెందుకు? ఆరి చెప్పింది ఎందుకు వినవు? అతను చాలా మంచోడు కదా. నీ గేమ్ నువ్వాడకుండా వేరే వాళ్ల గురించి నీకెందుకు? నీకంటూ వ్యక్తిగతంగా ఏ అభిప్రాయాలు లేవా’’ అంటూ కూతుర్ని తీవ్ర స్థాయిలో అఖిల మందలించింది.
శివాని అరవకమ్మా అంటూ ఏడుస్తూ చెబుతున్నా సరే.. ఆమె ఆగలేదు. సదరు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది శివానికి బాగా డ్యామేజింగ్‌గా తయారైంది. కూతుర్ని సపోర్ట్ చేయాల్సిన తల్లి అంత సీరియస్‌గా తిట్టడం ఏంటని… ఇలా ఏ ‘బిగ్ బాస్’ షోలోనూ జరగలేదని వీక్షకులు అభిప్రాయపడుతున్నారు.
This post was last modified on December 30, 2020 12:37 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…