తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన చివరి చిత్రం ‘జననాగయన్’ థియేటర్లలో రిలీజ్ కాకముందే గత నెలలో ఆన్ లైన్లో లీక్ అయిపోవడం ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. లీక్ అంటే ఏదో ఒకటి రెండు సీన్లు బయటికి రావడం కాదు. మొత్తంగా సినిమా సినిమానే హెచ్డీ క్వాలిటీతో బయటికి వచ్చేయడంతో తమిళ ఇండస్ట్రీ షాక్ అయిపోయింది. ఈ వ్యవహారం రాజకీయంగా కూడా ప్రకంపనలు రేపడంతో పోలీసులు సీరియస్‌గా దీనిపై దృష్టిసారించారు.
లీక్ వెనుక ఉన్న ముగ్గురు వ్యక్తులను పట్టేసుకున్నారు. ఈ చిత్రంతో సంబంధం లేని ఒక అసిస్టెంట్ ఎడిటర్.. తనకున్న పరిచయాలతో ‘జననాగయన్’ ఎడిటింగ్ విభాగంలోకి వచ్చి సినిమాను కాపీ చేసుకుని వెళ్లి లీక్ చేసినట్లు వెల్లడైంది. ఆ వ్యక్తి గురించి బయటికి తెలిస్తే.. తన ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని పోలీసులు వివరాలు బయటపెట్టలేదు. మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు.
ఐతే ఈ లీక్‌తో ఏ సంబంధం లేకపోయినప్పటికీ.. ‘జననాగయన్’ ఎడిటర్ ప్రదీప్ రాఘవన్‌ను సౌత్ ఇండియన్ ఎడిటర్స్ అసోసియేషన్ సస్పెండ్ చేసింది. సినిమాను లీక్ చేయకపోయినప్పటికీ.. నిర్లక్ష్యంగా ఉన్నందుకు బాధ్యుడిని చేస్తూ అతణ్ని సస్పెండ్ చేస్తున్నట్లు సంఘం ప్రకటించింది.
ఈ సినిమాను ఎడిటరే లీక్ చేశాడని గతంలో వార్తలు రాగా.. ఎడిటర్ సంఘం ఆ ఆరోపణలను ఖండిస్తూ రాఘవ్‌కు అండగా నిలిచింది. కానీ తన రూం నుంచే సినిమా లీక్ అయిందని, దీని వెనుక తన నిర్లక్ష్యం కూడా ఉందని గుర్తించి అతడిపై వేటు వేసింది.
ఇదిలా ఉండగా.. తమిళనాట ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడైనా ‘జననాయగన్’కు మోక్షం లభిస్తుందేమో అని విజయ్ ఫ్యాన్స్ ఆశతో ఉన్నారు. ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ లభిస్తే మే తొలి రెండు వారాల్లో ఏదో ఒక డేట్ చూసి రిలీజ్ చేసేయడానికి నిర్మాత కూడా సిద్ధంగా ఉన్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని హెచ్.వినోద్ రూపొందించాడు. తెలుగు హిట్ ‘భగవంత్ కేసరి’కి ఈ చిత్రం రీమేక్ అన్న సంగతి తెలిసిందే.
This post was last modified on April 25, 2026 11:20 pm
గత ఎన్నికల్లో ఓడిపోయిన ఒకరిద్దరు టీడీపీ అభ్యర్థులు పట్టు బిగిస్తున్నారు. తమకు మంత్రి నారా లోకేషే ఆదర్శమని కూడా చెబుతున్నారు.…
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…