రెండు తెలుగు రాష్ట్రాల్లో చాన్నాళ్ల తర్వాత థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకుంటున్నాయి. ఇప్పటిదాకా సింగిల్ స్క్రీన్లు చాలా వరకు మూత పడే ఉన్నాయి. మల్టీప్లెక్సులు సైతం పూర్తి స్థాయిలో తెరుచుకోలేదు. శుక్రవారం క్రిస్మస్ కానుకగా రిలీజవుతున్న ‘సోలో బ్రతుకే సో బెటర్’తోనే థియేటర్లలో మళ్లీ సందడి నెలకొంటుందని భావిస్తున్నారు.
ఐతే తొమ్మిది నెలల తర్వాత థియేటర్లు తెరుచుకుంటున్న నేపథ్యంలో అక్కడ అంతా సరిగ్గానే ఉందా.. షో సరిగ్గానే పడుతుందా.. ఏవైనా ఇబ్బందులున్నాయా.. అని చూసుకోవడానికి ముందు రోజు వేరే సినిమాతో ట్రయల్ వేసినట్లుగా ఉంది వ్యవహారం. గురువారం రామ్ గోపాల్ వర్మ ‘మర్డర్’ సినిమా విడుదలైంది. ఈ సంగతి జనాలకు పెద్దగా తెలియదు. ఆయన కూడా ఈ సినిమా రిలీజ్ గురించి పెద్దగా హడావుడి చేయట్లేదు. ఏ రకమైన పబ్లిసిటీ లేదు.
అయినప్పటికీ ‘మర్డర్’కు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే థియేటర్లు దక్కాయి. హైదరాబాద్‌లో పదుల సంఖ్యలో థియేటర్లలో ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు. కానీ జనాల నుంచి స్పందన అంతంతమాత్రంగానే ఉంది. థియేటర్లు వెలవెలబోతున్నాయి. బుకింగ్స్ నామమాత్రంగా ఉన్నాయి. లీగల్ ఇష్యూస్ ఉన్న నేపథ్యంలో ఈ సినిమా అసలు గురువారం విడుదలవుతుందా అన్న సందేహాలు కూడా కలిగాయి. కానీ వాటిని దాటుకుని సినిమా అనుకున్న ప్రకారమే రిలీజైంది. కాకపోతే జనాలే పెద్దగా రావట్లేదు.
ఐతే ఇదేమీ పట్టించుకోకుండా.. శుక్రవారం పేరున్న సినిమా రిలీజవుతున్న నేపథ్యంలో ముందు రోజు థియేటర్లలో ప్రొజెక్షన్ సహా అన్నీ సక్రమంగా ఉన్నాయో లేదో చూసుకోవడానికి ట్రయల్ రన్ లాగా ‘మర్డర్’ను నడిపిస్తున్నాయి థియేటర్లు. ఈ ఒక్క రోజుకు ఈ చిత్రాన్ని పరిమితం చేసి రేపట్నుంచి తేజు సినిమాను ఆడించబోతున్నారు. ఎలాగూ ‘మర్డర్’కు మంచి టాక్ ఏమీ లేదు. జనాల్లో అసలు దీని గురించి చర్చే లేదు. కాబట్టి థియేటర్లకు ట్రయల్ వెర్షన్ లాగా ఉపయోగపడి రేపట్నుంచి అడ్రస్ లేకుండా పోనుందన్నమాట ‘మర్డర్’.
This post was last modified on December 24, 2020 7:40 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…