Movie News

లెనిన్ తగ్గట్లేదు… మరి పెద్ది సంగతేంటి

లెనిన్ గురించి అప్డేట్స్ లేక అసహనానికి గురవుతున్న అభిమానులకు ఊరట కలిగిస్తూ నాగార్జున ట్వీట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఫస్ట్ కాపీ చూశానని, చాలా బాగా వచ్చిందని, కొత్త అఖిల్ ని చూస్తారని ఓ రేంజ్ ఎలివేషన్ ఇచ్చి విడుదల తేదీ జూన్ 26 ప్రత్యేకంగా మెన్షన్ చేశారు. ఇటీవలే కర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు బుచ్చిబాబు పెద్ది రిలీజ్ జూన్ 25 ఉంటుందని స్టేజి మీద ప్రకటించిన సంగతి తెలిసిందే.

దీంతో మెగా ఫ్యాన్స్ ఇంకేం డౌట్ అక్కర్లేదని రిలాక్స్ అయిపోయారు. అయితే ఇప్పుడు లెనిన్ అంత స్పష్టంగా తేదీని మరోసారి నొక్కి చెప్పడం చూస్తుంటే కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. పెద్ది కోసమే మే 1 నుంచి డ్రాప్ అవుతున్నామని గతంలో లెనిన్ టీమ్ ప్రకటించింది. అయితే అది నిజం కాదని, ఇంకా బ్యాలన్స్ పనులు ఉండటం వల్లే వాయిదా వేశారు తప్పించి పెద్ది అసలు కారణమయ్యే ఛాన్స్ లేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించింది.

తీరా చూస్తే ఇప్పుడేమో లెనిన్, పెద్ది కేవలం ఒక్క రోజు గ్యాప్ తో తలపడబోతున్నాయి. ప్రాక్టికల్ గా ఇక్కడ రిస్క్ ఎవరికనేది చూసుకుంటే అఖిల్ కేనని చెప్పక తప్పదు. ఎందుకంటే పెద్ది మీద అంతా ఇంతా హైప్ లేదు. ఆకలితో ఉన్న డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు పుష్ప 2, ఆర్ఆర్ఆర్ రేంజ్ లో రిలీజ్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ లెనిన్ వస్తే స్క్రీన్ కౌంట్ తగ్గొచ్చేమో కానీ హైప్, బిజినెస్, బడ్జెట్ పరంగా రెండింటి మధ్య చాలా అంటే చాలా వ్యత్యాసం ఉంది.

ఒకటి మాత్రం స్పష్టం. నాగార్జున, అఖిల్ ఉద్దేశపూర్వకంగా చరణ్ తో క్లాష్ అవ్వాలని కోరుకోరు. పెద్ది ఇంకా అఫీషియల్ గా జూన్ 25 అని చెప్పలేదు కాబట్టి లెనిన్ తన మాటని మరోసారి నొక్కి వక్కాణించాడని అనుకోవచ్చు. అక్కినేని అభిమానులు సైతం పెద్దితో తలపడటం అంత సేఫ్ కాదనే అభిప్రాయపడుతున్నారు. ఈసారి బుచ్చిబాబుతో పాటు నిర్మాణ సంస్థ విడుదల తేదీ గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వీలైనంత త్వరగా ఇవ్వాలి. లేదంటే ఈ కన్ఫ్యూజన్లు వస్తూనే ఉంటాయి.

This post was last modified on April 29, 2026 4:58 pm

Share

Recent Posts

ఏపీలో పెరిగిపోతున్న బీపీ… ఆ జిల్లాలో మరీ ఎక్కువ!

ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…

14 minutes ago

సినిమా షూటింగ్… ఐదుసార్లు చావుకు దగ్గరగా

సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…

5 hours ago

తెలంగాణా కాంగ్రెస్లో టిక్.. టిక్.. టిక్

తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…

8 hours ago

రంభ ఊర్వశి సరే… మరి అప్పట్లో ఎలా

సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…

8 hours ago

అభిమానుల విన్నపం నాగ్ పట్టించుకోలేదా

వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…

8 hours ago

భారత్ లోనే వివాహం చేసుకోండి

భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1…

11 hours ago