2020 డిసెంబరు 25.. టాలీవుడ్లో ఇది ఒక కీలకమైన రోజు అనడంలో సందేహం లేదు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దాదాపు తొమ్మిది నెలల పాటు మూత పడ్డ థియేటర్లు ఈ మధ్యే తెరుచుకున్నాయి. పున:ప్రారంభం తర్వాత కూడా థియేటర్లు వెలవెలబోతున్నాయి. ఐతే ఎట్టకేలకు వాటిలో కళను తీసుకొచ్చే సినిమా రిలీజవుతోంది.
సాయిధరమ్ తేజ్ హీరోగా కొత్త దర్శకుడు సుబ్బు రూపొందించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ శుక్రవామే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇన్నాళ్లూ థియేటర్లలో సినిమాల ప్రదర్శించడంపై ఒక దోబూచులాట నడిచింది. 50 శాతం ఆక్యుపెన్సీతో ఏం రిలీజ్ చేస్తాం.. రిలీజ్ చేసినా థియేటర్లకు వచ్చి జనం చూస్తారా అన్న అనుమానంతో నిర్మాతలు వెనుకంజ వేస్తే.. కొత్త సినిమాలు లేకుంటే జనం ఏం చూస్తారు, అవి వస్తే ఆటోమేటిగ్గా జనాలు థియేటర్లకు వస్తారు అన్నట్లుగా థియేటర్లు వెనుకంజలో ఉన్నాయి. వేరే కారణాలు కూడా తోడై పూర్తి స్థాయిలో థియేటర్లను తెరవలేదు.
ఐతే ఈ అనుమానాల మధ్యే ‘సోలో బ్రతుకే సో బెటర్’ను క్రిస్మస్ రేసులో నిలిపారు. ఐతే అనుమానాలను పటా పంచలు చేస్తూ ఈ చిత్రానికి మంచి స్థాయిలోనే అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. సినిమాకు క్రేజ్ బాగానే ఉంది. లాక్ డౌన్ తర్వాత రిలీజవుతున్న తొలి పేరున్న సినిమా కావడంతో ఇండస్ట్రీ జనాలకు దీనిపై భారీ ఆశలే ఉన్నాయి.
థియేటర్లలో తెలుగు సినిమా రీస్టార్ట్‌గా పేర్కొంటూ ఈ చిత్రానికి ఇండస్ట్రీ ప్రముఖులందరూ తమ వంతుగా సపోర్ట్ ఇస్తున్నారు. దాన్ని తమ వంతుగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ రకంగా ‘సోలో..’కు అన్నీ బాగానే కలిసొచ్చాయి. కానీ అన్నింటికంటే మించి సినిమాకు పాజిటివ్ టాక్ రావడం కీలకం. అది లేకుంటే ఎంత ప్రమోట్ చేసినా, రిలీజ్ ముంగిట ఎంత హైప్ వచ్చినా వేస్ట్. మరి ఆ విషయంలో తేజు సినిమా ఏం చేస్తుందన్నది కీలకం. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం మంచి వసూళ్లు రాబట్టి టాలీవుడ్లో కాన్ఫిడెన్స్ నింపి మున్ముందు మరిన్ని కొత్త సినిమాలు రిలీజవుతాయనడంలో సందేహం లేదు.
This post was last modified on December 25, 2020 12:51 pm
టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…
ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…
ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…
టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…
పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…