Movie News

ప్యారడైజ్ పరుగులు పెట్టాల్సిందే

పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని పరిస్థితి చూసి అభిమానులు కలవరపడుతున్నారు. ఇప్పటికీ ఏప్రిల్ 30 డేటే ప్రచారంలో ఉంది కానీ ఫ్యాన్స్, బయ్యర్ వర్గాలు అంత నమ్మకంగా లేవు. కారణం ఐటెం సాంగ్ తో పాటు రెహమాన్ రీ రికార్డింగ్ బ్యాలన్స్ ఉండటమే. ఈ ఉదంతం రాబోయే ప్యాన్ ఇండియా మూవీస్ కి ఒక పాఠంలా నిలుస్తోంది. ముఖ్యంగా నాని ది ప్యారడైజ్ కి.

ఆగస్ట్ 21 చూసేందుకు దూరంగా ఉన్నట్టు అనిపిస్తున్నా ప్రాక్టికల్ కోణంలో చూసుకుంటే చేతిలో ఉన్నది నాలుగున్నర నెలలే. నాని దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రమోషన్లకు కనీసం పాతిక రోజులు కేటాయించాల్సిందేనని ఫిక్స్ అయ్యాడు. హాయ్ నాన్న, దసరా, హిట్ 3 కోసం ముంబై నుంచి చెన్నై దాకా నాని చేసిన టూర్లు అన్ని ఇన్ని కావు. ఇతర భాషల్లో వర్కౌట్ అవుతుందో లేదో గ్యారెంటీ లేకపోయినా తన వంతు కృషితో పబ్లిసిటీ చేసుకుంటూ వచ్చాడు.

సో ఆగస్ట్ మినయించుకుంటే జూలై చివరికంతా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఫస్ట్ కాపీ సిద్ధం చేయాలి. ఇందులోనే బ్యాలన్స్ షూటింగ్, రీ రికార్డింగ్, సెన్సార్ అన్నీ ఉంటాయి. అనిరుద్ రవిచందర్ ఎంత టైం ఇస్తాడో తెలియదు. చేతి నిండా ప్రాజెక్టులతో చాలా బిజీగా ఉన్నాడు. శ్రీకాంత్ ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా జైలర్ 2 వర్క్ తో కనక అనిరుద్ స్ట్రక్ అయితే ప్యారడైజ్ కు కోరుకున్న టైం ఇవ్వలేడు. ఈ రెండే కాదు తన చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి.

కాబట్టి డెడ్ లైన్ చేరుకోవాలంటే ప్యారడైజ్ పరుగులు పెట్టాల్సిందే. నాని మళ్ళీ డేట్ మారకుండా గట్టి కంకణం కట్టుకున్నాడని ఇన్ సైడ్ టాక్. కయదు లోహర్ హీరోయిన్ గా నటించిన ఈ ఇంటెన్స్ డ్రామాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మెయిన్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనకు నానికి మధ్య వచ్చే సన్నివేశాలు నెవర్ బిఫోర్ అన్న రేంజ్ లో ఉంటాయట. ముఖ్యంగా ఇంటర్వెల్ ఎపిసోడ్ శ్రీకాంత్ డిజైన్ చేసి తీరు విన్నవాళ్ళు వామ్మో ఇదేం మెంటల్ మాస్ అంటున్నారు.

This post was last modified on April 5, 2026 8:06 pm

Share

Recent Posts

భీమవరం బ్యాగ్రౌండ్ ఉన్నా వాడుకోలేదా రవితేజ…

ఏ బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి చాలా కష్టపడి పెద్ద స్టార్లలో ఒకడిగా ఎదిగాడు మాస్…

4 hours ago

అనుపమకు నరకం చూపించిన అపరిచితుడు

తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న మ‌ల‌యాళ భామ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప‌దేళ్ల కెరీర్లో పెద్ద‌గా ఎఫైర్ వార్త‌లేమీ వ‌చ్చింది లేదు.…

4 hours ago

షూట్ లేకున్నా ప్రభాస్ ఫౌజి సెట్లోనే

ప్ర‌భాస్ సినిమా అంటే చాలు.. హైప్‌కు ఏమీ లోటు ఉండ‌దు. రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డేకొద్దీ అభిమానుల‌తో పాటు సామాన్య ప్రేక్ష‌కుల్లోనూ…

4 hours ago

జెన్ జీ ఎఫెక్ట్… కేటీఆర్ ను సీఎం చెయ్యాలంటున్న కేసీఆర్?

ఇదేమీ ఊహాజ‌నిత వార్త‌కాదు. కొంద‌రు పుట్టించిన గ్యాసిప్ కూడా కాదు!. అక్షరాలా.. తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ పార్టీలో గ‌త…

5 hours ago

అయ్య‌న్న‌ అలా.. జ‌గ‌న్ ఇలా… ఇద్ద‌రి ఆశ‌లూ తీరేనా?

ఏపీ స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు.. ఎప్ప‌టి నుంచో ఒక మాట చెబుతున్నారు. చెప్ప‌డ‌మే కాదు.. అంత‌ర్జాతీయ వేదికల‌పైనా ఆయ‌న త‌న వాణిని…

7 hours ago

‘ఇరుముడి’ సరుకులు… అన్నీ సరిపోయాయి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి ఆగస్ట్ 21 విడుదల కానుంది. వరస ఫ్లాపుల నుంచి బయటపడేసే సినిమాగా అభిమానులు దీని…

8 hours ago