సోషల్ మీడియా ట్రెండ్స్ చూస్తుంటే పై ప్రశ్నకు ఔననే సమాధానం వస్తుంది. లెనిన్ కొత్త విడుదల తేదీని జూన్ 26కి ప్రకటించడంతో ఒక్కసారిగా అక్కినేని అభిమానులు భగ్గుమంటున్నారు. వాళ్ళ ఆగ్రహానికి కారణం లేకపోలేదు. లెనిన్ మే 1 వస్తుందని ముందు నుంచి బలంగా నమ్మారు. ఇప్పుడు పెద్ది ఏప్రిల్ 30 వస్తుంది కాబట్టి దాని కోసం త్యాగం చేశామనే రీతిలో నిర్మాతలు వివరణ ఇవ్వడంతో వాళ్లకు కన్విన్సింగ్ గా అనిపించడం లేదు. ఎందుకో చూద్దాం.
లెనిన్ ఇంకొంత భాగం పెండింగ్ ఉంది. ఇదేమి విజువల్ గ్రాండియర్, విఎఫ్ఎక్స్ ఎక్కువగా ఉన్న మూవీ కాదు కాబట్టి షూటింగ్ కు ఎక్కువ టైం అవసరం లేదు. సరే పెద్ది కోసం పోస్ట్ పోన్ చేశారని అనుకున్నా దానికి రెండు నెలల గ్యాప్ ఎందుకనేది అసలు క్వశ్చన్. పెద్ది బ్లాక్ బస్టర్ అయినా సరే మహా అయితే నెల రోజుల కంటే ఎక్కువ థియేటర్ రన్ ఉండదని, ఎలాగూ నాలుగు వారాల ఓటిటి అగ్రిమెంట్ చేసుకుని ఉంటారు కాబట్టి జూన్ మొదటివారానికి డిజిటల్ లో వచ్చేస్తుందని అఖిల్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.
అలాంటప్పుడు లెనిన్ మే మధ్యలోనో చివరి వారంలోనో వదలకుండా ఇంత జాప్యం చేస్తూ, పైగా పెద్దిని సాకుగా చూపిస్తారా అంటూ నిలదీస్తున్నారు. సితార బ్యానర్ లో చాలా సినిమాలు ఇలా వాయిదాల పర్వంలో నలిగినవే. అయితే అన్నపూర్ణ స్టూడియోస్ భాగస్వామ్యం ఉంది కాబట్టి నాగార్జున ఎక్కువ డిలే లేకుండా చూస్తారని భావించారు. కానీ ఆయన కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉండిపోయారని సిచువేషన్ చూస్తే అర్థమైపోతుంది.
వినరో భాగ్యము విష్ణుకథ ఫేమ్ మురళికిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన లెనిన్ లో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. రఫ్ పల్లెటూరి లుక్ లో అఖిల్ కొత్తగా ఉన్నాడు. ఆల్రెడీ రిలీజైన పాట మంచి బజ్ తెచ్చుకుంది. జూన్ మొదటి వారంలో టాక్సిక్ లాంటి ప్యాన్ ఇండియా మూవీస్ ఉన్నాయి కాబట్టే లెనిన్ ని కాస్త దూరం తీసుకెళ్లాల్సి వచ్చిందని ప్రొడక్షన్ హౌస్ టాక్. ఏది ఏమైనా లెనిన్ బ్లాక్ బస్టర్ అవ్వాలనేది అందరి కోరిక.
This post was last modified on March 28, 2026 9:22 pm
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…
ఒక జాతీయ సెలవు దినం రోజు ఎనిమిది సినిమాలు విడుదలైతే ఆ వీకెండ్ మొత్తం థియేటర్లు కళకళలాడిపోవాలి. వాటిలో సగం…
ఏదైనా కథ, పాత్ర, లేదా పాట విషయంలో పాత సినిమాల నుంచి స్ఫూర్తి పొందడం కొత్తేమీ కాదు. ఐతే అలా…
నిన్న ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా గురించి నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చే ప్రయత్నం…
నిన్న కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' టైటిల్ రివీల్ టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అరిటాకులో భోజనాలు వడ్డించే ఒక…
సరైనోడు ఇచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు బోయపాటి శీను కాంబోలో ఒక సినిమా తెరకెక్కే అవకాశముందంటూ నిన్న…