టాలీవుడ్ దిగ్గజ నిర్మాత దగ్గుబాటి రామానాయుడి తన కొడుకు విక్టరీ వెంకటేష్‌తో కలిసి తన మనవళ్లు రానా, నాగచైతన్య కలిసి నటిస్తే చూడాలని కోరిక. ఐతే ఆయనుండగా ఈ రెండు కలల్లో ఏదీ సాకారం కాలేదు. ఆయన మరణానంతరం వెంకీ, నాగచైతన్య కలిసి వెంకీ మామ సినిమాలో నటించారు. వెంకీ అన్నయ్య సురేషే ఈ చిత్రాన్ని నిర్మించారు.
గత ఏడాది విడుదలైన ఈ చిత్రం ఓ మోస్తరు ఫలితాన్నందుకుంది. కాగా ఇప్పుడు వెంకీ, రానా కలయికలో ఓ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇందుకోసం ఇంతకుముందు కూడా ప్రయత్నాలు జరిగాయి కానీ.. అవేవీ వర్కవుట్ కాలేదు. కానీ ఈసారి మాత్రం పక్కాగా ఈ కాంబినేషన్లో సినిమా తెరకెక్కే అవకాశాలున్నాయట.
శతమానం భవతితో ప్రశంసలకు తోడు పెద్ద కమర్షియల్ సక్సెస్‌ను కూడా ఖాతాలో వేసుకున్న సతీశ్ వేగేశ్న వెంకీ-రానా మల్లీస్టారర్ తీయడానికి ఆసక్తి చూపిస్తున్నారట. ఈ విషయాన్ని స్వయంగా సురేషే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ప్రస్తుతం సతీశ్ స్క్రిప్టు మీద పని చేస్తున్నాడట. సురేష్‌ను మెప్పిస్తే సురేష్ ప్రొడక్షన్స్‌లోనే ఈ సినిమా తెరకెక్కే అవకాశముంది.
శతమానం భవతికి ముందు సతీశ్ చేసిన రెండు సినిమాలు ఫ్లాపే. శతమానం భవతి తర్వాత కూడా ఆయన అంచనాలు అందుకోలేకపోయాడు. శ్రీనివాస కళ్యాణం, ఎంతమంచివాడవురా లాంటి డిజాస్టర్లు అందించారు. ప్రస్తుం తన కొడుకును, శ్రీహరి కొడుకును హీరోలుగా పెట్టి కోతి కొమ్మచ్చి అనే సినిమా చేస్తున్నారు. అది విడుదలకు సిద్ధమవుతోంది. మరి నిజంగా సురేష్‌ను మెప్పించే కథతో వెంకీ-రానా మల్టీస్టారర్ చేసే అవకాశం దక్కించుకుంటాడేమో సతీశ్ చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates