Movie News

అభిమానులు కోరేవి వేరే ఉన్నాయి

అందరూ తమిళ రాజకీయాలు, విజయ్ గెలుపు ముచ్చట్లలో పడిపోయారు కానీ పెద్ది ఇంకో ఇరవై ఎనిమిది రోజుల్లో విడుదల కాబోతున్న సంగతిని మర్చిపోతున్నారు. రామ్ చరణ్ అభిమానులు ఈసారి అగ్రెసివ్ ప్రమోషన్లు కోరుకుంటున్నారు. గేమ్ ఛేంజర్ ఫలితం ముందే తెలుసు కాబట్టి దానికి పబ్లిసిటీ విషయంలో నిర్లక్ష్యం వహించినా ఊరుకున్నామని, కానీ పెద్దికి అలా జరగకూడదని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కంప్లయింట్స్ మొదలుపెట్టేశారు.

వాళ్ళిలా అనుకోవడానికి కారణం లేకపోలేదు. పెద్దికి ఏది చేసినా కింగ్ సైజులో ఉండాలని వాళ్ళ ఫీలింగ్. కానీ ఇప్పటికైతే అలాంటి మూమెంట్ లేదు. పెద్ది కారుని తీసుకొచ్చి సుస్మితకి చూపించి ఆ వీడియోని సోషల్ మీడియాలో వదిలినంత మాత్రాన ఎగ్జైట్ మెంట్ వచ్చేయదు. దాన్ని రామ్ చరణ్ లేదా చిరంజీవి తోలాలి. అలాంటివి అభిమానులకు కిక్ ఇస్తాయి. ఆ క్లిప్పులు త్వరగా వైరల్ అయిపోయి ఎక్కువ అటెన్షన్ తీసుకొస్తాయి. ఈ తరహలో ఆలోచించాలట.

దర్శకుడు బుచ్చిబాబు వీటిని సరిచేసేంత ఫ్రీగా లేడు. పోస్ట్ ప్రొడక్షన్, ట్రైలర్ కట్, రెహమాన్ రీ రికార్డింగ్, డిఐ, విఎఫెక్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లానింగ్ అంటూ సవాలక్ష పనులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. తను జూన్ 25 అనుకుంటే అది జూన్ 4 కావడంతో ప్రెజర్ రెట్టింపు ఉంది. సో విడుదలకు కొద్దిరోజులు ముందు మాత్రమే బయటికి వచ్చే ఛాన్స్ ఉంది. మరి ప్రమోషన్ బాధ్యతలు ఎవరు చూసుకోవాలంటే పూర్తిగా ప్రొడక్షన్ టీమ్, పిఆర్ మీదే ఉంటుంది

పెద్ది బ్యాట్లు, టీ షర్టులు లాంటివి అమ్మడం వరకు ఓకే. వీటితో పాటు చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా నార్త్ ఇండియాలో సినిమాను మరింత చేరువ చేయాలంటే రాజమౌళి స్థాయిలో ఆలోచించాలి. పుష్ప 2కి బీహార్ ఈవెంట్ ఎంత ప్లస్ అయ్యిందో చూశాం. అలాంటివి ఆలోచించాలి. అంతే తప్ప హైదరాబాద్ లోనే ఉంటూ అంతా జరిగిపోవాలంటే కాదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. చూడాలి మరి ఎలాంటి క్రియేటివ్ ఐడియాస్ వేస్తారో.

This post was last modified on May 6, 2026 6:30 pm

Share

Recent Posts

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

20 minutes ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

33 minutes ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

44 minutes ago

పోలీసులు కాదు.. భార్య గ‌ద్దిస్తే నిజం చెప్పాడు!

స‌హ‌జంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితుల‌ను పోలీసులు ప్ర‌శ్నిస్తారు. ముందు మాట‌ల‌తో.. త‌ర్వాత త‌మ‌దైన లాఠీ శైలితోనూ…

3 hours ago

బారికేడ్లు లేని హైవేలు.. ఏంటీ కొత్త విధానం!

ఒక ఊరు నుంచి మ‌రో ఊరుకు జాతీయ ర‌హ‌దారి(హైవే)పై ప్ర‌యాణించే స‌మ‌యంలో టోల్ గేట్లు దాట‌డం త‌ప్ప‌నిస‌రి. ఈ టోల్…

4 hours ago

నాని వాళ్ళని ఎప్పటికీ వదలడు

నేచుర‌ల్ స్టార్ నాని అంటే ఒక‌ప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్ట‌ర్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. ఎక్కువ‌గా ఫ్యామిలీ ట‌చ్ ఉన్న…

7 hours ago