Movie News

నిన్నటిదాకా పొగడ్తలు… నేడు తిట్లు

నాలుగు రోజుల కిందట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన కొత్త చిత్రం ‘పెద్ది’ నుంచి ఒక గ్లింప్స్ లాంచ్ అయింది. అందులో చరణ్ స్టన్నింగ్ మేకోవర్ చూసి మెగా అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులంతా షాకయ్యారు. ఇప్పటిదాకా సౌత్ ఇండియాలో ఏ స్టార్‌కూ సాధ్యం కాని రీతిలో చరణ్ కనిపించిన తీరు.. అతణ్ని బుచ్చిబాబు ప్రెజెంట్ చేసిన వైనానికి అభిమానులు ఫిదా అయిపోయారు. ఇప్పటిదాకా ‘పెద్ది’ సినిమాలో చరణ్‌‌ను క్రికెటర్‌గా చూపిస్తూ వచ్చి.. ఉన్నట్లుండి ఇప్పుడిలా కుస్తీ యోధుడిగా చూపించడంతో ఫ్యాన్స్ షాకయ్యారు.

అసలేం ప్లాన్ చేశావయ్యా బుచ్చిబాబూ అంటూ.. అతడికి ఎలివేషన్లు ఇచ్చారు. ఆచార్య, గేమ్ చేంజర్ లాంటి డిజాస్టర్ల తర్వాత కాస్త కడుపు నింపే సినిమా కోసం చూస్తుంటే.. ఏకంగా అద్భుతమైన విందు భోజనమే పెట్టేలా ఉన్నాడని బుచ్చిబాబును తెగ పొగిడేస్తున్నారు మెగా ఫ్యాన్స్. అలాంటి అభిమానులే నిన్నట్నుంచి ఈ దర్శకుడి మీద విరుచుకుపడుతున్నారు.

ఇప్పటికే మార్చి 27 నుంచి ఏప్రిల్ 30కి వాయిదా పడింది ‘పెద్ది’. ఈ డేట్‌కు పక్కా అనుకుంటుంటే.. ఇప్పుడు మళ్లీ వాయిదా అని జోరుగా ప్రచారం జరుగుతోంది. సినిమాను క్వాలిటీగా కోసమే టైం తీసుకుంటున్నారని.. హడావుడి వద్దనుకుంటున్నారని పేర్కొంటూ వాయిదా వార్తలు వస్తున్నాయి. ‘పెద్ది’ టీం నుంచే ఈ లీక్స్ వచ్చినట్లుగా కనిపిస్తోంది.

అభిమానులను కూల్ చేసి, వాయిదాకు ప్రిపేర్ చేస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఐతే ‘పెద్ది’ని వాయిదా వేయాలనుకున్నది నిజమైతే.. నాలుగు రోజుల ముందే ఆ స్పష్టత వచ్చి ఉంటుంది కదా అన్నది అభిమానుల వాదన. అలాంటపుడు బర్త్ డే గ్లింప్స్‌లో ‘ఏప్రిల్ 30న గ్రాండ్ రిలీజ్’ అని ఎందుకు ప్రటించాలని వారు ప్రశ్నిస్తున్నారు. 

‘పెద్ది’ చిన్నా చితకా సినిమా కాదు కదా, పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కావాల్సిన భారీ చిత్రం కదా.. అలాంటి సినిమా రిలీజ్ విషయంలో ఇదేం ప్లానింగ్.. ఏంటీ ఆటలు.. అని మండిపడుతున్నారు అభిమానులు. ఏప్రిల్ 30కి సినిమాను రెడీ చేయలేమన్న విషయం మార్చి 27 నుంచి వాయిదా వేసినపుడే క్లారిటీ ఉండి ఉంటుందని..

అప్పుడే వేరే డేట్ చూసుకోవాల్సిందని.. ఇలా ఊరించి ఊరించి ఉస్సూరుమనిపించడం.. పదే పదే వాయిదా వేయడం సినిమాకు మంచిది కాదని.. బుచ్చిబాబు ఇలా చేస్తాడనుకోలేదని అతడి మీద అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల ముందు వరకు తెగ పొగుడుతున్న ఫ్యాన్సే ఇప్పుడు ఈ స్థాయిలో ఎటాక్ చేస్తుండడం బుచ్చిబాబుకు తీవ్ర ఇబ్బందికరంగా మారి ఉండొచ్చు.

This post was last modified on March 30, 2026 4:26 pm

Share

Recent Posts

గాంధీ జయంతి ఇంత రష్ ఉందేంటి

అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…

56 minutes ago

80′ s ట్రెండ్… చంద్రబాబు రూటే సెపరేటు

సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్‌’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…

2 hours ago

AI కోసం లక్షల కోట్లు… లాభాలు రాకపోతే ఏం జరుగుతుంది?

చాట్‌జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…

3 hours ago

జగన్ లోనూ ఓ కాక్రోచ్

నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…

3 hours ago

వృషకర్మ… తెలివైన పని చేసిందమ్మ

ఫౌజీ విడుదల వాయిదా గురించి అసలైన మైత్రి మూవీ మేకర్స్ ఇంకా చెప్పలేదు కానీ మిగిలిన సినిమాలు అలెర్ట్ అయిపోయి…

4 hours ago

యూపీఐ లో కొత్త షార్ట్‌కట్… స్కాన్ లేకుండానే పేమెంట్

షాప్‌లో యూపీఐ పేమెంట్ చేయాలంటే ప్రస్తుతం ఫోన్‌లో యాప్ ఓపెన్ చేసి, కెమెరాతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నాం. ఇక…

5 hours ago