నాలుగేళ్ల ముందు వరకు రిషబ్ శెట్టి అంటే కన్నడలో ఒక మిడ్ రేంజ్ హీరో, దర్శకుడు. కానీ కాంతార అనే సినిమా అతణ్ని పాన్ ఇండియా స్థాయిలో పెద్ద స్టార్ హీరో, డైరెక్టర్‌ను చేసేసింది. దీనికి కొనసాగింపుగా గత ఏడాద వచ్చిన కాంతార: చాప్టర్ 1 సినిమా ఏకంగా రిషబ్‌ను ఏకంగా వెయ్యి కోట్ల క్లబ్బుకు చేరువగా తీసుకెళ్లింది. ఈ రెండు చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిలిమ్స్‌తో రిషబ్‌కు మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే.
ఐతే ఆ సంస్థను ఉన్నట్లుండి సోషల్ మీడియాలో రిషబ్ అన్ ఫాలో చేయడం చర్చనీయాంశంగా మారింది. రషబ్ కేవలం హోంబలేను అన్ ఫాలో చేయడంతో ఆగిపోలేదు. కాంతార: చాప్టర్ 1లో తనతో జత కట్టిన రుక్మిణి వసంత్‌ను.. అలాగే తనకు ఆప్త మిత్రుడైన రాజ్.బి.శెట్టిలను కూడా సోషల్ మీడియాలో అనుసరించడం మానేశాడు. ఒక్క రోజు వ్యవధిలో ఇలా మూడు ముఖ్యమైన అకౌంట్లను రిషబ్ అన్ ఫాలో చేయడం హాట్ టాపిక్‌గా మారింది కన్నడ ఇండస్ట్రీలో.
కాంతార ఫ్రాంఛైజీ చిత్రాలతో రిషబ్ కెరీరే మారిపోయింది. అతడి రేంజ్ అమాంతం పెరిగింది. ఈ సినిమాలతో హోంబలే కూడా భారీగా లాభాలు మూటగట్టుకుంది. దీంతో రిషబ్, హోంబలే ప్రయాణం సుదీర్ఘ కాలం కొనసాగుతుందని.. వీరి కలయికలో కాంతార-3 కూడా వస్తుందని అంచనా వేస్తుండగా.. ఆ సంస్థ అధినేత విజయ్ కిరగందూర్‌తో రిషబ్‌కు ఏం విభేదాలు తలెత్తాయో అర్థం కావడం లేదు. మరోవైపు రుక్మిణితో గొడవేంటన్నది కూడా తెలియడం లేదు.
ఇక రాజ్.బి.శెట్టితో అయితే రిషబ్‌ది చాలా క్లోజ్ రిలేషన్‌షిప్. రిషబ్, రాజ్, రక్షిత్ ముగ్గురూ ఆప్త మిత్రులు. కన్నడ సినిమా రాతను మార్చిన వ్యక్తులుగా ఈ ముగ్గురికి మంచి పేరుంది. రాజ్, రిషబ్ కలయికలో కొన్ని సినిమాలు కూడా వచ్చాయి. మరి అతడిని రిషబ్ సడెన్‌గా ఎందుకు అన్ ఫాలో చేశాడు.. ఒకేసారి మూడు ముఖ్యమైన అకౌంట్లను అతను అనుసరించడం మానేయడంలో ఏం మతలబు ఉందో అని కన్నడ సినీ ప్రియులు చర్చించుకుంటున్నారు. దీనిపై రిషబ్ క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates