Movie News

రాకా… ఈ కథ ఇప్పటిది కాదు

రాకా.. ఈ రోజు సోషల్ మీడియాను ఊపేస్తున్న పేరు. ఎక్స్‌ సహా అన్ని సామాజిక మాధ్యమాల్లోనూ ఈ పేరు టాప్‌లో ట్రెండ్ అవుతోంది. అది అట్లీ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా టైటిల్. ఏకంగా రూ.800 కోట్ల బడ్జెట్లో సన్‌పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ మూవీలో బన్నీ భిన్న అవతారాల్లో కనిపించనున్నాడని.. అందులో ఒక క్యారెక్టర్ స్టన్నింగ్‌గా ఉండబోతోందని ముందు నుంచి వార్తలు వస్తున్నాయి. ఆ పాత్ర ప్రి లుక్‌నే ఈ రోజు లాంచ్ చేశారు.

‘ఐ’ సినిమాలో విక్రమ్ ఒక పాటలో కనిపించే అవతారాన్ని గుర్తు చేసేలా ఉంది ‘రాకా’ లుక్. ‘ఐ’ సినిమా తీసింది అట్లీ గురువైన లెజెండరీ డైరెక్టర్ శంకర్. తన గురువు సినిమాలో లుక్ నుంచి అట్లీ స్ఫూర్తి పొందాడా.. లేక అట్లీ ఐడియాతోనే అప్పట్లో విక్రమ్‌ను శంకర్ అలా చూపించాడా అన్నది తెలియదు కానీ.. ‘రాకా’ ప్రి లుక్ చూసిన వాళ్లకు మాత్రం ‘ఐ’ సినిమా గుర్తుకొస్తున్న మాట వాస్తవం.

కాగా ‘రాకా’ తన డ్రీమ్ ప్రాజెక్టు అని.. దర్శకుడు కావడానికి ముందే ఈ సినిమా ఐడియా వచ్చిందని అట్లీ వెల్లడించడం విశేషం. ‘రాకా’ టైటిల్ లుక్‌ను అనౌన్స్ చేస్తూ అతను సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్టు పెట్టాడు. ఇది కేవలం సినిమా కాదని.. తనలో ఒక భాగమని.. చాలా ఏళ్ల నుంచి ఈ కథను మోస్తున్నానని అట్లీ వెల్లడించాడు.

18 ఏళ్లుగా ఈ ఐడియా ఫేడ్ అవ్వకుండా తనతోనే కొనసాగుతోందని చెప్పాడు అట్లీ. ఈ ఐడియా తనను పరీక్షించిందని.. తనను తీర్చిదిద్దిందని.. తన జీవితంలో ఏం జరిగినా సరే తనతో పాటే ఉందని అట్లీ వ్యాఖ్యానించాడు. నిజాయితీగా చెబుతున్నా, ఇది కేవలం ఆరంభం మాత్రమే అంటూ సినిమా మీద అంచనాలను పెంచే ప్రయత్నం చేశాడు అట్లీ. 

ఈ హిట్ దర్శకుడి వయసు ఇంకా 39 ఏళ్లే. అంటే అట్లీ చెబుతున్న ప్రకారం 21 ఏళ్ల వయసులోనే అతడికి ‘రాకా’ ఐడియా వచ్చిందన్నమాట. 26 ఏళ్ల వయసులో ‘రాజా రాణి’ అనే బ్లాక్ బస్టర్ మూవీతో దర్శకుడిగా మారిన అట్లీ.. తర్వాత వరుసగా తెరి, మెర్శల్, బిగిల్, జవాన్ లాంటి బ్లాక్ బస్టర్లు తీశాడు.

‘రాకా’ అతడి ఆరో సినిమా. 18 ఏళ్లుగా మోస్తున్న ఐడియా అంటే దీన్ని అతడి డ్రీమ్ ప్రాజెక్టుగా భావించవచ్చు. మరి అట్లీ అంచనాలను అందుకుంటూ, బ్లాక్ బస్టర్ స్ట్రీక్‌ను కొనసాగిస్తూ.. ‘రాకా’ను కూడా పెద్ద సక్సెస్ చేస్తాడేమో చూడాలి. ఈ చిత్రం వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో విడుదలవుతుందని అంచనా.

This post was last modified on April 8, 2026 11:29 pm

Share

Recent Posts

దర్శకుడిని దాచి పెడుతున్న దేవరాయ

ఒకపక్క టాక్సిక్ పుణ్యమాని తెలుగు, కన్నడ మూవీ లవర్స్ సోషల్ మీడియా వేదికగా ఒకరిమీద మరొకరు కామెంట్లు, ట్రోల్స్ చేసుకోవడం…

20 minutes ago

అర్జున్ రెడ్డిపై వంగది ఏ రేంజ్ కాన్ఫిడెన్స్ అంటే…?

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని, రెండు మూడు చిన్న సినిమాల అనుభవం ఉన్న హీరోను పెట్టి.. ఒక డెబ్యూ డైరెక్టర్ రూ.3-4…

49 minutes ago

జైలర్ వస్తున్నాడు… మరి ఆదర్శం మాటేమిటి

అక్టోబర్ 2 నుంచి ఆదర్శ కుటుంబం ఏకె ఫార్టీ సెవెన్ తప్పుకున్నాక మళ్ళీ కొత్త డేట్ ప్రకటించలేదు. ఒకవేళ జైలర్…

52 minutes ago

పంజా మీద ఇంత ప్రేమ దాచుకున్నారా

ఏంటో జెన్ జీ ఆడియన్స్ మహా విచిత్రంగా ఉన్నారు. కొన్ని కొత్త సినిమాలను అస్సలు పట్టించుకోరు. కొన్ని రీ రిలీజులకేమో…

3 hours ago

పవన్ కళ్యాణ్ – ఒక జన సేవకుడి ప్రస్థానం

సినిమా నటులు ఎందరో రాజకీయ నాయకులయ్యారు. అయితే ప్రజల మనసులో బలమైన ముద్ర వేసిన వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు.…

4 hours ago

తమిళనాడులో అప్పుడే పెడాకులా…

మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సీ ఓటర్ చేసిన సర్వే తమిళనాడు టీవీకే, కాంగ్రెస్ కాపురం…

4 hours ago