Movie News

టీవీ సౌండ్ హఠాత్తుగా ఆగిపోయిందే

మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత కిరణ్ అబ్బవరం తనవరకు ఎంత చేయాలో పబ్లిసిటీ పరంగా బెస్ట్ ఇచ్చాడు. రిలీజైన తొలి రెండు రోజులు టీమ్ హడావిడి చాలానే జరిగింది. థియేటర్లకు వెళ్లి జనాల రియాక్షన్లు షూట్ చేసుకొచ్చారు. వింటేజ్ మూవీ ఇచ్చామని, ముప్పై ఏళ్ళు వెనక్కు తీసుకెళ్లే గొప్ప సినిమా తీశామని పదే పదే చెప్పుకున్నారు.

ఇదంతా సండే వరకు జరిగిన స్టోరీ. సోమవారం నుంచి తిమ్మరాజుపల్లి టీవీ బాగా డౌన్ అయిపోయింది. కొన్ని చోట్ల షోలు అసలు పడ్డాయో లేదోనని ట్రేడ్ లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మొన్నదాకా తిరిగిన యూనిట్ ఇప్పుడు కనిపించడం లేదు. కిరణ్ సైతం సోషల్ మీడియాలో సౌండ్ చెయ్యట్లేదు. ఏప్రిల్ 18 తర్వాత ట్వీట్లు లేవు. వాస్తవాన్ని గుర్తించారు కాబోలు మౌనం పాటిస్తున్నారు. చిన్న సినిమా పెద్ద మేజిక్ అనే క్యాప్షన్ వాస్తవానికి దూరంగా వెళ్ళిపోయింది.

నిజానికి తిమ్మరాజుపల్లి టీవీ చెప్పుకోదగ్గ సినిమానే కానీ ఆడియన్స్ కి థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే స్థాయిలో దర్శకుడు మునిరాజ్ ఈ కంటెంట్ ఇవ్వలేకపోయారు. దీంతో అన్ని వర్గాలను మెప్పించలేకపోయింది. టెక్నికల్ గా బడ్జెట్ పరిమితులను తట్టుకుని ఈ క్వాలిటీ ఇవ్వడం మంచిదే కానీ రెండు గంటల పాటు ఎంగేజ్ చేసే స్థాయిలో కథా కథనాలు ఉంటేనే ఈ రోజుల్లో ప్రేక్షకులు టికెట్లు కొంటున్నారు. ఈ క్యాలికులేషన్ తిమ్మరాజుపల్లి టీవీకి మిస్సయ్యింది.

నిర్మాతగా కిరణ్ అబ్బవరం పాస్ మార్కులు అయితే తెచ్చుకున్నాడు కానీ నెక్స్ట్ తీయబోయే సినిమాల విషయంలో మాత్రం ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి. ఓ యాభై మంది కొత్త టాలెంట్ పరిచయం చేయడం మంచిదే కానీ ఆడియన్స్ కోణంలో చూసుకుంటే వాళ్ళకది అనవసరం. టికెట్ డబ్బులకు న్యాయం జరిగిందా లేదానేది మాత్రమే వాళ్ళు చూస్తారు. అందుకే బలగం, లిటిల్ హార్ట్స్ లాంటివి సక్సెస్ అయ్యాయి. ఇదింకా నయం కానీ పాపం ప్రతాప్ నిజంగానే పాపం అనిపించుకుంది.

This post was last modified on April 21, 2026 12:06 pm

Share

Recent Posts

సిరిసిల్ల కాదు.. ఉరిసిల్ల‌.. రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి

టార్గెట్ కేటీఆర్.. ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న…

36 minutes ago

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

3 hours ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

4 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

5 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

6 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

7 hours ago