మార్కెట్‍ని అంచనా వేయడంలో దిట్ట అయిన దిల్ రాజు కరోనా టైమ్‍లో థియేటర్లు తెరిస్తే జనం థియేటర్లకు ఏమేరకు వస్తారనే దానిని అంచనా వేయలేకపోయాడు. అందుకే వకీల్ సాబ్‍ను సంక్రాంతి బరిలోంచి తప్పించి సమ్మర్‍కు వాయిదా వేసాడు. దిల్ రాజు కాస్త ఉత్సాహం చూపించినట్టయితే వకీల్ సాబ్ ఈపాటికి రిలీజ్‍కి రెడీ అయి వుండేది.
సంక్రాంతికి థియేటర్లు తెరిచినా కానీ ప్రేక్షకులు రారేమోననే భయంతో సమ్మర్‍కి వాయిదా వేయగా, ఇప్పుడు థియేటర్లకు రావడానికి జనం అస్సలేమీ భయపడడం లేదు. సగం టికెట్లే అమ్మాలంటూ నిబంధన వుందంటే కరోనా భయం ఇంకా వుందనే కదా. అయినా కానీ జనం పిల్లలను వేసుకుని మరీ థియేటర్లకు వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతికి ఏకంగా నాలుగైదు సినిమాలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వీటిలో ఒక్క భారీ సినిమా కూడా లేకపోవడం గమనార్హం.
సంక్రాంతి అంటేనే భారీ చిత్రాలకు పెట్టింది పేరు. అలాంటిది దిల్ రాజు రాంగ్ క్యాలిక్యులేషన్ వల్ల వకీల్ సాబ్ ఒక సదవకాశం మిస్ అయినట్టయింది. సగం సీట్లే అమ్మాలనే రూల్ ఇప్పుడు అమల్లో వున్నా కానీ సిటీల్లో తప్ప మిగతా చోట్ల అది అమలు కావడం లేదు. పైగా భారీ చిత్రాలకు టికెట్ రేట్లు, రోజుకి షోలు పెంచుకునే వెసులుబాటు వుండనే వుంది. కాస్త ముందు చూపు చూపించి చొరవ చేసినట్టయితే వకీల్ సాబ్‍కి సంక్రాంతి సీజన్‍లో కాంపిటీషనే లేని ఫ్రీ రైడ్ దొరికి వుండేది.
This post was last modified on December 29, 2020 2:34 pm
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…
కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…