Movie News

ప్ర‌శంస‌లేనా.. ఛాన్సులూ ఇస్తారా?

80, 90 ద‌శ‌కాల్లో వైభ‌వం చూసిన క‌థానాయ‌కుల్లో రాజ‌శేఖ‌ర్ ఒక‌రు. స్వ‌త‌హాగా త‌మిళుడైన‌ప్ప‌టికీ.. తెలుగులోనే ఆయ‌న పెద్ద హీరోగాఎదిగారు. అంకుశం, మ‌గాడు, అల్ల‌రి ప్రియుడు లాంటి చిత్రాల‌తో ఒక ద‌శ‌లో టాప్-4 హీరోల‌కు గ‌ట్టి పోటీ ఇచ్చే స్థితిలో ఉన్నారు రాజ‌శేఖ‌ర్. కానీ త‌ర్వాత స‌రైన సినిమాలు చేయ‌క‌పోవ‌డం, రీమేక్‌ల ట్రెండ్ ముగిశాక కూడా వాటినే పట్టుకుని వేలాడ‌డంతో ఈ సీనియ‌ర్ హీరో ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తినేశాయి.

చాలా ఏళ్ల త‌ర్వాత గ‌రుడ‌వేగ‌తో హిట్టు కొట్టినా.. దాన్ని త‌ర్వాత నిల‌బెట్టుకోలేక‌పోయారు. దీంతో జ‌నం మ‌ళ్లీ ఆయ‌న్ని మ‌రిచిపోయారు. ఐతే చాలామంది సీనియ‌ర్ హీరోల్లాగే చివ‌రికి రాజ‌శేఖ‌ర్ క్యారెక్ట‌ర్ రోల్స్ చేయ‌డానికి రెడీ అయ్యారు. కొన్నేళ్ల ముందు ఎక్స్‌ట్రార్డిన‌రీ మ్యాన్ సినిమాలో స్పెష‌ల్ రోల్ చేయ‌గా.. ఆ మూవీ డిజాస్ట‌ర్ కావ‌డంతో ఆ పాత్ర జ‌నం దృష్టిలో ప‌డ‌లేదు. దీంతో మ‌ళ్లీ కెరీర్లో గ్యాప్ తప్ప‌లేదు.

ఈ విరామం త‌ర్వాత ఇటీవ‌ల బైక‌ర్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు రాజ‌శేఖ‌ర్. ఈ సినిమకు పాజిటివ్ టాక్, రివ్యూలు వ‌చ్చాయి. రాజ‌శేఖర్ చేసిన సునీల్ నారాయ‌ణ్ పాత్ర గురించి, అందులో ఆయ‌న పెర్ఫామెన్స్ గురించి అంద‌రూ పాజిటివ్‌గా మాట్లాడారు. స‌టిల్ పెర్ఫామెన్స్‌తో ఆ పాత్ర‌ను పండించారు రాజ‌శేఖ‌ర్. కాక‌పోతే సినిమా అనుకున్నంత‌గా ఆడ‌లేదు. వీకెండ్ వ‌ర‌కు సంద‌డి చేసి త‌ర్వాత చ‌ల్ల‌బ‌డిపోయింది. మంచి సినిమా అని పేరొచ్చిందే త‌ప్ప క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ కాలేదు బైక‌ర్. కానీ సినిమా హిట్ కాన‌పుడు ఎవ‌రెంత క‌ష్ట‌ప‌డినా పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ఉండ‌దు.

రాజ‌శేఖ‌ర్ స్పెష‌ల్ రోల్స్ చేసిన రెండు సినిమాలూ నిరాశ‌కు గురి చేసిన నేప‌థ్యంలో మున్ముందు ఆయ‌న కెరీర్ ఎలా ఉంటుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రం. సినిమా ఫ‌లితాన్ని ప‌ట్టించుకోకుండా ఆయ‌న పెర్ఫామెన్స్‌కు వ‌చ్చిన పేరును మాత్ర‌మే గుర్తించి టాలీవుడ్ ఫిలిం మేక‌ర్స్ అవ‌కాశాలిస్తారేమో చూడాలి. నిజానికి తెలుగులో క్యారెక్ట‌ర్, విల‌న్ పాత్ర‌లు చేసే న‌టుల కొర‌త ఉంది. ఆ లోటును తీర్చ‌గ‌ల వాళ్ల‌లో రాజ‌శేఖ‌ర్ ఒక‌రు. మ‌రి ఆయ‌న్ని టాలీవుడ్ ఎంత‌మేర ఉప‌యోగించుకుంటుందో చూడాలి.

This post was last modified on April 24, 2026 1:32 pm

Share

Recent Posts

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

16 minutes ago

మోహన్ బాబును మోసం చేసిన ఓదెల

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…

1 hour ago

‘హోటళ్ళు నా భార్యా బిడ్డల కోసం’

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…

2 hours ago

హిట్టు కొట్టిన పది నెలలకు దర్శనం

టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…

3 hours ago

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

5 hours ago

మతిపోగొడుతున్న వారణాసి లెక్కలు

సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…

5 hours ago