Movie News

పో* వెబ్ సైట్లో ఫొటో… జాన్వి షాక్

ఏఐని వాడుకుని ఇప్పుడు హీరోయిన్ల మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలతో సోషల్ మీడియా జనాలు ఎలా రెచ్చిపోతున్నారో.. ఇంటర్నెట్ ఎంత విశృంఖలంగా తయారైందో చూస్తూనే ఉన్నాం. డీప్ ఫేక్ ఫొటోలు, వీడియోల విషయంలో హీరోయిన్లు ఎంత మొత్తుకుంటున్నా ఫలితం ఉండట్లేదు. ఈ ఇంటర్నెట్ మహా సముద్రంలో ఎవరు ఎవరినీ నియంత్రించలేని పరిస్థితి. కాబట్టి అమ్మాయిలు కూడా ఇలాంటి వాటిని మరీ సీరియస్‌గా తీసుకోకుండా ముందుకు వెళ్లిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది.

ఐతే ఇంటర్నెట్ ఇంత విస్తృతంగా లేనపుడు మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు అంటే అమ్మాయిలు బెంబేలెత్తిపోయేవారు. హీరోయిన్లు సైతం అందుకు మినహాయింపు కాదు. తనకు కూడా అలాంటి అనుభవం ఉన్నట్లుగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వి కపూర్ వెల్లడించింది. తనకు 15 ఏళ్ల వయసున్నపుడు పో* వెబ్ సైట్లో తన మార్ఫింగ్ ఫొటో పెట్టేశారని.. అప్పుడు తాను చాలా కంగారు పడ్డానని ఆమె గుర్తు చేసుకుంది.

ఒక పాడ్ కాస్ట్‌లో జాన్వి మాట్లాడుతూ.. ‘‘దీన్ని డీప్ ఫేక్ అని అంటారో లేదో కూడా నాకు తెలియదు. నాకు 15 ఏళ్ల వయసుండగా ఒక ఘటన జరిగింది. ఒక పో* వెబ్ సైట్లో నా ఫొటోలు మార్ఫింగ్ చేసి అప్‌లోడ్ చేశారు. నా క్లాస్ మేట్స్ వాటిని చూశామని చెప్పడంతో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. చాలా టెన్షన్ పడ్డాను. దాని వల్ల ఎంతో డిస్టర్బ్ అయ్యాను.

సోషల్ మీడియాలో కనీసం నైతికత ఉండదని అప్పుడే అర్థమైంది. ఎవరో చేసిన ఇలాంటి పనుల వల్ల మనం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందే అని బాధ పడ్డాను. డీప్ ఫేక్ కారణంగా ఇప్పటికీ సమస్యలు ఎదుర్కొంటున్నా. దీని వల్ల నాకు ప్రశాంతత లేకండా పోయింది. కొన్ని ముఖ్యమైన న్యూస్ ఏజెన్సీలు కూడా నా ఏఐ ఫొటోలను ఒరిజినల్ అనుకుని వాడేస్తుంటాయి. ఇవి నా వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌ను దెబ్బ తీస్తాయి. దీని మీద గొంతు విప్పి బలంగా మాట్లాడాలని కొన్నిసార్లు అనిపిస్తుంది. కానీ నాకు అంత వాయిస్ లేదు అనిపించి ఆగిపోతుంటా’’ అంటూ జాన్వి ఆవేదన వ్యక్తం చేసింది. తెలుగులో ‘దేవర’ జాన్వి నటించిన ‘పెద్ది’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

This post was last modified on April 6, 2026 1:04 pm

Share

Recent Posts

వెంకీ త్రివిక్రమ్ సినిమా స్థాయి బజ్ ఉందా?

సరిగ్గా ఇంకో పదకొండు రోజుల్లో ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల కానుంది. సంక్రాంతికి వస్తున్నాం లాంటి మూడు వందల…

11 minutes ago

పబ్లిక్ టాయిలెట్‌లో ఇద్దరు యువకులు మృతి… ఏం జరిగింది?

ముంబైలోని గోరేగావ్‌లో పబ్లిక్ టాయిలెట్‌కు వెళ్లిన ఇద్దరు యువకులు అక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒకేసారి ఇద్దరు చనిపోవడంతో అసలు లోపల…

23 minutes ago

అనుమానం రాకుండా అంతర్ధానం అవుతోంది

చిన్న సినిమాల్లో విషయం ఉంటే ఆదరణ దక్కి తీరుతుంది. ఈ విషయంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. సీతాకోకచిలుక నుంచి…

1 hour ago

జడలు విదిలించిన వసూళ్లు… ఇకపై అసలు సవాళ్లు

బుధవారం ప్రీమియర్లతో గురువారం విడుదల ఎంచుకున్న ది ప్యారడైజ్ ఎట్టకేలకు మొదటి వీకెండ్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రాధమిక సమాచారం…

3 hours ago

అమ్మ చేతులు అడుక్కోకూడదు

తెలుగులో లెజెండరీ స్టేటస్ ఉన్న దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకడు. బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న…

3 hours ago

యువకుడి చెంప ఛెళ్లుమనిపించిన మంత్రి

ఈ మధ్యకాలంలో కొందరు రాజకీయ నేతలు తమను తాము వేరే లెవల్లో ఊహించుకుంటున్నారు. ప్రజలు ఎన్నుకుంటేనే తాము ప్రజాప్రతినిధులుగా చలామణీ…

3 hours ago