Movie News

బుచ్చిబాబు వేట ఇంకా పూర్తవ్వలేదా

ఏప్రిల్ 30 నుంచి తప్పుకున్నాక పెద్ది కొంచెం రిలాక్స్ మోడ్ లోకి వచ్చేసింది కానీ దర్శకుడు బుచ్చిబాబుకి మాత్రం ఇటెమ్ సాంగ్ టెన్షన్ పూర్తిగా పోలేదు. ముందు మృణాల్ ఠాకూర్ పేరు వినిపించింది. ఇప్పుడేమో కపుల్ ఫ్రెండ్లీ ఫేమ్ మానస వారణాసి అంటున్నారు. నిజంగా ఎవరు చేస్తారనేది సస్పెన్స్ గానే ఉంది. ఇంకోవైపు జానీ మాస్టర్ నేతృత్వంలో దీన్ని షూట్ చేయడానికి సెట్ వేసి సిద్ధంగా ఉంచారట. హీరోయిన్ ఫైనల్ అయితే ఈ వారంలోనే షూటని ఫిక్స్ చేసుకున్నారట.

మరి బుచ్చిబాబు వేట పూర్తయ్యిందో లేదో బయటికైతే చెప్పుకోవడం లేదు. దర్శకుడి పరిస్థితి ఇలా ఉంటే నిర్మాతలు కొత్త రిలీజ్ డేట్ కోసం తల పట్టుకోవడం ఒకటే తక్కువనే రేంజ్ లో చర్చలు చేస్తున్నారు. ఇంత విపరీతమైన బజ్ ఉండి, ప్యాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ వచ్చాక కూడా ఇలా రెండు వాయిదాలు వేయాల్సి రావడం మార్కెట్ పరంగా చాలా ఇబ్బందయ్యింది. ఇప్పుడు ఓటిటి సంస్థ చెప్పే స్లాట్ ని బట్టే విడుదల తేదీ డిసైడ్ చేయాల్సి వచ్చినా ఆశ్చర్యం లేదు.

ఒకటి రెండు రోజుల్లో దీనికి సంబంధించి క్లియర్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశాలున్నాయి. ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలా లేక పోస్టర్ రూపంలో అనౌన్స్ మెంట్ ఇవ్వాలా అనేది ఫిక్స్ చేసుకుని ఆ తర్వాత దానికి పూనుకుంటారు. ఇక ఐటెం సాంగ్ విషయానికి వస్తే ప్రేమికురాలి పాత్రలో ప్రేక్షకులకు పరిచయమైన మానస వారణాసి ఇలాంటి సాంగ్స్ కి సూటవుతుందా అనే అనుమానాలు రాక మానవు.

వీటికి వీలైనంత త్వరగా చెక్ పెట్టాలి. ఈ ప్రచారంలో నిధి అగర్వాల్ పేరు కూడా చక్కర్లు కొడుతోంది. ఎందుకనో ఫ్యాన్స్ మాత్రం ఆ పేరు పట్ల సానుకూలంగా లేరు. బహుశా వీరమల్లు, రాజా సాబ్ ప్రభావమేమో. చాలా కీలకమైన సందర్భంలో వచ్చే సాంగ్ కావడంతో బుచ్చిబాబు దీన్ని చాలా స్పెషల్ గా ట్రీట్ చేస్తున్నాడు. గురువు సుకుమార్ రంగస్థలంలో ఇచ్చిన జిగేలు రాణిని మించిన అవుట్ ఫుట్ ఇవ్వాలనేది తన టార్గెటట. మరి  దీన్ని తీర్చే కాంబినేషన్ ఎవరు సెట్ అవుతారో లెట్ సీ.

This post was last modified on April 8, 2026 7:06 pm

Share

Recent Posts

మనసు మార్చుకున్న ఆదర్శం… మంచిదే కానీ

గత కొన్ని రోజులుగా బయట ప్రచారం జరుగుతున్నట్టు ఆదర్శ కుటుంబం ఏకె 47 ఒక వారం వాయిదా పడింది. ముందు…

8 minutes ago

పుష్ప విలన్ ‘ట్రబుల్’ కొత్తగా ఉందే

ఒక మీడియం బడ్జెట్ సినిమాకు రాజమౌళి ప్రెజెంట్స్ అని పడిందంటే అందులో విషయం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎందుకంటే…

2 hours ago

జపాన్ ఓడినా టీమిండియా గెలవలేదు…

జపాన్‌పై రెండు పరుగుల తేడాతో గెలిచారు. కానీ ఈ మ్యాచ్ తర్వాత టీమిండియా బ్యాటింగ్‌పై మళ్ళీ సందేహాలు మొదలయ్యాయి. భారత…

2 hours ago

గిన్నిస్ బుక్కంటే క్రేజ్ తగ్గిందనుకోవాలా

ఒకప్పుడు గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డులో పేరు సంపాదించుకోవడమంటే అదో పెద్ద ఘనతగా భావించే వాళ్ళు. పెద్ద పెద్ద…

2 hours ago

నంది అవార్డులు వచ్చేస్తున్నాయహో…

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వం ప్రకటించే నంది అవార్డుల‌కు ఎంత విలువ ఉండేదో తెలిసిందే. వాటిని జాతీయ అవార్డుల‌తో స‌మానంగా చూసేవారు.…

4 hours ago

ఆలస్యం జరిగింది ఇక ఆగడం ఉండదు

టాలీవుడ్ సినిమాలకు అదేం శాపమో అర్థం కాదు కానీ కొన్నింటికి ప్రభుత్వాల నుంచి జిఓలు సకాలంలో రావు, చివరి నిమిషం…

5 hours ago