గత వారం తెలుగులో మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిలో కిరణ్ అబ్బవరం నిర్మాతగా కొత్త వాళ్లతో తీసిన ‘తిమ్మరాజు పల్లి టీవీ’ సినిమా మీద పెట్టిన బడ్జెట్ కేవలం రూ.2 కోట్లు. తిరువీర్ హీరోగా నటించిన ‘పాపం ప్రతాప్’ బడ్జెట్ కూడా రూ.4-5 కోట్ల మధ్యే అని అంచనా. కానీ వీటితో పాటుగా రిలీజైన నాగశౌర్య సినిమా ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ మీద మాత్రం నిర్మాతలు ఏకంగా రూ.30 కోట్ల దాకా ఖర్చు చేసినట్లు సమాచారం. సినిమా కొన్నేళ్ల పాటు మేకింగ్ దశలో ఉండడం.. పెద్ద కాస్టింగ్ పెట్టుకోవడం.. భారీ లొకేషన్లలో, పెద్ద స్థాయిలో సినిమా తీయడం.. ఇలా రకరకాల కారణాలతో సినిమా బడ్జెట్ బాగా పెరిగిపోయింది.
ఐతే ఖర్చు మీద పెట్టిన శ్రద్ధ కంటెంట్ మీద కూడా పెట్టి ఉంటే బాగుండేదేమో. కానీ 20 ఏళ్ల ముందు రావాల్సిన సినిమాను ఇప్పుడు తీశారన్నది సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. ప్రోమోలు చూస్తేనే ఔట్ టేడ్ ఫీల్ గుప్పుమని కొట్టింది. ఎంత తక్కువ అంచనాలతో చూసినా ఇదేం సినిమారా బాబూ.. ఈ రోజుల్లో ఇలాంటి చిత్రమేంటి అనిపించే స్థాయి కంటెంట్ ఉన్న మూవీ ఇది.
నాగశౌర్య ఓ మోస్తరుగా ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఉన్న హీరో. అలాంటి హీరో సినిమా మార్నింగ్ షోకు పట్టుమని పది మంది ప్రేక్షకులు లేక క్యాన్సిల్ అయిన షోలు ఎన్నో. చాలా షోలు తక్కువమంది ప్రేక్షకులతోనే నడిచాయి. ఆ చూసిన తక్కువమంది ఆడియన్స్ కూడా చివరి వరకు కూర్చోలేని పరిస్థితి. షోల నుంచి ఆదాయం రాకపోగా.. ఆ షోలు నడిపించినందుకు అదనంగా ఖర్చు అయ్యే పరిస్థితి.
సినిమా మీద రూ.30 కోట్లు పెట్టిన నిర్మాతలకు.. పబ్లిసిటీ, రిలీజ్ ఖర్చు, రెంట్లు అదనపు భారమే. మొత్తంగా ఈ సినిమా రిలీజ్ మొక్కుబడి వ్యవహారంలా తయారైంది. నాగశౌర్యకు సినిమా ఫలితం ముందే అర్థం అయిపోయిందేమో.. నామామత్రంగా ఒకట్రెండు ఈవెంట్లలో పాల్గొన్నాడు. ఇంటర్వ్యూలు ఇవ్వడం, ప్రెస్ మీట్లలో పాల్గొనడం, సోషల్ మీడియాలో సినిమాను ప్రమోట్ చేయడం లాంటివేమీ చేయలేదు.
ఈ సినిమా మీద పెట్టిన రూ.30 కోట్ల ప్లస్ ఖర్చు నుంచి థియేటర్ల ద్వారా అయితే ఒక్క రూపాయి కూడా వెనక్కి వచ్చే అవకాశం లేదు. జీ స్టూడియోస్ వాళ్లకు ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ సినిమా విపరీతంగా నచ్చేసి డిజిటల్, శాటిలైట్ హక్కులు తీసుకోవడమే కాక, తామే డిస్ట్రిబ్యూట్ చేస్తామని ముందుకు వచ్చినట్లు ప్రి రిలీజ్ ఈవెంట్లో ప్రకటించాడు.
కానీ సినిమా చూసిన వాళ్లకు మాత్రం ఈ మాటలు నమ్మశక్యంగా అనిపించడం లేదు. నిజంగా ఈ డీల్స్ జరిగాయా.. లేక ప్రమోషన్ కోసం అలా చెప్పారా అనే సందేహాలు కలుగుతున్నాయి. నిజంగా జీ వాళ్లు ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ తీసుకుని ఉంటే.. నిర్మాతకు ఆ రకంగా అయినా కొంత నష్టం రికవర్ అయిందని సంతోషించాల్సిందే.
This post was last modified on April 22, 2026 9:32 am
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…
నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…
గతంలో అంటే.. 2012 నాటి పరిస్థితులను గమనిస్తే.. జగన్‌కు పెద్ద మైనస్ అనే చెప్పాలి. అప్పట్లో ఆయనపై అక్రమాస్తుల కేసులు…
గత ఎన్నికల్లో ఓడిపోయిన ఒకరిద్దరు టీడీపీ అభ్యర్థులు పట్టు బిగిస్తున్నారు. తమకు మంత్రి నారా లోకేషే ఆదర్శమని కూడా చెబుతున్నారు.…
రాజకీయాల్లో కీలక స్థానాల్లో ఉండే వారి నుంచి వచ్చే మాటల వెనుక ఊహకు అందని లెక్కలు.. సమీకరణాలు ఉంటాయి. అందునా..…