Movie News

శృతి హాసన్ మిస్ చేసిన జూలియట్

ఇప్పుడున్న పరిస్థితుల్లో పెర్ఫార్మన్స్ డిమాండ్ చేసే పాత్రలు హీరోయిన్లకు దక్కడం చాలా అరుదైపోయింది. రష్మిక మందన్నకు గర్ల్ ఫ్రెండ్ దొరికినట్టు అందరికీ అలాంటి ఛాన్సులు రావడం లేదు. శ్రీలీలనే తీసుకుంటే అందంతో పాటు టాలెంట్ ఉన్నప్పటికీ దాన్ని వాడుకునే దిశగా దర్శకులు పాత్రలు ఆఫర్ చేయడం కష్టమైపోయింది. ఎంతసేపూ హీరో వెంట పడి డాన్సులు, డ్యూయెట్లు ఇదే తరహా అయిపోయింది. ఇప్పుడీ టాపిక్ కు కారణం అడివి శేష్ కొత్త రిలీజ్ డెకాయిట్.

కమర్షియల్ గా సినిమా ఫలితం ఏంటని తెలియడానికి ఇంకొంచెం టైం పడుతుంది కానీ ప్రేక్షకుల్లో డిస్కషన్ కు దారి తీసిన వాటిలో మృణాల్ ఠాకూర్ పాత్ర ప్రస్తావన ఎక్కువగా ఉంది. స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో అడివి శేష్ ఉన్న దాదాపు ప్రతి ఫ్రేమ్ లో తనను చూడొచ్చు. ఉన్నత కులానికి చెందిన అమ్మాయి సరస్వతిగా నటించిన మృణాల్ ని అడివి శేష్ సినిమాలో జూలియట్ అని సంబోధిస్తూ ఉంటాడు. టైటిల్ కు ముందే వీళ్ళ లవ్ స్టోరీ ఉంటుంది.

ఇంతగా ప్రస్తావించడానికి కారణం లేకపోలేదు. నటన పరంగా మృణాల్ కు ఇందులో చాలా స్కోప్ దక్కింది. బాధ, దుఃఖం, పోరాటం, కష్టాలు, ప్రేమ, ఎమోషన్ ఇలా అన్ని రకాలుగా డిజైన్ చేసిన క్యారెక్టర్ లో ఆమె సులువుగా ఒదిగిపోయింది. సీతారామం కంటే బెస్టని చెప్పలేం కానీ ఇటీవలి కాలంలో ఇంత ప్రాధాన్యం ఉన్న కథానాయిక పాత్ర ఎవరూ పోషించలేదన్నది వాస్తవం. హాస్పిటల్ సీన్స్, క్లైమాక్స్ తదితర ఎపిసోడ్లలో మృణాల్ బాగా హైలైట్ అయ్యింది.

అయితే ఇదే పాత్ర ముందు శృతి హాసన్ కు ఆఫర్ చేసిన సంగతి తెలిసిందే. కొంత భాగం షూటింగ్ అయ్యాక ఆవిడ తప్పుకుంది. ఒకవేళ మృణాల్ స్థానంలో శృతి హాసన్ చేసి ఉంటే ఇంకొంచెం వెయిట్ పెరిగేదేమో. అడివి శేష్, శృతి హాసన్ జంట కూడా బాగానే ఉండేది. డెకాయిట్ కనక సూపర్ హిట్ అయితే ఇది మిస్ చేసుకున్నందుకు శృతి ఫీలింగ్ ఎలా ఉంటుందో ఫ్యూచర్ లో చూడొచ్చు.

This post was last modified on April 11, 2026 12:43 am

Share

Recent Posts

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

1 hour ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

4 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

4 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

4 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

6 hours ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

6 hours ago