Movie News

ఏడు ఫ్లాపుల తర్వాతైనా హిట్టు వరించేనా

ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది. కెరీర్ ప్రారంభంలో శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు లాంటి రెండు హిట్లు పడ్డప్పటికీ ఆ తర్వాత నుంచి సీన్ అమాంతం మారిపోయింది. చెప్పుకోదగ్గ కాంబోలు, ఇమేజ్ ఉన్న హీరోలు, భారీగా ఖర్చు పెట్టిన నిర్మాణ సంస్థలు ఇలా ఎన్ని సానుకూలతలు ఉన్నా ఫలితం మాత్రం ఒకదాన్ని మించిన మరొకటి డిజాస్టర్ అనే రేంజ్ లో భయపెట్టాయి.

నాలుగు సంవత్సరాల కాలంలో కృతి శెట్టి మొత్తం ఏడు ఫ్లాపులు చూసింది. నితిన్ మాచర్ల నియోజకవర్గం, సుధీర్ బాబు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, రామ్ ది వారియర్, నాగచైతన్య కస్టడీ, శర్వానంద్ మనమే, టోవినో థామస్ ఏఆర్ఎం, కార్తీ అన్నగారు వస్తారు అన్నీ బాక్సాఫీస్ వద్ద చేతులు ఎత్తేసినవే. ఒక్క ఏఆర్ఎం మాత్రమే మలయాళంలో గట్టెక్కగా మిగిలిన భాషల్లో ప్రేక్షకులు పట్టించుకోలేదు. అందుకే ఏప్రిల్ 10 విడుదల కానున్న లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మీద బోలెడు ఆశలు పెట్టుకుంది.

ఇది హిట్ కావడం తనకు చాలా అవసరం. ఎందుకంటే ఈ సినిమా తర్వాత ఆనంద్ రవితో జీనీ రిలీజ్ కు రెడీ అవుతుంది. దాని మీద కోలీవుడ్ లో నెగటివ్ వైబ్స్ ఉన్నాయి. అందుకు తగ్గట్టే విపరీతమైన పోస్ట్ పోన్లతో విడుదల లేట్ అవుతూనే ఉంది. సో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీతో హిట్ అందుకుంటే మళ్ళీ ట్రాక్ లో పడే అవకాశం ఉంది. ఆల్రెడీ వెంకటేష్ – అనిల్ రావిపూడి కాంబోలో కళ్యాణ్ రామ్ సరసన ఛాన్స్ కొట్టేసిన కృతి శెట్టికి అది బంపర్ లాటరీ అని చెప్పొచ్చు.

ఇక లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ విషయానికి వస్తే ట్రైలర్ వచ్చేసింది, హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. ట్రైలర్ చూస్తే ఏదో డిఫరెంట్ కాన్సెప్ట్ తో, 2040 లవ్ స్టోరీ చెప్పే ప్రయత్నం చేసినట్టు కనిపించింది కానీ అన్ని వర్గాలకు ఇది ఎంత మేర కనెక్ట్ అవుతుందనేది వేచి చూడాలి. డ్రాగన్, డ్యూడ్ వరస సక్సెస్ లతో దూసుకుపోతున్న హీరో ప్రదీప్ రంగనాథన్ కు ఇది హ్యాట్రిక్ ఇస్తుందో లేదోననే టెన్షన్ అభిమానుల్లో బలంగా ఉండాలి. డెకాయిట్ రూపంలో గట్టి పోటీనే ఉంది.

This post was last modified on April 5, 2026 9:09 pm

Share

Recent Posts

రాజమౌళి టచ్ చేసిన స్క్రిప్ట్… హిట్ కొడతారా?

గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…

8 minutes ago

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

26 minutes ago

టీ 20 చూస్తూ పారిశ్రామికవేత్తలతో చర్చించా

నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…

31 minutes ago

సుడిగుండంలో చిక్కుకున్న జ‌గ‌న్ .. !

గ‌తంలో అంటే.. 2012 నాటి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్‌కు పెద్ద మైన‌స్ అనే చెప్పాలి. అప్ప‌ట్లో ఆయ‌న‌పై అక్ర‌మాస్తుల కేసులు…

1 hour ago

ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు.…

4 hours ago

నార్త్ రాముడు.. సౌత్ శివుడు… రేవంత్ కరెక్టేనా?

రాజకీయాల్లో కీలక స్థానాల్లో ఉండే వారి నుంచి వచ్చే మాటల వెనుక ఊహకు అందని లెక్కలు.. సమీకరణాలు ఉంటాయి. అందునా..…

4 hours ago