Movie News

ఓపెనింగ్ టాక్…. డామినేషన్ ఎవరిది?

నిన్న విడుదలైన రాకాస, బైకర్ రెండు సినిమాలకు నెగటివ్ రెస్పాన్స్ రాలేదు. అత్యద్భుతంగా ఉన్నాయని కాదు కానీ ఒకసారి చూడొచ్చనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో కనిపించాయి. గత కొన్ని వారాలుగా డిజాస్టర్ కంటెంట్లతో నీరసపడిన బాక్సాఫీస్ నిన్న కొంచెం కళకళలాడిన మాట వాస్తవం. ముందు రోజే ప్రీమియర్లు వేయడం ఈసారి బాగా ప్లస్ అయ్యింది. వాటి ద్వారా వచ్చిన టాక్, రివ్యూస్ ఉదయం గుడ్ ఫ్రైడే వసూళ్లు పెరగడానికి దోహదం చేశాయి.

అయితే బుకింగ్స్ విషయంలో రాకాసనే డామినేట్ చేయడం ఇక్కడ గమనించాల్సిన విషయం. గత ఇరవై నాలుగు గంటల్లో బుక్ మై షోలో రాకాస సుమారుగా 62 వేలకు పైగా టికెట్లు అమ్మితే బైకర్ 42 వేల పైచిలుకు దగ్గర ఆగిపోయింది. అంటే సంగీత్ శోభన్ మూవీ ఏకంగా యాభై శాతం మార్జిన్ తో పై చేయి సాధించడం స్పష్టంగా కనిపిస్తోంది. బడ్జెట్, క్యాస్టింగ్, ఇమేజ్ పరంగా ఎన్నోరెట్లు పై స్థాయిలో ఉన్న బైకర్ ఇంత నెమ్మదిగా రెస్పాన్స్ తెచ్చుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయం.

ఇలా ఎందుకు జరిగిందనే దానికి కారణాలు లేకపోలేదు. బైకర్ మనకు అంతగా పరిచయం లేని బైక్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా. తండ్రి కొడుకు ఎమోషన్ మీద ఎక్కువ దృష్టి పెట్టిన దర్శకుడు అభిలాష్ రెడ్డి రెగ్యులర్ ఆడియన్స్ కి అవసమైన బేసిక్ ఎంటర్ టైన్మెంట్, కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్సయ్యారు. హై మూమెంట్స్ తక్కువగా ఉన్నాయి. అయినా సరే టీమ్ పడిన కష్టం ఆడియన్స్ కి అర్థం కావడం వల్ల బాగానే ఉందనే మాట బయటికి వస్తోంది.

ఇప్పుడు మొదటి వీకెండ్ చాలా కీలకం కానుంది. శని ఆదివారాలు ఎవరు ఆధిపత్యం చెలాయిస్తారనే దాని మీద ట్రేడ్ వర్గాలు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాయి. బిజినెస్ కోణంలో చూస్తే రాకాస త్వరగా గెటాన్ అయ్యేలా ఉంది. పోటీలో వచ్చిన డబ్బింగ్ సినిమాలు లీడర్, కార్మేని సెల్వం ఎవరూ పట్టించుకోలేక మార్నింగ్ షోకే జనం లేని హాళ్లతో బోసిపోయాయి. రాకాసలో హారర్, కామెడీ ఎంతో కొంత కాలక్షేపం చేయించడం జనాన్ని థియేటర్లకు వచ్చేలా చేస్తోంది.

This post was last modified on April 4, 2026 12:46 pm

Share

Recent Posts

మనసు మార్చుకున్న ఆదర్శం… మంచిదే కానీ

గత కొన్ని రోజులుగా బయట ప్రచారం జరుగుతున్నట్టు ఆదర్శ కుటుంబం ఏకె 47 ఒక వారం వాయిదా పడింది. ముందు…

5 hours ago

పుష్ప విలన్ ‘ట్రబుల్’ కొత్తగా ఉందే

ఒక మీడియం బడ్జెట్ సినిమాకు రాజమౌళి ప్రెజెంట్స్ అని పడిందంటే అందులో విషయం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎందుకంటే…

7 hours ago

జపాన్ ఓడినా టీమిండియా గెలవలేదు…

జపాన్‌పై రెండు పరుగుల తేడాతో గెలిచారు. కానీ ఈ మ్యాచ్ తర్వాత టీమిండియా బ్యాటింగ్‌పై మళ్ళీ సందేహాలు మొదలయ్యాయి. భారత…

7 hours ago

గిన్నిస్ బుక్కంటే క్రేజ్ తగ్గిందనుకోవాలా

ఒకప్పుడు గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డులో పేరు సంపాదించుకోవడమంటే అదో పెద్ద ఘనతగా భావించే వాళ్ళు. పెద్ద పెద్ద…

8 hours ago

నంది అవార్డులు వచ్చేస్తున్నాయహో…

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వం ప్రకటించే నంది అవార్డుల‌కు ఎంత విలువ ఉండేదో తెలిసిందే. వాటిని జాతీయ అవార్డుల‌తో స‌మానంగా చూసేవారు.…

10 hours ago

ఆలస్యం జరిగింది ఇక ఆగడం ఉండదు

టాలీవుడ్ సినిమాలకు అదేం శాపమో అర్థం కాదు కానీ కొన్నింటికి ప్రభుత్వాల నుంచి జిఓలు సకాలంలో రావు, చివరి నిమిషం…

11 hours ago