బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ స్టేజ్ ఎక్కినా.. మైక్ అందుకున్నా ఎంత సరదాగా ప్రవర్తిస్తారో.. మాట్లాడతారో తెలిసిందే. తాజాగా ఆయన ఒక స్టేజ్ మీద తనదైన శైలిలో చిలిపితనం ప్రదర్శించారు. మాట్లాడుతూ మాట్లాడుతూ తనకు మూత్రం వస్తోంది అని చెప్పి స్టేజ్ దిగి వాష్ రూంకి పరుగులు పెట్టారు.
ఆమిర్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా నటించిన ఏక్ దిన్ మూవీకి సంబంధించిన ఈవెంట్లో ఈ సరదా సంఘటన జరిగింది. స్టేజ్ మీద మాట్లాడుతుండగా.. ఉన్నట్లుండి ఆమిర్ రెండు నిమిషాలు అనుమతి ఇస్తారా అని నిర్వాహకులను అడిగాడు. తర్వాత తనకు పాస్ వస్తోంది అని సంజ్ఞ చేసిన ఆయన వాష్ రూంకి వెళ్ళొస్తా అని చెప్పి స్టేజ్ దిగి పరుగులు పెట్టారు. దీంతో ఆడిటోరియం నవ్వుల్లో మునిగిపోయింది.
ఐతే ఈ ఘటనతో అందరినీ నవ్వించిన ఆమిర్ అంతకుముందు.. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
తన కుమారుడు జునైద్ ఖాన్, సాయిపల్లవి జంటగా నటించిన ఏక్ దిన్ సినిమాలో కొన్ని సన్నివేశాలు చూసి ఆమిర్ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ముంబైలోని ఎస్ఎన్డీటీ కాలేజీలో నిర్వహించిన ‘ఏక్ దిన్ కి మెహఫిల్’ అనే మ్యూజికల్ ఈవెంట్‌లో తెరపై తన కొడుకును చూస్తూ అమీర్ ఖాన్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు.
ఆమిర్ కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా.. పక్కనే ఉన్న సాయి పల్లవి ఆయనను ఓదారుస్తూ కనిపించింది. ఆ తర్వాత వేదికపైకి వచ్చిన ఆమిర్ తన కొడుకు గురించి ఎక్కువ మాట్లాడలేదు. సాయిపల్లవిపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు.
ప్రస్తుతం మన దేశంలోనే అత్యుత్తమ నటి సాయిపల్లవి అని అన్నారు.ఆమె ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే అంటూ కొనియాడారు. ఏక్ దిన్ మే 1న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు జునైద్ తమిళ బ్లాక్ బస్టర్ లవ్ టుడే ఆధారంగా తెరకెక్కిన లవ్ యాపా చిత్రంలో నటించగా అది మంచి ఫలితాన్ని అందుకోలేక పోయింది.
This post was last modified on April 27, 2026 12:41 pm
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…